కమీషన్ కోసం 37 కోట్ల మార్పిడి
⇒ ‘ముసద్దిలాల్’తో కలసి పవన్ అగర్వాల్ దందా
⇒ డబ్బు డిపాజిట్ చేసి,తన ఖాతాల్లోకి మళ్లింపు
⇒ అరెస్టు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు ప్రకటన వెలువడిన 2016 నవంబర్ 8న రూ.110 కోట్ల ‘వ్యాపారం’చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముసద్దిలాల్ జ్యువెలర్స్ కేసు దర్యాప్తులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ముసద్దిలాల్ యాజమాన్యాన్ని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధికారులు కటకటాల్లోకి పంపిన విషయం విదితమే. ‘అజ్ఞాత కస్టమర్ల’నుంచి నగదు వసూలు చేయడం, దాన్ని ‘ముసద్దిలాల్’ఖాతాల్లో డిపాజిట్ చేయడంతో పాటు ఆదే నగదును తన ఖాతాల్లోకి మళ్లించుకున్న మరో నిందితుడు సీసీఎస్ పోలీసులకు చిక్కాడు.
గన్‌ఫౌండ్రీ సమీపంలోని మయూరి కుషాల్ కాంప్లెక్స్‌లో శ్రీబాలాజీ గోల్డ్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్న పవన్‌అగర్వాల్‌ను అధికారులు శుక్రవారం అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు ముసద్దిలాల్ సంస్థలు, యాజమాన్యాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఆయా రోజుల్లో అయిన డిపాజిట్లు, మళ్లింపులపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే పవన్‌అగర్వాల్ దందా వెలుగులోకి వచ్చింది. ఇతడు ముసద్దిలాల్ యాజమాన్యంతో కలసి కుట్రపన్ని 30 శాతం కమీషన్‌కు రూ.37 కోట్ల పెద్దనోట్లు మార్పిడి చేసినట్లు గుర్తించారు.
నోట్ల రద్దు తర్వాత కొందరు ‘నల్లబాబు’లకు చెందిన రూ.37 కోట్లను బంగారం రూపంలో మార్చడానికి పవన్ అంగీకరించాడని, 30 శాతం కమీషన్‌కు ఒప్పందం కుదుర్చుకుని, తన దందాకు సహకరిస్తే 10 శాతం చెల్లించేలా ముసద్దిలాల్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. దీంతో ‘మూడు గంటల్లో వేల మంది కస్టమర్లకు బంగారం విక్రయించే’ప్రణాళికను సిద్ధం చేసుకున్న ముసద్దిలాల్ యాజమాన్యం పవన్ అగర్వాల్ ప్రతిపాదనలకు అంగీకరించింది. ఆ మరుసటి రోజు ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి రూ.37 కోట్లు జమ చేసిన పవన్ అగర్వాల్ ఆ మేరకు బంగారం ఖరీదు చేసినట్లు రికార్డులు రూపొందించాడు.
స్వల్ప వ్యవధిలోనే ఆ మొత్తాన్ని ముసద్దిలాల్ యాజమాన్యం పవన్‌కు చెందిన సంస్థ పేరుతో ఉన్న రెండు ఖాతా ల్లోకి మళ్లించింది. ఇదే మొత్తాన్ని వినియో గించి పవన్ అగర్వాల్ బులియన్ డీలర్ల నుంచి బంగారం ఖరీదు చేశాడని తేలింది. ఈ విష యం గుర్తించిన సీసీఎస్ పోలీసులు ముసద్ది లాల్ సంస్థలకు శ్రీబాలాజీ గోల్డ్ సంస్థకు మధ్య బంగారం క్రయవిక్రయాలకు సంబంధించి డెలివరీ, రిసీవింగ్ రసీదుల కోసం ఆరా తీశారు.
అలాంటివి లేవని తేలడంతో ఈ మొత్తం మార్పిడికి సంబంధించిందని నిర్ధారించి పవన్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. ముసద్దిలా ల్ యాజమాన్యం నవంబర్ 8 రాత్రి 9 నుంచి 12 గంటల మధ్య 5,200 మంది కస్ట మర్లు దాదాపు రూ.110 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు రికార్డులు రూపొందించి ‘మార్పిడి’కి పాల్పడిన విషయం విదితమే. ఈ మొత్తం గరిష్టంగా 30 మంది ‘నల్లబాబులకు’ చెంది నదై ఉంటుందని పోలీసులు అను మానిస్తు న్నారు. వీరి ద్వారా పెద్దనోట్లు మార్చుకున్నది ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు.