హైదరాబాద్‌కు రామ్‌నాధ్ కోవింద్
హైదరాబాద్: ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాధ్ కోవింద్ రేపు(మంగళవారం) హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ విందు ఏర్పాటు చేస్తోంది. 9.45 గంటలకు హరిత ప్లాజాలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమవుతారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ నేత జి.కిషన్‌రెడ్డి, ఇతర పార్టీ నేతలు పాల్గొననున్నారు.