నోట్ల రద్దుపై కవితను షేర్ చేసుకున్న పవన్
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ఆకస్మికంగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు. కొత్త కరెన్సీపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అసంఘటిత పట్టణ మార్కెట్ సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ సిటిజన్స్ గురించి కూడా పట్టించుకోవాలన్నారు. ప్రజల్లో అశాంతిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు పెద్దనోట్ల రద్దుపై సామాన్యుడి స్పందన తెలియజేసే ఓ అద్భుతమైన కవితను పవన్ కల్యాణ్ షేర్ చేసుకున్నారు. సినీ రచయిత సాయిమాధవ్ దీనిని రాశారు.
‘మెతుకూ మెతుకూ కూడబెట్టి ముద్దపోగేస్తే
దొంగ కూడంటున్నారన్నా నేనెట్టా బతికేది?
కన్నీటి బొట్టూ బొట్టూ దాపెట్టి ఏడుపు పోగేస్తే
నా ఏడుపు చెల్లదంటున్నారన్నా నేనెట్టా చచ్చేది’
పెద్దనోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న కష్టాలకు అద్దంపట్టేలా సాయిమాధవ్ రాసిన ఈ హృద్యమైన కవిత నెటిజన్లను కదిలిస్తున్నది. వాస్తవిక పరిస్థితికి దర్పణం పట్టిన ఈ కవితను నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు.
Government has to spell out the actual new currency position.Rural economy and unorganized urban market is to be taken care.
— Pawan Kalyan (@PawanKalyan) 20 November 2016