que lines
-
అయోధ్యలో శ్రీరామ నవమి సన్నాహాలు.. 24 గంటలూ దర్శనం!
అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి. ఆరోజు అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు తెలిపారు. శ్రీరామ నవమినాడు ఆలయంలో జరిగే పూజాదికార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని చంపత్ రాయ్ తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ నగరంలో 100 చోట్ల ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయనుందని అన్నారు. ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి తమ సూచనను ప్రసార భారతి ఆమోదించిందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎండబారిన పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. శ్రీరామ నవమికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని భావిస్తున్నామన్నారు. రామాలయంలో భక్తుల దర్శనం కోసం ఏడు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చంపత్ రాయ్ తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు లైన్లు మాత్రమే ఉన్నాయని, మరో మూడు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భక్తులు తమ వెంట ఆలయంలోనికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని తెలిపారు. దర్శనం త్వరగా జరిగేలా పలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాన్ని ఏప్రిల్ 16, 17, 18వ తేదీల్లో మూడు రోజుల పాటు 24 గంటలూ తెరిచివుంచేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశప్రజలంతా ప్రసార భారతి ద్వారా, ఇంట్లో నుంచే రామ్‌లల్లాను దర్శించుకోవచ్చన్నారు. -
HYD Long Queues At Petrol Pumps:హైదరాబాద్‌లో వాహనదారులకు పెట్రో ట్రబుల్స్ (ఫొటోలు)
-
యాపిల్ స్టోర్ ముందు బారులుతీరిన కస్టమర్లు
ఢిల్లీలోని సాకేత్‌లో ఉన్న సెలెక్ట్ సిటీవాక్ మాల్లో గురువారం (ఏప్రిల్ 20) యాపిల్ రెండో స్టోర్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ప్రారంభించారు. స్టోర్ తెరవకముందే తెల్లవారుజాము నుంచే కస్టమర్లు, ఢిల్లీ నగరవాసులు పెద్దఎత్తున తరలి వచ్చారు. స్టోర్ బయట క్యూలో నిలబడ్డారు. (Apple Retail Store In Delhi: రెండో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్) యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో స్టోర్ ప్రారంభానికి ముందే కస్టమర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాపిల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. ఉత్పత్తుల కొనుగోలు కంటే స్టోర్‌ను సందర్శాలనే ఉద్దేశంతో చాలా మంది తరలివచ్చారు. #WATCH | People stand in queues at Delhi's Select City Walk Mall in Saket to witness the opening of India’s second Apple Store. pic.twitter.com/9mwk5gZmlu — ANI (@ANI) April 20, 2023 కాగా ముంబై స్టోర్ తర్వాత ఢిల్లీలో ప్రారంభించిన ఈ యాపిల్ స్టోర్ భారత్‌లో రెండోది. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్లు, ఐప్యాడ్లకు కస్టమర్ల నుంచి అధిక డిమాండ్ ఉంది. అలాగే యాపిల్ టీవీలు, వాచ్‌లు, మొబైల్‌కు సంబంధించిన యాక్సెసరీలను ఈ స్టోర్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచారు. ఇదీ చదవండి: apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది! -
ఐదు పైసలకే బిర్యానీ.. క్యూ కట్టిన జనం.. పోలీసుల లాఠీ చార్జ్
సాక్షి, బొమ్మలసత్రం: డిసెంబర్ 31 (2022 చివరి రోజు) సందర్భంగా నంద్యాల పట్టణంలోని క్లాసిక్ జైల్ రెస్టారెంట్ నిర్వాహకులు పాత 5 పైసల నాణెం ఇస్తే బిర్యానీ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. దీని కోసం 5 పైసల నాణేలు తీసుకొచ్చి వందల మంది స్థానిక పద్మావతి నగర్‌లోని రెస్టారెంట్ వద్ద గుమిగూడారు. ప్రజలు భారీగా తరలిరావటంతో రహదారిలో ట్రాఫిక్ జామ్ అయింది. బిర్యానీ కోసం జనాల మధ్య తోపులాట జరిగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. జనాలను అక్కడి నుంచి పంపి రెస్టారెంట్‌కు పోలీసులు తాళం వేశారు. ఇందుకు కారణమైన రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. చదవండి: (రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్) -
అటు పెట్రో సంక్షోభం: ఇటు రహమాన్ పాటకు డాన్స్‌తో ఫిదా!
కొలంబో: శ్రీలంక సంక్షోభంతో అతలాకుతలమవుతోంది. ఆర్థిక, ఆహార సంక్షోభంతో కుదేలవుతోంది. విదేశీ మారక నిల్వలు సరిపడా లేక విదేశీ దిగుమతులకు కూడా డబ్బులు చెల్లించలేని దుస్థితిలో పడిపోయింది ద్వీప దేశ శ్రీలంక. నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్ రేట్లతో జనం నానా అగచాట్లు పడుతున్నారు. ముఖ్యంగా రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోలు ధరలకు తోడు అక్కడి ప్రభుత్వ ఆంక్షలు సామాన్య జనానికిచుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు పెట్రోలు బంకుల దగ్గర జనం భారీగా క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా క్యూలైన్లో ఒక ఆటో డ్రైవర్ డాన్స్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఏఆర్రహమాన్ స్వరపర్చిన ముక్కాలా.. ముకాబులా పాట ఆయన చేసిన డాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. #SriLanka: The petrol queue dance (to @arrahman's music from 1994) - received via whatsapp. Hoping to see him sometime when I'm in line. #lka #SriLankaEconomicCrisis pic.twitter.com/e42hiiLWmi — Meera Srinivasan (@Meerasrini) June 16, 2022 -
వైరల్ వీడియో.. ఇట్స్ బిర్యానీ టైం బ్రో!
బెంగళూరు: కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చినప్పుడు చూడాలి జనాలను. షాపులు తెరవక ముందే వెళ్లి క్యూలో నిల్చున్నారు. దాదాపు ప్రతి మద్యం దుకాణం దగ్గర కిలోమీటర్ల మేర వరుసలో నిలబడిన జనాలను చూశాం. ప్రస్తుతం కర్ణాటకలో కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది. కాకపోతే అది మద్యం దుకాణం ముందు కాదు. ఓ రెస్టారెంట్ ముందు. అవును బిర్యానీ కోసం జనాలు ఓ హోటల్ ముందు కిలోమీటర్ మేర క్యూలో నిల్చున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు చూడండి.. తాజాగా కర్ణాటకలో రెస్టారెంట్లు తెరవడానికి అనుమతించారు. ఈ క్రమంలో బెంగళూరుకు సమీపంలోని హోస్కోట్లోని ఆనంద్ రెస్టారెంట్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి చెందింది. (చదవండి: లాక్‌డౌన్‌లోనూ భలే లాగించేశారు..!) ఈ నేపథ్యంలో ఆదివారం రెస్టారెంట్ తెరుస్తున్నారనే సమాచారంతో బిర్యానీ ప్రియులు ఇలా హోటల్ వద్దకు చేరుకున్నారు. దాదాపు 1.5కిలోమీటరు పొడవున వందలాది మంది కస్టమర్లు రెస్టారెంట్ బయట క్యూ కట్టారు. దీన్ని కాస్త ఓ ట్విట్టర్ యూజర్ వీడియో తీసి షేర్ చేశారు. ‘ఇది ఏ బిర్యానీ.. ఉచితంగా ఇస్తున్నారా ఏంటి’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘మద్యం దుకాణాల ముందు మాత్రమే ఇంత భారీ క్యూలు చూశాం.. బిర్యానీనా మజాకా’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
ఎంపీలంతా క్యూల్లో నిల్చోండి: పవన్
కేంద్రంలోని ఎంపీలంతా, నోట్లరద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలకు సంఘీభావం తెలపడానికి బ్యాంకుల దగ్గర క్యూ లో నిలబడితే బాగుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాగే ఆంధ్రా బీజేపీ ఎంపీలు, తెలంగాణ ఎంపీలు కూడా ఏటీఎంలు, బ్యాంకుల దగ్గర నిలబడి తమ వంతు మద్దతు ప్రకటిస్తే ప్రజలకి కాస్త దైర్యంగా ఉంటుందని పవన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరోవైపు కర్నూలు జిల్లా నంది కొట్కూరులోని బ్యాంకులో తన డబ్బులు డ్రా చేయడం కుదరక కుప్పకూలి మృతిచెందిన బాలరాజు కుటుంబానికి పవన్ కళ్యాణ్ ప్రగాడ సానుభూతి తెలిపారు. పట్టణంలోని మద్దూరు సుబ్బారెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న బాలరాజు(65) వెటర్నరీ డిపార్ట్మెంట్లో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసి 2010లో పదవీ విరమణ చేశాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు. రెండవ కోడలు ఇటీవల డెలివరీ అయిన నేపథ్యంలో డబ్బు అవసరమై ఐదు రోజులుగా నగదు కోసం స్థానిక ఎస్బీఐ చుట్టూ తిరుగుతున్నాడు. రోజూ క్యూలో నిల్చోవడం.. డబ్బు లేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో తిరిగి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకే బ్యాంకుకు చేరుకుని క్యూలో నిల్చోగా కౌంటర్ వద్దకు చేరుకునే లోపు బ్యాంకు అధికారులు నో క్యాష్ అని చెప్పడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. pic.twitter.com/E5QfwYrI07 — Pawan Kalyan (@PawanKalyan) November 26, 2016 -
నగదు కోసం అదే అవస్థ..అదే ఆవేదన
-
అదే అవస్థ.. అదే ఆవేదన
నగదు కోసం జనం పాట్లు ♦ బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల కొద్దీ పడిగాపులు ♦ పొద్దున 7 గంటల నుంచే క్యూలైన్లు.. ఏటీఎంలలో నగదు కొరత ♦ ఇంకా రాని కొత్త రూ.500 నోట్లు.. పలుచోట్ల రూ.2,000 వరకే మార్పిడి ♦ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన మొబైల్ ఏటీఎంలు సాక్షి నెట్వర్క్: వారంరోజులుగా అవే బాధలు.. అవే ఆవేదనలు.. మరింతగా పెరుగుతున్న అవస్థలు.. రాత్రి లేదు, పగలు లేదు ఎప్పుడు చూసినా జనమంతా బ్యాంకులు, ఏటీఎంల వద్దే గడుపుతున్నారు.. హైదరాబాద్‌లో అయితే అర్ధరాత్రి 2 గంటలకు చూసినా ఏటీఎంల వద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలో అబిడ్స్, సికింద్రాబాద్‌లలో మొబైల్ ఏటీఎంలను ప్రారంభించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. పరిమితంగా ఏర్పాటు చేసిన మొబైల్ కేంద్రాలు ప్రజలకు పెద్దగా ఊరటనివ్వలేకపోయాయి. మరోవైపు వారం గడిచినా కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో రూ.2000 నోట్లతో చిల్లర కోసం బాధలు తప్పడం లేదు. కొన్ని చోట్ల ఏటీఎంలలో డబ్బు నింపిన కొద్దిసేపటికే ఖాళీ అవుతున్నాయి. దీంతో అప్పటివరకు గంటల తరబడి క్యూలలో పడిగాపులు కాసిన జనం నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇక చిల్లర కొరత కారణంగా అన్ని రకాల వ్యాపార లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. తెల్లవారగానే.. రద్దీ బాగా ఉంటుండడంతో బుధవారం చాలా చోట్ల జనం ఉదయం 7 గంటల వరకే బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, కేపీహెచ్‌బీ, అంబర్పేట్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర అన్ని చోట్లా చాంతాడంత క్యూలైన్లు దర్శనమిచ్చాయి. వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నోట్ల మార్పిడి పరిమితిని రూ.4,000 నుంచి రూ.4,500కు పెంచినట్లు ప్రకటించినప్పటికీ.. ఇంకా కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో బ్యాంకుల్లో రూ.2వేలు మాత్రమే మార్పడి చేశారు. నోట్ల మార్పిడి కోసం వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం బ్యాంకులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా బుధవారం నోట్ల మార్పిడి కోసం నాంపల్లి సమీపంలోని మల్లేపల్లి ఎస్బీహెచ్ క్యూలైన్లలో ఉన్న జనానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అరటిపండ్లు, కూల్‌డ్రింక్స్ పంపిణీ చేశారు. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా, వంద నోట్లను అందుబాటులోకి తేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడం దారుణమని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దెర మీద తెచ్చి పెళ్లి.. పెద్ద నోట్ల రద్దుతో శుభకార్యాలు జరుపుకొనే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చులకు సరిపడా చిల్లర లేక దుకాణదారుల వద్ద అప్పులు పెట్టి, సామగ్రి తీసుకుంటున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్‌నగర్‌కు చెందిన పస్తం ఉప్పలయ్య కుమార్తెకు కొద్ది రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. బుధవారం ఉదయం వివాహం జరిగింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా పెళ్లికి కావాల్సిన సామగ్రి మొత్తం దుకాణదారులను బతిమాలి ఉద్దెరపై తెచ్చుకున్నారు. పెళ్లి పనులు ఉండడంతో బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడలేని పరిస్థితి మరి. తన పెళ్లి పెట్టుకున్న వారంలోనే నోట్ల రద్దు ప్రకటన రావడంతో తన తండ్రి చాలా ఇబ్బంది పడ్డారని, పెళ్లి ఎలా అవుతుందోనని చాలా ఆవేదన చెందాడని ఉప్పలయ్య కుమార్తె భారతి చెప్పారు. బాబ్బాబూ చిల్లరివ్వండి.. ఈ చిత్రం లో ఉన్నది వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం క్యాద్గిరాకు చెందిన రైతు సత్తయ్య. తాను సాగు చేస్తున్న కందిపంటకు పురుగుల మందు చల్లాలి. చేతిలో ఉన్నది నాలుగు పాత రూ.500 నోట్లు. ఎలాగోలా ఆ నోట్లు తెలిసిన వారికిచ్చి కొత్త రూ.2 వేల నోటు సంపాదించాడు. బుధవారం మండల కేంద్రానికి వెళ్లాడు. సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళితే చిల్లర లేదన్నారు. ఫెర్టిలైజర్ షాపు వద్దకు వెళ్లినా అదే సమాధానం. ఊరంతా తిరిగినా.. చిల్లర పుట్టలేదు. చివరికి ఫెర్టిలైజర్ షాపు దగ్గరికి వచ్చాడు. ‘రూ.2 వేల నోటు మీ దగ్గరే ఉంచుకుని పురుగుల మందు డబ్బాలు (రూ.800కు) ఇవ్వండి. చిల్లర వచ్చాక వచ్చి తీసుకెళ్తా.. ఖర్చులకు మాత్రం రూ.200 ఇవ్వండి..’ అని బతిమాలి పట్టుకెళ్లాడు. పురుగు చేరి పంట నాశనమవుతోంది.. ‘‘పొట్ట దశకు వచ్చిన వరి చేనుకు పురుగు సోకింది. పురుగుల మందు కొట్టాలంటే చేతిలో పైసలు లేవు. నా ఖాతాలో ఉన్న పైసల కోసం బ్యాంకుకు వచ్చిన. పొద్దున 8 గంటల నుంచి 11 గంటల దాకా లైన్ల నిలుచున్న. కానీ బ్యాంకు లోపలికి వెళ్తే పైసలు అయిపోయినయన్నరు. ఏం జేయాలో తెల్వడం లేదు..’’ – మాచెర్ల సమ్మయ్య, భూపాలపల్లి జిల్లా దేవరాంపల్లి దవాఖానా ఖర్చులకు కావాలె.. ‘‘నా మనవరాలు వర్షిణికి పదకొండు నెలలు. ఫిట్స్ వస్తున్నయి. ఇప్పటికే రెండు లక్షల దాక ఖర్చయినయి. ఇప్పుడు మళ్లీ దవాఖానాకు పోవాలె. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.17 వేలు తీసుకునేందుకు తిప్పలవుతోంది..’’ – పెగడ రాజవ్వ, పెద్దపల్లి జిల్లా చీకురాయి -
‘చిల్లర’ చంపేస్తోంది!
పెద్ద నోట్ల మార్పిడి ఆందోళనతో ఇద్దరు మృతి ♦ క్యూలైన్లలో నిలబడి గుండెపోటుతో మరణం ♦ నోట్లు చెల్లక.. వైద్యం అందక ఓ యువతి బలి ♦ రూ. 2,000 నోటుకు చిల్లర దొరకక ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య ♦ నోట్లు మార్పించుకునేందుకు వెళుతూ ప్రమాదంలో మరణించిన ఆర్టీసీ మాజీ ఉద్యోగి సాక్షి నెట్వర్క్: ‘చిల్లర’ సమస్య ప్రాణాల మీదికి తెస్తోంది.. ‘నోట్ల’ ఆందోళన జీవితాలను బలిగొంటోంది.. నోట్ల రద్దు వ్యవహారం సామాన్యులను నరక యాతన పెడుతోంది.. బ్యాంకుల ముందు క్యూలలో నిల్చున్న ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులు గుండెపోటుతో మరణించగా... నోట్లు చెల్లక, వైద్యం అందక ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మరో ఘటనలో బ్యాంకులో ఇచ్చిన రూ.2,000 కొత్త నోటుకు చిల్లర దొరకక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కసారిగా కుప్పకూలి.. తమ వద్ద ఉన్న పాత పెద్ద నోట్లను డిపాజిట్ చేయడానికి... కొత్త నోట్లు, చిల్లర నోట్లు తీసుకోవడానికి బ్యాంకుల వద్దకు వచ్చిన లక్ష్మీనారాయణ (77), పోలంకి ఇన్నయ్య (70) అనే రిటైర్డ్ ఉద్యోగులు క్యూలైన్లోనే ప్రాణాలు వదిలారు. లక్ష్మీనారాయణ స్వస్థలం అనంతపురం జిల్లా. ఆయన పంచాయతీరాజ్ విభాగంలో పనిచేసి 22 ఏళ్ల కింద రిటైర్మెంట్ తీసుకున్నారు. కొంతకాలంగా లక్ష్మీనారాయణ వెస్ట్‌మారేడుపల్లి రైల్వే కాలనీ షరోన్ రెసిడెన్సీలో పెద్ద కుమార్తె సుధారాణి, అల్లుడు భగవత్‌లతో కలసి ఉంటున్నారు. ఇటీవలే పొద్దుటూరులోని మరో కుమార్తె ఇంటికి వెళ్లి సోమవారమే తిరిగి వచ్చారు. మంగళవారం ఉదయమే ఇక్కడి ఆంధ్రాబ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడానికి అల్లుడు భగవత్‌తో కలసి వచ్చారు. లక్ష్మినారాయణ క్యూలైన్లో ఉండగా.. భగవత్ ఏదో పని మీద మరో చోటికు వెళ్లారు. అయితే లక్ష్మినారాయణ ఉదయం 10.30 గంటల సమయంలో ఆంధ్రాబ్యాంకు మెట్ల వద్ద క్యూలోనే గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఖాతాదారులు అక్కడే ఉన్న ఓ డాక్టర్ సహాయంతో ప్రథమ చికిత్స అందించారు. వెంటనే సమీపంలోని ఓ నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే లక్ష్మినారాయణ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇక పోలంకి ఇన్నయ్య ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొత్తపేటకు చెందినవారు. ఆయన ఫైర్ ఆఫీసర్‌గా పనిచేసి 2004లో రిటైరయ్యారు. నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్లు, చిల్లర నోట్లు తీసుకునేందుకు మంగళవారం ఉదయం ఫిరంగిపురంలోని ఆంధ్రా బ్యాంకు వద్దకు వచ్చారు. క్యూలైన్లో నిలబడి ఉండగానే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. నోట్లు చెల్లక యువతి బలి పాత పెద్ద నోట్లను ఆస్పత్రి నిర్వాహకులు తీసుకోకపోవడంతో.. సరైన సమయంలో వైద్యం అందక కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ఓ యువతి మృతి చెందింది. ఇక్కడి సర్దార్బస్తీకి చెందిన నాగులపల్లి మల్లయ్య–సుగుణల కుమార్తె మౌనిక (18). ఆమె కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతోంది. ఆదివారం జ్వరంతోపాటు కడుపునొప్పి రావడంతో కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం సోమవారం కరీంనగర్‌లోని ఆస్పత్రికి రిఫర్ చేశారు. మల్లయ్య పలువురి వద్ద బదులు అడిగి రూ.10 వేలు సేకరించారు. అవన్నీ రూ.500, రూ.1,000 పాత నోట్లుకావడంతో ఆస్పత్రిలో తీసుకోలేదు. దాంతో ఆ నోట్లను మార్చుకునేందుకు కాగజ్‌నగర్‌లో అంతటా తిరిగారు. సోమవారం బ్యాంకులకు సెలవుకావడంతో మార్పిడి కాలేదు. దీంతో సరైన సమయంలో పెద్దాస్పత్రికి బయలుదేరకపోవడంతో మౌనిక మరణించింది. పెద్ద నోట్ల సమస్య లేకుంటే తమ బిడ్డ బతికేదని మల్లయ్య–సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి చిల్లర దొరకలేదని.. మద్యానికి బానిసైన ఓ కూలీ.. తాగేందుకు రూ.2,000 నోటుకు చిల్లర దొరకలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీలోని గుంటూరు నగరం ఐపీడీ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఐపీడీ కాలనీలో నివాసముండే వి.శ్రీనివాసరావు (40), లక్ష్మి కూలీ పనులు చేస్తూ జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాసరావు కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజుల కిందట పాత పెద్ద నోట్లు మార్పిడి చేసుకోగా.. బ్యాంకు అధికారులు రూ. 2,000 నోటు ఇచ్చారు. దానిని తీసుకుని మద్యం షాపునకు వెళ్లగా వారు చిల్లర లేదన్నారు. పలు చోట్ల చిల్లర కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ ఆగ్రహంతోనే ఇంటికి వచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె వద్ద ఉన్న చిల్లర నోట్లు ఇవ్వడంతో మంగళవారం ఉదయం కొంత మద్యం తాగాడు. మళ్లీ ఇంటికి వచ్చి మరిన్ని డబ్బులు కావాలన్నాడు. ఆమె లేవనడంతో ఉరి వేసుకుని చనిపోతానని బెదిరించాడు. దాంతో లక్ష్మి రూ.2,000 నోటు పట్టుకుని చిల్లర కోసం బయటకు వెళ్లింది. కానీ కొద్దిసేపటికే శ్రీనివాసరావు ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకున్నాడు. నోట్లు మార్పించుకునేందుకు వెళుతూ.. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ సీఎస్ఐ చర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన అనంతరావు (69) ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. మంగళవారం పాత నోట్లను మార్చుకునేందుకు కంఠేశ్వర్‌లోని ఎస్బీఐకి స్కూటీపై బయలుదేరాడు. దారిలోనే ఇక్కడి టూటౌన్ పోలీస్‌స్టేషన్ చెందిన బొలెరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అనంతరావు తలకు తీవ్రగాయాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.