సాక్షి, న్యూఢిల్లీ: దిగి వస్తున్న పెట్రో ధరలు వాహనదారులకు ఊరటనిస్తున్నాయి. వరుసగా 13వరోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. మంగళవారం, పెట్రోలు పై 20 పైసలు, డీజిల్‌పై 7 పైసలు ధరను దేశీయ కంపెనీలు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో లీటరుకు పెట్రోలు ధర రూ. 79.55 గాను, డీజిల్ ధర లీటరుకు రూ. 73.78 గా ఉంది. ముంబైలో పెట్రోలు లీటరు ధర. 85.04, డీజిల్ ధర లీటరుకు రూ. 77.32 పలుకుతోంది..
కోలకతా : పెట్రోలు లీటరు ధర రూ. 81.63, డీజిల్ ధర లీటరుకు రూ .75.70
చెన్నై: పెట్రోలు లీటరు ధర రూ. 82.86 , డీజిల్ ధర లీటరుకు 78.08 రూపాయలు
హైదరాబాద్ : పెట్రోలు లీటరు ధర రూ. 84.33, డీజిల్ ధర లీటరుకు రూ.80.25
విజయవాడ : పెట్రోలు లీటరు ధర రూ.83.47, డీజిల్ ధర లీటరుకు రూ. 79 లు
అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పడుతున్న కారణంగా దేశీయంగా ఇంధన ధరలు ఆరు వారాల కనిష్ఠానికి చేరాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత దిగి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment