సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఇంధన ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా ఆందోళన, విమర్శలు కొనసాగుతుండగానే పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 11 రోజుకూడా మోత మెగిస్తున్నాయి. వరుసగా 11 రోజు గురువారం కూడా పెట్రోల్ , డీజిల్ ధరలు 19-31 పైసలు పెరిగాయి. ఈ మొత్తం 11 రోజుల్లోనూపెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు లీటరుకు రూ.2.50 మేర ఎగిసాయి.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్‌సైట్ ప్రకారం మే 24, గురువారం ఉదయం 6 గంటలనుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ .77.47 పలుకుతోంది. కోలకతాలో రూ. 80.12, ముంబైలో రూ .85.29, చెన్నైలో లీటరుకు 80.42 రూపాయలుగా ఉంది. ఉంది. అలాగే ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.68.53గానూ, కోలకతాలో రూ. 71.08, చెన్నైలో రూ. 72.35, ముంబైలో రూ .72.96 పలుకుతోంది. ఇక హైదారాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.07 పలుకుతోంది. లీటరు డీజిల్ ధర రూ. 74.49గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment