మరణశిక్ష అనుభవించిన బ్రాండెన్ బెర్నార్డ్(ఫైల్ ఫోటో)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసాయి. జో బైడెన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 20 న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి వరకు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతారు. కూర్చి దిగబోయే ముందు ట్రంప్ ఓ అరుదైన రికార్డు సృష్టించారు. 40 ఏళ్ల బ్రాండన్ బెర్నార్డ్ అనే వ్యక్తికి కోర్టు విధించిన మరణశిక్షను ట్రంప్ యంత్రాంగం అమలు చేసింది. 18 సంవత్సరాల వయస్సులో బెర్నార్డ్ ఓ నేరానికి సహచరుడిగా వ్యవహరించినందుకు గాను అతనికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ.. తీర్పు నివ్వగా.. నిన్న దాన్ని అమలు చేశారు. ఇది ఈ సంవత్సరంలో ఫెడరల్ ప్రభుత్వం అమలు చేసిన తొమ్మిదవ ఉరిశిక్ష. అయితే రికార్డు ఏంటంటే 130 ఏళ్ల తర్వాత లేమ్ డక్ కాలం(పదవి దిగిపోయేమందు)లో అమలు చేసిన తొలి మరణశిక్ష బెర్నార్డ్‌ది కావడం విశేషం. రెండు దశాబ్దాల క్రితం టెక్సాస్‌కు చెందిన ఓ స్ట్రీట్ గ్యాంగ్ అయోవాలో ఓ జంటను హత్య చేసింది. 2000 సంవత్సరంలో జరిగిన ఈ దారుణంలో బెర్నార్డ్, క్రిస్టోఫర్ వియాల్వా అనే మరో వ్యక్తితో కలిసి ఈ హత్యకు పాల్పడ్డట్లు తెలిసింది. ఈ గ్యాంగ్‌లో బెర్నార్డ్ కూడా ఉన్నాడు. దాంతో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఇక ఇండియానా టెర్రె హాట్‌లోని ఫెడరల్ జైలులో స్థానిక సమయం ప్రకారం గురువారం రాత్రి 9:27 గంటలకు బెర్నార్డ్‌కు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. (చదవండి: ‘ఏలియన్స్ ఉన్నాయి.. నిరూపిస్తాను’)
బెర్నార్డ్‌కు శిక్ష విధించడం పట్ల పలువురు ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కిమ్ కర్దాషియాన్ వెస్ట్, బెర్నార్డ్ కేసు గురించి ట్వీట్ చేశారు. ‘చివరిసారిగా బెర్నార్డ్‌తో మాట్లాడాను. నా జీవితంలో ఎంతో క్లిష్టమైన ఫోన్ కాల్ ఇదే. బెర్నార్డ్ ఎప్పటిలాగే నిస్వార్థంగా, తన కుటుంబంపై దృష్టి పెట్టాడు. వారు బాగున్నారని నిర్ధారించుకున్నాడు. మన పోరాటం ముగిసినందున ఏడవవద్దని కోరాడు’ అంటూ కిమ్ ట్వీట్ చేశారు. (బైడెన్ సంచలనం: అమెరికా చరిత్రలో తొలిసారి)
Just spoke to Brandon for what will likely be the last time. Hardest call I’ve ever had. Brandon, selfless as always, was focused on his family and making sure they are ok. He told me not to cry because our fight isn’t over. 😢
— Kim Kardashian West (@KimKardashian) December 10, 2020
ఇక బెర్నార్డ్ మరణశిక్షని నిలిపివేయాలంటూ పిలుపునిచ్చిన వేలాది మందిలో పలువురు న్యాయవాదులు, కాంగ్రెస్ ప్రతినిధులు ప్రముఖులు ఉన్నారు. ఇక జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి నెల రోజులకు పైనే వ్యవధి ఉంది. ఈ లోపు మరో నాలుగు మరణశిక్షలు అమలు చేయాల్సి ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment