
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశాన్నంటుతున్న పెట్రోధరలపై ఒక పక్క తీవ్ర ఆందోళన కొనసాగుతూండగానే ఇంధన ధరలు పరుగు మాత్రం అప్రతిహతంగా కొనసాగుతోంది. శనివారం దేశవ్యాప్తంగా పెట్రోలుపై సగటున 35పైసలు, డీజిల్ 24 పైసలు పెరిగింది. దీంతో అత్యంత గరిష్ట స్థాయిల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి.
ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర. 81.63 వుండగా, డీజిల ధర రూ. 73.54
ముంబైలో పెట్రోలు ధర రూ. 89.01 (34పైసలు) డీజిల్ ధర రూ 78.07 (25పైసలు పెంపు)
చెన్నైలో డీజిల్ ధర రూ. 77. 74 పెట్రోలు ధర రూ. 84.49 (30పైసలు పెంపు)
కోల్‌కతాలో పెట్రోల్ రూ. 83.49, డీజిల్ రూ. 75.39
హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.86.18, డీజిల్ ధర రూ. 79.73( 24పైసలు పెంపు)
విజయవాడలో పెట్రోల్ రూ. 85.41, డీజిల్ రూ.78.63