ఎంపీలంతా క్యూల్లో నిల్చోండి: పవన్
కేంద్రంలోని ఎంపీలంతా, నోట్లరద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలకు సంఘీభావం తెలపడానికి బ్యాంకుల దగ్గర క్యూ లో నిలబడితే బాగుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాగే ఆంధ్రా బీజేపీ ఎంపీలు, తెలంగాణ ఎంపీలు కూడా ఏటీఎంలు, బ్యాంకుల దగ్గర నిలబడి తమ వంతు మద్దతు ప్రకటిస్తే ప్రజలకి కాస్త దైర్యంగా ఉంటుందని పవన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మరోవైపు కర్నూలు జిల్లా నంది కొట్కూరులోని బ్యాంకులో తన డబ్బులు డ్రా చేయడం కుదరక కుప్పకూలి మృతిచెందిన బాలరాజు కుటుంబానికి పవన్ కళ్యాణ్ ప్రగాడ సానుభూతి తెలిపారు. పట్టణంలోని మద్దూరు సుబ్బారెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న బాలరాజు(65) వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసి 2010లో పదవీ విరమణ చేశాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు. రెండవ కోడలు ఇటీవల డెలివరీ అయిన నేపథ్యంలో డబ్బు అవసరమై ఐదు రోజులుగా నగదు కోసం స్థానిక ఎస్‌బీఐ చుట్టూ తిరుగుతున్నాడు.
రోజూ క్యూలో నిల్చోవడం.. డబ్బు లేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో తిరిగి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకే బ్యాంకుకు చేరుకుని క్యూలో నిల్చోగా కౌంటర్ వద్దకు చేరుకునే లోపు బ్యాంకు అధికారులు నో క్యాష్ అని చెప్పడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు.
— Pawan Kalyan (@PawanKalyan) November 26, 2016