
నంద్యాలలో బిర్యానీ కోసం భారీగా క్యూలో ఉన్న ప్రజలు
సాక్షి, బొమ్మలసత్రం: డిసెంబర్ 31 (2022 చివరి రోజు) సందర్భంగా నంద్యాల పట్టణంలోని క్లాసిక్ జైల్ రెస్టారెంట్ నిర్వాహకులు పాత 5 పైసల నాణెం ఇస్తే బిర్యానీ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. దీని కోసం 5 పైసల నాణేలు తీసుకొచ్చి వందల మంది స్థానిక పద్మావతి నగర్‌లోని రెస్టారెంట్ వద్ద గుమిగూడారు.
ప్రజలు భారీగా తరలిరావటంతో రహదారిలో ట్రాఫిక్ జామ్ అయింది. బిర్యానీ కోసం జనాల మధ్య తోపులాట జరిగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. జనాలను అక్కడి నుంచి పంపి రెస్టారెంట్‌కు పోలీసులు తాళం వేశారు. ఇందుకు కారణమైన రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు.