
సాక్షి,ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్787 పాయింట్లు ఎగిసి 60787 వద్ద, నిఫ్టీ 225 పాయింట్ల లాభపడి 18012 వద్ద పటిష్టంగా ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి.
అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, ఐషర్ మోటార్స్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితరాలు భారీ లాభాల్లో ముగిసాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, డా రెడ్డీస్, ఎ న్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, బ్రిటానియా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 82.78 వద్ద ఉ ముగిసింది. శుక్రవారం 82.47 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.