కమలా హారిస్‌కు మద్దతుగా పాప్‌స్టార్‌ | Taylor Swift Support Kamala Harris | Sakshi
Sakshi News home page

కమలా హారిస్‌కు మద్దతుగా పాప్‌స్టార్‌

Published Wed, Sep 11 2024 12:00 PM | Last Updated on Mon, Oct 7 2024 10:37 AM

Taylor Swift Support Kamala Harris

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు పాప్‌ సింగర్‌ టేలర్ స్విఫ్ట్ మద్దతు పలికారు.ఈ నేపథ్యంలో ఈసందర్భంగా హారిస్‌ను వారియర్‌గా అభివర్ణించిన ఆమె..చైల్డ్‌లెస్‌ క్యాట్‌లేడీ (తనకూ పిల్లలు లేరంటూ) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు.

అంతేకాదు అధ్యక్ష ఎన్నికల్లో హారిస్‌కు ఓటు వేస్తానని ప్రకటించారు. అందుకు గల కారణాల్ని వివరించారు. హారిస్‌ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు. వాటిని సాధించాలంటే వారియర్‌ అవసరమని నేను నమ్ముతున్నాను’అని ఇన్‌స్టా పోస్ట్‌లు రాశారు. హారిస్‌ స్థిరమైన, ప్రతిభావంతులైన నాయకురాలు అని భావిస్తున్నాను. ప్రశాంతతో గందరగోళంతో కాకుండా ప్రశాంతంగా దేశం కోసం ఏదైనా సాధించవచ్చని నమ్ముతున్నట్లు చెప్పారు.  

కాగా, స్విఫ్ట్ 2020లో ప్రెసిడెంట్ జో బైడెన్‌, హారిస్‌లకు మద్దతు పలికారు. ఆమె కెరీర్‌లో డెమోక్రటిక్‌ పార్టీ రాజకీయ నాయకులకు మద్దతుగా పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరో ఎనిమిది వారాల్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి హారిస్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పారు. 

ఇదీ చదవండి : దేశాన్ని అమ్మేసిన ట్రంప్‌

ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ తరుఫున అమెరికా ఉపాధ్యక్షుడిగా బరిలోకి దిగిన జేడీ వాన్స్‌ గతంలో హారిస్‌ను ఛైల్డ్‌లెస్‌ క్యాట్‌ లేడీ విమర్శలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. వాన్స్‌ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. దానిపై టేలర్‌ స్విప్ట్‌ స్పందించారు. తాను కూడా ఛైల్డ్‌లెస్‌ క్యాట్‌ లేడీ అంటూ పిల్లిని ఎత్తుకున్న ఫొటోను షేర్‌ చేశారు. ఆ ఫొటోపై స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్ ఆమె పిల్లులకు తాను సంరక్షకుడిగా ఉంటానంటూ అభ్యంతరకంగా మాట్లాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement