ప్రతీకాత్మక చిత్రం
కొలంబో: శ్రీలంక సంక్షోభంతో అతలాకుతలమవుతోంది. ఆర్థిక, ఆహార సంక్షోభంతో కుదేలవుతోంది. విదేశీ మారక నిల్వలు సరిపడా లేక విదేశీ దిగుమతులకు కూడా డబ్బులు చెల్లించలేని దుస్థితిలో పడిపోయింది ద్వీప దేశ శ్రీలంక. నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి.
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్ రేట్లతో జనం నానా అగచాట్లు పడుతున్నారు. ముఖ‍్యంగా రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోలు ధరలకు తోడు అక్కడి ప్రభుత్వ ఆంక్షలు సామాన్య జనానికిచుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు పెట్రోలు బంకుల దగ్గర జనం భారీగా క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా క్యూలైన్‌లో ఒక ఆటో డ్రైవర్ డాన్స్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఏఆర్‌రహమాన్ స్వరపర్చిన ముక్కాలా.. ముకాబులా పాట ఆయన చేసిన డాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
#SriLanka: The petrol queue dance (to @arrahman's music from 1994) - received via whatsapp. Hoping to see him sometime when I'm in line. #lka #SriLankaEconomicCrisis pic.twitter.com/e42hiiLWmi
— Meera Srinivasan (@Meerasrini) June 16, 2022
Comments
Please login to add a commentAdd a comment