
వెబ్‌డెస్క్ : ఆన్‌లైన్ బిజినెస్‌కి ఆఫ్‌లైన్ ఎక్స్‌పీరియన్స్‌ని జోడిస్తూ బ్రిక్ అండ్ మోర్టార్ బిజినెస్‌లోకి గూగుల్ ప్రవేశించింది. న్యూయార్క్ నగరంలో తొలి బ్రిక్ అండ్ మోర్టార్ బిజినెస్‌ని ప్రారంభించింది.
న్యూయార్క్‌లో
గూగుల్ సంస్థ అందిస్తోన్న సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు న్యూయార్క్‌లోని చెల్సియా ఏరియాలో బ్రిక్ అండ్ మోర్టార్ (ఆఫ్‌లైన్ టూ ఆన్‌లైన్) పద్దతిలో రిటైల్ స్టోర్‌ని గూగుల్ ప్రారంభించింది. గూగుల్‌కి పిక్సెల్ ఫోన్, స్టాడియా, వేర్ ఓఎస్ టూ నెస్ట్, ఫిట్‌బిట్ డివైజెస్ టూ పిక్సెల్‌బుక్స్ ఇలా పలు ఉత్పత్తులను ఇక్కడ అమ్ముతోంది. ఈ స్టోర్‌కి కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విశాలమైన స్థలంలో ఏర్పాటు చేసిన మా గూగుల్ స్టోర్‌కి వచ్చిన వారికి ధన్యవాదాలంటూ ట్టిట్టర్‌లో పోస్ట్ చేశారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.
బ్రిక్ అండ్ మోర్టార్ అంటే
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్‌ల కలయితే బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్. ఆఫ్‌లైన్‌లో ఉత్పత్తలను స్వయంగా పరిశీలించి అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్‌లను అడిగి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ప్రొడక్టు నచ్చితే స్టాక్ ఉంటే అక్కడే కొనక్కోవచ్చు లేదంటే ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ పెట్టవచ్చు. ఆన్‌లైన్‌లో కొనడానికి ముందు ఒక ప్రొడక్ట్ యొక్క రియల టైం ఎక్స్‌పీరియన్స్‌ని కష్టమర్లకి అందివ్వడం ఈ స్టోర్ల ముఖ్య ఉద్దేశం.
ఆపిల్ తర్వాత
బ్రిక్ అండ్ మోర్టార్ పద్దతిలో ఇప్పటికే ఆపిల్ సంస్థ యూఎస్‌లో ఒక స్టోర్‌ని ఓపెన్ చేయగా .. ఆ తర్వాత గూగుల్ కూడా రంగంలోకి దిగింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా స్టోర్లను తెరిచే యోచనలో ఈ రెంటు టెక్ దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.
చదవండి : Father's Day: వాట్సాప్ న్యూ అప్‌డేట్
Comments
Please login to add a commentAdd a comment