ఢిల్లీలోని సాకేత్‌లో ఉన్న సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో గురువారం (ఏప్రిల్ 20) యాపిల్ రెండో స్టోర్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ప్రారంభించారు. స్టోర్ తెరవకముందే తెల్లవారుజాము నుంచే కస్టమర్లు, ఢిల్లీ నగరవాసులు పెద్దఎత్తున తరలి వచ్చారు. స్టోర్ బయట క్యూలో నిలబడ్డారు.
(Apple Retail Store In Delhi: రెండో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్)
యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో స్టోర్ ప్రారంభానికి ముందే కస్టమర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాపిల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. ఉత్పత్తుల కొనుగోలు కంటే స్టోర్‌ను సందర్శాలనే ఉద్దేశంతో చాలా మంది తరలివచ్చారు.
#WATCH | People stand in queues at Delhi's Select City Walk Mall in Saket to witness the opening of India’s second Apple Store. pic.twitter.com/9mwk5gZmlu
— ANI (@ANI) April 20, 2023
కాగా ముంబై స్టోర్ తర్వాత ఢిల్లీలో ప్రారంభించిన ఈ యాపిల్ స్టోర్ భారత్‌లో రెండోది. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్లు, ఐప్యాడ్‌లకు కస్టమర్ల నుంచి అధిక డిమాండ్ ఉంది. అలాగే యాపిల్ టీవీలు, వాచ్‌లు, మొబైల్‌కు సంబంధించిన యాక్సెసరీలను ఈ స్టోర్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచారు.
ఇదీ చదవండి: apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది!
Comments
Please login to add a commentAdd a comment