సాక్షి, ముంబై: అంతర్జాతీయం మార్కెట్‌లో ముడిచమురు ధరలు గణనీయంగా క్షీణిస్తూ ఉండటంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు(నవంబరు,30) ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. దీంతో గత ఆరువారాల్లో పెట్రోలు ధర 10 రూపాయలు దిగిరాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 8 తగ్గింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 37 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు తగ ధరరూ.72.87 కి చేరింది. డీజిల్ ధర 41 పైసలు తగ్గి రూ.67.72గా ఉంది.
ముంబై: పెట్రోల్ ధర 37 పైసలు, డీజిల్ ధర 44 పైసలు తగ్గాయి. దీంతో పెట్రోల్ లీటర్ ధర రూ. 78.43గా ఉంది. డీజిల్ లీటర్ ధర రూ.70.89 కి చేరింది.
చెన్నై: పెట్రోలు ధర లీటరు ధర. 75.62, డీజిల్ ధర 71.52 పలుకుతోంది.
కోల్‌కతా: పెట్రోలు ధర రూ.74.88గానూ, రూ. 69.57గా ఉంది.
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర 40 పైసలు తగ్గి రూ.77.25 డీజిల్ ధర 45 పైసలు తగ్గి రూ.73.68 గా ఉంది.
విజయవాడ: పెట్రోల్ ధర రూ.76.61 ఉండగా.. డీజిల్ ధర రూ.72.67 వద్ద కొనసాగుతోంది.
కాగా అంతర్జాతీయ ముడి చమురు బ్యారెల్‌కు 60 డాలర్లు దిగువకు చేరింది. గత 45 రోజులుగా నేల చూపులు చూస్తున్న బ్రెండ్ క్రూడ్ ఆయిల్ ధరలు ఏడాది కనిష్టాన్ని నమోదు చేశాయి. అయితే ఈ రోజు స్వల్పంగా పుంజుకుని పాజిటివ్‌గా ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment