![fuel prices come down by 87 paise - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/22/petrol.jpg.webp?itok=_XnGZIZC)
న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో చమురు సంస్థలు కూడా స్వల్పంగా ఇంధన ధరలను తగ్గించాయి. ఇంధన ధరల తగ్గింపు వరుసగా నాల్గవరోజైన ఆదివారం కూడా కొనసాగింది. ఆదివారం లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 17పైసలను సంస్థలు తగ్గించాయి. దీంతో సవరించిన రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 81.74 ఉండగా, డీజిల్ ధర రూ.75.19 గా ఉంది. వరుసగా నాలుగురోజులపాటు చమురు ధరలను తగ్గించడంతో మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో లీటరు పెట్రోల్‌పై రూ.1.09, డీజిల్‌పై 50 పైసలు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment