
ముంబై: దీపావళి వెలుగులు కొనసాగిస్తూ దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ చేయడం ద్వారా 44,000 పాయింట్ల మైలురాయిని సైతం దాటేసింది. 44,161కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 12,934 వరకూ ఎగసింది. 13,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. వెరసి మళ్లీ సరికొత్త గరిష్టాల రికార్డులను సాధించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో 43,987 వద్ద కదులుతోంది. నిఫ్టీ 92 పాయింట్లు అధికంగా 12,872 వద్ద ట్రేడవుతోంది. మోడర్నా ఇంక్ వ్యాక్సిన్‌పై ఆశలతో సోమవారం యూఎస్ మార్కెట్లు సైతం చరిత్రాత్మక గరిష్టాలను అందుకోవడం గమనార్హం!
మెటల్, బ్యాంక్స్ జోరు
ఎన్ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్ 2-1 శాతం చొప్పున ఎగశాయి. ఐటీ, ఫార్మా 0.5 శాతం స్థాయిలో క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్, టాటా మోటార్స్, హిందాల్కో, ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, శ్రీ సిమంట్, గెయిల్, ఏషియన్ పెయింట్స్ 4.2-1.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే బీపీసీఎల్, హీరో మోటో, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఐషర్, ఐవోసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ 3.7-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
ఐడియా అప్
డెరివేటివ్స్‌లో ఐడియా, అంబుజా, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, జిందాల్ స్టీల్, భారత్ ఫోర్జ్ 4.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐబీ హౌసింగ్, పిరమల్, టొరంట్ ఫార్మా, మ్యాక్స్ ఫైనాన్స్, ఆర్‌ఈసీ, మణప్పురం, కోఫోర్జ్, ముత్తూట్ 3.6-1.4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.25 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,029 లాభపడగా.. 702 నష్టాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment