రికార్డు గరిష్టాల్లో స్టాక్ మార్కెట్లు | Markets close at record highs: Sensex rises 136 points, Nifty settles above 9,650 for first time | Sakshi
Sakshi News home page

రికార్డు గరిష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Published Fri, Jun 2 2017 3:48 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

Markets close at record highs: Sensex rises 136 points, Nifty settles above 9,650 for first time

దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 135.70 పాయింట్ల లాభంలో 31,273.29 వద్ద ముగియగా.. నిఫ్టీ 37.40 పాయింట్ల లాభంతో తొలిసారి 9650 మార్కుకు పైన నిలిచింది. హీరో మోటార్ కార్పొ, సిప్లా రెండు సూచీల్లో లాభాలు పండించగా.. గెయిల్, టాటా స్టీల్, బీపీసీఎల్ టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి. ఇంట్రాడేలో హీరో మోటార్ కార్పొ స్టాక్ ధర సరికొత్త రికార్డు స్థాయిలను తాకింది. మే నెలలో విక్రయాల వృద్ధి జోరుగా ఉండటంతో 3 శాతం పైగా లాభపడిన ఈ స్టాక్ ధర రూ.3,849ను తాకింది.
 
అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో భారీ లాభాలతో మొదలైన మార్కెట్లు, సెన్సెక్స్‌ 31,333 నిఫ్టీ  9673 వద్ద  సరికొత్త రికార్డ్‌ స్థాయిలను నమోదు చేశాయి. ఫార్మా, ఆటో స్టాక్స్ నేటి ట్రేడింగ్ లో మంచి జోరును కొనసాగించాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 64.45 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా స్వల్పంగా 2 రూపాయల నష్టంతో 28,650గా నమోదయ్యాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement