న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు తాను మద్దతిస్తున్నట్లు అమెరికన్ పాప్‌స్టార్ టేలర్ స్విఫ్ట్ తెలిపారు.అయితే తాజాగా ఆమె కమలకు మద్దతు ఇవ్వటంపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ టేలర్ స్విఫ్ట్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఆమె ఎప్పుడూ డెమోక్రట్లకే మద్దతు పలుకుతుందని విమర్శలు గుప్పించారు.
ట్రంప్ బుధవారం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ నేను టేలర్ స్విఫ్ట్ అభిమానిని కాదు. ఆమె చాలా ఉదారవాద వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ డెమొక్రాట్ల మాత్రమే సమర్థిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆమె తర్వాత తగిన మూల్యం చెల్లించవల్సి వస్తుంది’’ అని అన్నారు.
కమల హారిస్, డొనాల్డ్ తొలి డిబేట్ పూర్తి అయిన వెంటనే టేలర్ స్విఫ్ట్ తన మద్దతును సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. ‘ అధ్యక్ష ఎన్నికల్లో నేను డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, టిమ్ వాల్జ్‌కు ఓటు వేస్తాను. ఎందుకంటే ఆమె దేశ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. వారియర్ అయిన కమల ఛాంపియన్‌గా గెలవాల్సిన అవసరం ఉంది. గొడవలు, గందరగోళం లేకుండా ప్రశాంతంగా పరిపాలన అందిస్తే.. దేశంలో మనం చాలా ఎక్కువగా సాధించగలమని నమ్ముతున్నా’ అని పేర్కొన్నారు.
మరోవైపు.. అభిమానులు ‘స్విఫ్టీస్ ఫర్ కమల’ అని కమలా హారిస్ కోసం ప్రచారం ప్రారంభించినా మంగళవారం వరకు కూడా టేలర్ స్పందించలేదు. అయితే మరికొంత మంది ఆమె ట్రంప్‌కు మద్దతు పలుకుతున్నట్లు ఏఐ జనరేటెడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆసత్య ప్రచారానికి చెక్ పెడుతూ కమలకు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఏఐతో భయం కలుగుతోందని, తప్పుడు ప్రచారం ఆందోళన కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment