execution of death
-
Alabama: తొలిసారి నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు
అలబామా: మరణ శిక్షల్లో అమెరికా కొత్త రికార్డు సృష్టించింది. అమెరికా చరిత్రలోనే అలబామా రాష్ట్రంలో తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వాడి ఊపిరాడకుండా చేసి ఒక వ్యక్తికి మరణ శిక్ష అమలు చేశారు. హత్య కేసులో దోషి అయిన కెన్నెత్ యూజెన్ స్మిత్(58) ఊపిరితిత్తుల్లోకి ఫేస్ మాస్క్ ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్‌ను పంపి శిక్ష అమలు చేశారు. గురువారం రాత్రి 8.25 గంటలకు అలబామా జైలులో స్మిత్ చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు చేసే విధానంపై అమెరికాలో వివాదం నడుస్తోంది. ఇది పూర్తి మానవీయతతో కూడిన శిక్ష అని ప్రభుత్వం చెబుతుండగా విమర్శకులు మాత్రం నైట్రోజన్ గ్యాస్‌తో మనిషిని చంపడం క్రూరమైన ప్రయోగం అని మండిపడుతున్నారు. అమెరికాలో సాధారణ మరణశిక్ష అమలు విధానం అయిన విషపు ఇంజెక్షన్‌తో స్మిత్‌కు ఇంతకుముందే శిక్ష అమలు చేయడానికి ప్రయత్నించారు. అయితే అతడి ఐవీ లైన్ కనెక్ట్ కాకపోవడంతో శిక్ష అమలును చివరి నిమిషంలో నిలిపివేశారు. నైట్రోజన్ గ్యాస్‌తో తనను చంపడంపై స్మిత్ వేసిన అప్పీల్‌పై యూఎస్ అప్పీల్ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకపోవడంతో శిక్ష అమలు ఖాయమైంది. ఇదీచదవండి.. విక్టోరియా బీచ్‌లో ప్రమాదం... నలుగురు భారతీయులు మృతి -
ప్రపంచంలో తొలిసారి ఇలాంటి మరణశిక్ష
అతనో కాంట్రాక్ట్ కిల్లర్. ఓ వ్యక్తి ఇచ్చిన సుపారీతో.. అతని భార్యను హత్య చేశాడు. ఆపై సుపారీ ఇచ్చిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యవర్తి జీవితఖైదుతో జైల్లోనే చచ్చాడు. హత్యలో సహకరించిన వ్యక్తికి మరణశిక్ష అమలయ్యింది. కానీ, ఇతగాడికి మరణశిక్ష పడి దశాబ్దాలు గడుస్తున్నా.. అది అమలు కావడంలో జాప్యం అవుతూ వస్తోంది. చివరికి.. పోయినేడు ఏడాది శిక్షను అమలు చేయాలని చూస్తే అది విఫలం అయ్యింది.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదివేయండి.. ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్ గ్యాస్‌నుNitrogen Hypoxia Execution ఉపయోగించి ఓ వ్యక్తికి మరణశిక్ష అమలు చేయబోతున్నారు. అమెరికా సంయుక్తం రాష్ట్రం అలబామాలో ఈ శిక్ష గురువారం అమలు కాబోతోంది. ఘోరంగా.. ఊహకందని రీతిలో అమలు కాబోయే ఈ మరణశిక్ష తప్పించుకునేందుకు చివరిదాకా యత్నం చేసిన కెన్నెత్ యూజీన్ స్మిత్(58) చివరికి నిరాశే ఎదురైంది. బుధవారం యూఎస్ సుప్రీం కోర్టు సైతం శిక్ష అమలు నిలుపుదలకు నిరాకరించింది. అలబామా కోర్టులు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో.. ఈ శతాబ్దంలో ఒక వ్యక్తిని ఈ తరహాలో శిక్షించి చంపడం ఇదే తొలిసారి కానుంది. కేసు ఏంటంటే.. 1988లో కోల్బర్ట్ కౌంటీలో చార్లెస్ సెన్నెట్ అనే మతాధిపతి తన భార్య ఎలిజబెత్ సెన్నెట్‌ను చంపడానికి బిల్లీ గ్రే విలియమ్స్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఆయన ఆ విషయం భార్యకు తెలియడం.. ఆమె నిలదీయడంతో తట్టుకోలేకపోయాడు. అలాగే.. భార్య పేరిట ఉన్న ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే ఆయన ఆమెను అడ్డు తొలగించుకునే పని చేశాడు. కెన్నెత్ స్మిత్, జాన్ పార్కర్ అనే ఇద్దరు అనే ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లకు 1000 డాలర్ల చొప్పున ఇస్తూ.. ఆ పని అప్పగించాడు బెల్లీ. ఇంట్లోనే మార్చి 18వ తేదీన ఆమెను దారుణంగా హతమార్చారు ఆ ఇద్దరు. ఇది దొపిడీ దొంగల పనేనని నమ్మించే యత్నం చేశారు. వారం తర్వాత.. దర్యాప్తులో అసలు విషయం బయటపడుతుందన్న భయంతో ఛార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు తన కుటుంబ సభ్యుల ముందు ఆయన నిజం ఒప్పుకున్నారు. ఇక ఈ కేసులో బిల్లీ గ్రే విలియమ్స్‌కు కఠిన యావజ్జీవ శిక్షపడగా.. 2020లో జైల్లోనే అనారోగ్యంతో మరణించాడు. స్మిత్, పార్కర్ ఇద్దరికీ మరణశిక్ష విధించింది కోర్టు. 2010 జూన్‌లో పార్కర్‌కు లెథల్(ప్రాణాంతక) ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. కానీ, స్మిత్ విషయంలోనే ఆ శిక్ష జాప్యం అవుతూ వస్తోంది. కిందటి ఏడాది.. నవంబర్ 17వ తేదీన స్మిత్‌కు లెథల్ ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేయాలని ప్రయత్నించారు. అయితే.. ఇంజెక్షన్లు ఎక్కించేందుకు నరాలు దొరక్కపోవడంతో ఆ శిక్ష నిలిపేశారు అధికారులు. ఈలోపు అలబామా సుప్రీంకోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ గడువు ముగిసిపోయింది. దీంతో.. అతని మరణశిక్ష అమలుపై సమీక్ష జరపాలని అలబామా గవర్నర్ కెయ్ ఇవెయ్ ఆదేశించారు. చివరకు.. నైట్రోజన్ హైపోక్సియా పద్ధతితో శిక్ష అమలు చేయాలని అధికారులు నిర్ణయించగా.. అసలు వ్యవహారం మొదలైంది. ఐరాసతో సహా అభ్యంతరాలు.. అయితే.. ఈ తరహా మరణశిక్ష అమలుపై ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తొలి ప్రయత్నం విఫలమయ్యాక.. స్మిత్ శారీరక మానసిక స్థితి స్థితి ఘోరంగా దెబ్బతిందని అతని తరఫు న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. స్మిత్ కుటుంబ సభ్యులు కూడా ఈ తరహా శిక్షను అమలుచేయడానికి వీల్లేదని.. ఆయన అనుభవించిన శిక్షా కాలం పరిగణనలోకి తీసుకుని విడుదల చేయాలని క్షమాభిక్ష కోరారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు సైతం ఇది అత్యంత మానవీయమైన చర్యగా పేర్కొంటూ వస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి మాన హక్కుల సంఘ కార్యాలయం సైతం ఈ శిక్షను నిలిపివేయాలంటూ అలబామాను కోరుతూ వస్తోంది. అయితే ఎలిజబెత్ కుటుంబ సభ్యులు మాత్రం శిక్ష అమలు చేయాల్సిందేనని కోరుతూ వస్తున్నారు. ఈలోపు అమెరికా రాజ్యాంగంలోని ఎనిమిదో సవరణ ప్రకారం(నేర, అసాధారణ శిక్షల నుంచి రక్షణ) శిక్షను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు స్మిత్ తరఫు లాయర్లు. ఈలోపు బుధవారం.. యూఎస్ సుప్రీం కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మాత్రమే స్మిత్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోగా.. మిగతా మెజార్టీ న్యాయమూర్తులు పిటిషన్‌ను తిరస్కరించారు. ఎలా ఉంటుందంటే.. నైట్రోజన్ హైపోక్సియా అంటే.. నైట్రోజన్ సిలిండర్‌కు బిగించిన పైప్‌ను మాస్క్ ద్వారా నిందితుడి ముక్కుకు బిగిస్తారు. గ్యాస్‌ను విడుదల చేయగానే.. ఆక్సిజన్ అందక నైట్రోజన్ మోతాదుతో ఆ వ్యక్తి గిలగిల కొట్టుకుంటూ మరణిస్తారు. ఐసీయూలో ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఒక వ్యక్తి ప్రాణాల్ని ఎలా రక్షిస్తారో.. అదే విధంగా నైట్రోజన్‌తో ఆ ప్రాణాల్ని హరిస్తారన్నమాట. అదీ చట్టబద్ధంగా!. బుధవారం అర్ధరాత్రి దాటాక(గురువారం 12గం. నుంచి.. ఆ మరుసటి రోజు ఉదయం 6గం. లోపు ఈ శిక్షను అమలు చేస్తారు). ఇప్పటిదాకా అమెరికాలో ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారానే మరణశిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే.. ఆ ఇంజెక్షన్లలో ఉపయోగించే మందు దొరకడం కష్టతరం అవుతుండడంతో(ఐరోపా దేశాలు వాటిని నిషేధించాయి).. ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అలబామాతో పాటు మిసిసిప్పీ, ఓక్లహోమా నైట్రోజన్ గ్యాస్‌తో చంపడం లాంటి శిక్షలను పరిశీలనలోకి తెచ్చుకున్నాయి. :::సాక్షి వెబ్‌డెస్క్ -
రోజుల్లోనే దర్యాప్తు.. నెలల్లోనే శిక్షలు
సాక్షి, అమరావతి: మహిళలపై నేరాల కేసుల్లో పోలీసుశాఖ దూకుడు నేరస్తులను బెంబేలెత్తిస్తోంది. నేరం చేసినా ఏం ఫర్వాలేదు.. విచారణ ఏళ్లపాటు సాగుతుందిలే అనే నేరస్తుల ధీమాకు కాలం చెల్లింది. రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి నెలల్లోనే విచారణ ప్రక్రియ ముగించి కోర్టుల ద్వారా శిక్షలు ఖరారు చేస్తుండటం నేరస్తులను హడలెత్తిస్తోంది. ఇటీవల గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్యకేసులో దోషికి 257 రోజుల్లోనే ఉరిశిక్ష పడగా.. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విదేశీ మహిళపై అత్యాచారయత్నం కేసులో 13 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి 57 రోజుల్లోనే శిక్ష విధించారు. మహిళలపై నేరాల కేసులను ఏమాత్రం ఉపేక్షించవద్దని, దోషులకు సత్వరం శిక్షలు పడేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో దోషులకు శిక్షలుపడేలా పోలీసు శాఖ జిల్లాల వారీగా కార్యాచరణను అమలు చేస్తోంది. దేశంలోనే రికార్డు వేగంతో శిక్ష ఖరారు నెల్లూరు జిల్లాలో లిథువేనియాకు చెందిన మహిళపై అత్యాచారయత్నం కేసులో దోషులకు దేశంలోనే రికార్డు వేగంతో శిక్షలు విధించారు. బాధితురాలు విదేశీ మహిళ కావడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆమె తమ దేశానికి వెళ్లాల్సి ఉంది. ఆమె స్వదేశానికి వెళ్లిపోతే ఇక్కడ దర్యాప్తు పూర్తిస్థాయిలో నిర్వహించలేమని, విచారణ ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగితే నిందితులకు అనుకూలంగా మారవచ్చని పోలీసులు గుర్తించారు. దీంతో అత్యంత వేగంగా దర్యాప్తు కొనసాగించారు. ► తనపై జరిగిన అత్యాచారయత్నంపై మార్చి 8న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 8 గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ► ఏడురోజుల్లోనే అంటే మార్చి 16న కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ► అనంతరం ఆరు రోజుల్లోనే విచారణ ప్రక్రియ పూర్తిచేశారు. 21 మంది సాక్షులను మార్చి 29 నుంచి ఏప్రిల్ 1లోగా రోజుకు ఏడుగురు చొప్పున విచారించారు. ఏప్రిల్ 4న సాక్ష్యాల పరిశీలన పూర్తి చేశారు. ► తరువాత రెండురోజుల్లోనే అంటే ఏప్రిల్ 6, 7 తేదీల్లో ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. ► తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం మే 5న తీర్పు వెలువరించింది. మొత్తంమీద ఘటన జరిగిన 57 రోజుల్లోనే దోషులకు శిక్షలు విధించడం ద్వారా దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. జిల్లాల వారీగా కార్యాచరణ మహిళలపై దాడులకు పాల్పడే కేసుల్లో దోషులకు సత్వరం శిక్షలు విధించేలా చేయడం కోసం పోలీసు శాఖ జిల్లాల వారీగా కార్యాచరణ చేపట్టింది. జిల్లాలో సున్నితమైన 25 కేసులను ఎంపికచేసి వాటి దర్యాప్తు, విచారణపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. సమగ్ర ఆధారాల సేకరణ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా సాక్షుల విచారణ, సమగ్రంగా వాదనలు వినిపించి నేరనిరూపణ జరిగేలా చొరవ చూపుతున్నారు. నేర నిరూపణకు అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం ఇప్పటికే పటిష్టపరచడంతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఉపకరిస్తోంది. దిశ పోలీసు స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటు, దిశ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, మహిళలపై దాడుల కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు తదితర చర్యలతో దర్యాప్తు, న్యాయవిచారణ వ్యవస్థ బలోపేతమయ్యాయి. పోలీసు, న్యాయశాఖల సమన్వయంతో దోషులను గుర్తించి సత్వరం శిక్షలు విధించడం సాధ్యపడుతోంది. అందుకు తాజా ఉదాహరణలు.. ► హిందూపురంలో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 34 రోజుల్లోనే దర్యాప్తు, న్యాయవిచారణను పూర్తిచేశారు. దోషికి న్యాయస్థానం పదేళ్ల జైలుశిక్ష విధించింది. ► రాజమహేంద్రవరంలో ఒక అత్యాచారం కేసులో కూడా అత్యంత వేగంగా దర్యాప్తు చేసి న్యాయవిచారణ ప్రక్రియ ముగించడంతో దోషికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ► గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య హత్యకేసును కూడా అత్యంత వేగంతో దర్యాప్తు చేసి దోషి శశికృష్ణకు 257 రోజుల్లోనే న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష విధించేలా చేశారు. 2021 ఆగస్టు 15న రమ్య హత్యకు గురికాగా.. కేవలం 10 గంటల్లోనే నిందితుడు శశికృష్ణను అరెస్టు చేశారు. ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షలను 48 గంటల్లోనే పూర్తిచేసి నివేదికలు తెప్పించారు. వారం రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రమం తప్పకుండా విచారణకు హాజరై వాదనలు వినిపించడంతో ఘటన జరిగిన 257 రోజుల్లోనే న్యాయస్థానం హంతకుడికి ఉరిశిక్ష విధించింది. నేరస్తులకు ఇదే హెచ్చరిక మహిళలపై నేరాల కేసుల దర్యాప్తు, విచారణను రికార్డు వేగంతో పూర్తిచేస్తున్నాం. శాస్త్రీయ ఆధారాలతో నేరాన్ని నిరూపించి సత్వర శిక్షలు విధిస్తుండటం నేరస్తులకు హెచ్చరిక వంటిది. నేరాలకు పాల్పడితే తప్పించుకోవచ్చనో, విచారణ పేరిట కాలయాపన చేయవచ్చనుకునే పరిస్థితులు లేవు. మహిళలపై నేరాలకు పాల్పడితే కచ్చితంగా శిక్ష పడుతుందని నిరూపిస్తున్నాం. – కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తనపై అత్యాచారయత్నం కేసును సత్వరం విచారించి దోషులకు శిక్షలు పడేలా చేసిన రాష్ట్ర పోలీసులకు లిథువేనియా మహిళ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో పోలీసుల స్పందనను ప్రశంసిస్తూ ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. – లిథువేనియా మహిళ -
ట్రంప్ రికార్డ్.. 130 ఏళ్లలో తొలిసారి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసాయి. జో బైడెన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 20 న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి వరకు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతారు. కూర్చి దిగబోయే ముందు ట్రంప్ ఓ అరుదైన రికార్డు సృష్టించారు. 40 ఏళ్ల బ్రాండన్ బెర్నార్డ్ అనే వ్యక్తికి కోర్టు విధించిన మరణశిక్షను ట్రంప్ యంత్రాంగం అమలు చేసింది. 18 సంవత్సరాల వయస్సులో బెర్నార్డ్ ఓ నేరానికి సహచరుడిగా వ్యవహరించినందుకు గాను అతనికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ.. తీర్పు నివ్వగా.. నిన్న దాన్ని అమలు చేశారు. ఇది ఈ సంవత్సరంలో ఫెడరల్ ప్రభుత్వం అమలు చేసిన తొమ్మిదవ ఉరిశిక్ష. అయితే రికార్డు ఏంటంటే 130 ఏళ్ల తర్వాత లేమ్ డక్ కాలం(పదవి దిగిపోయేమందు)లో అమలు చేసిన తొలి మరణశిక్ష బెర్నార్డ్ది కావడం విశేషం. రెండు దశాబ్దాల క్రితం టెక్సాస్‌కు చెందిన ఓ స్ట్రీట్ గ్యాంగ్ అయోవాలో ఓ జంటను హత్య చేసింది. 2000 సంవత్సరంలో జరిగిన ఈ దారుణంలో బెర్నార్డ్, క్రిస్టోఫర్ వియాల్వా అనే మరో వ్యక్తితో కలిసి ఈ హత్యకు పాల్పడ్డట్లు తెలిసింది. ఈ గ్యాంగ్‌లో బెర్నార్డ్ కూడా ఉన్నాడు. దాంతో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఇక ఇండియానా టెర్రె హాట్‌లోని ఫెడరల్ జైలులో స్థానిక సమయం ప్రకారం గురువారం రాత్రి 9:27 గంటలకు బెర్నార్డ్‌కు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. (చదవండి: ‘ఏలియన్స్ ఉన్నాయి.. నిరూపిస్తాను’) బెర్నార్డ్‌కు శిక్ష విధించడం పట్ల పలువురు ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కిమ్ కర్దాషియాన్ వెస్ట్, బెర్నార్డ్ కేసు గురించి ట్వీట్ చేశారు. ‘చివరిసారిగా బెర్నార్డ్‌తో మాట్లాడాను. నా జీవితంలో ఎంతో క్లిష్టమైన ఫోన్ కాల్ ఇదే. బెర్నార్డ్ ఎప్పటిలాగే నిస్వార్థంగా, తన కుటుంబంపై దృష్టి పెట్టాడు. వారు బాగున్నారని నిర్ధారించుకున్నాడు. మన పోరాటం ముగిసినందున ఏడవవద్దని కోరాడు’ అంటూ కిమ్ ట్వీట్ చేశారు. (బైడెన్ సంచలనం: అమెరికా చరిత్రలో తొలిసారి) Just spoke to Brandon for what will likely be the last time. Hardest call I’ve ever had. Brandon, selfless as always, was focused on his family and making sure they are ok. He told me not to cry because our fight isn’t over. 😢 — Kim Kardashian West (@KimKardashian) December 10, 2020 ఇక బెర్నార్డ్ మరణశిక్షని నిలిపివేయాలంటూ పిలుపునిచ్చిన వేలాది మందిలో పలువురు న్యాయవాదులు, కాంగ్రెస్ ప్రతినిధులు ప్రముఖులు ఉన్నారు. ఇక జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి నెల రోజులకు పైనే వ్యవధి ఉంది. ఈ లోపు మరో నాలుగు మరణశిక్షలు అమలు చేయాల్సి ఉన్నట్లు సమాచారం. -
అంతర్జాతీయ కోర్టుకు నిర్భయ దోషులు
న్యూఢిల్లీ: నిర్భయ కేసు మరో మలుపు తిరిగింది. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలంటూ నలుగురు దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తలుపు తట్టారు. ఈ కేసు విచారణ తప్పులతడకగా సాగిందని, తమను బలిపశువులుగా చేసి, అన్యాయంగా శిక్ష విధించారని ఆరోపించారు. ‘మాకు పాలీగ్రాఫ్, లై డిటెక్టర్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పరీక్షలు కూడా చేయాలని కోరినా దర్యాప్తు అధికారులు పట్టించుకోలేదు. బాధితురాలి సన్నిహితులు చెప్పిన తప్పుడు సాక్ష్యం ఆధారంగా శిక్ష ఖరారు చేసి, మమ్మల్ని బలిపశువులుగా మార్చారు. దీనిపై ఐసీజే జోక్యం చేసుకుని తక్షణమే విచారణ జరపాలి’ అని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. నలుగురు దోషులకు న్యాయపరమైన వెసులుబాటు మార్గాలు ఇంకా మిగిలి ఉండగానే తీహార్ జైలు అధికారులు ఈ నెల 20వ తేదీన ఉరిశిక్ష అమలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని దోషుల తరఫున లాయర్ ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు. అంతకుముందు.. న్యాయపరమైన తన హక్కులను తిరిగి పునరుద్ధరించాలంటూ దోషి ముకేశ్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ సమర్ధనీయం కాదంటూ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్లను కూడా తిరస్కరిస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన దోషులు ముకేశ్ సింగ్(32), అక్షయ్ సింగ్(31), పవన్‌గుప్తా(25), వినయ్ శర్మ(26)కు ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఈనెల 5వ తేదీన తాజాగా న్యాయస్థానం వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తీహార్ జైలు అధికారులు తలారి పవన్ జల్లాడ్‌ను పంపాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ అధికారులకు లేఖ రాశారు. ముకేశ్, పవన్, వినయ్‌లు ఆఖరిసారిగా తమ కుటుంబసభ్యులను ముఖాముఖి కలుసుకున్నారు. అక్షయ్ కుటుంబసభ్యులు కూడా ఒకట్రెండు రోజుల్లో రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు ఇప్పటివరకు మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. -
సందిగ్ధంలో ‘నిర్భయ’ దోషుల ఉరి
-
సందిగ్ధంలో ‘నిర్భయ’ దోషుల ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఫిబ్రవరి ఒకటో తేదీన అమలు కావాల్సిన ఉరిశిక్ష సందిగ్ధంలో పడింది. చట్టపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా శిక్ష అమలును వాయిదా వేయాలన్న నిర్భయ దోషుల పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారులకు నోటీసులు పంపింది. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ హైకోర్టు చేపట్టనున్న విచారణపైనే అందరి దృష్టి పడింది. ఇదే కేసులో దోషి అక్షయ్ వేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. (జైల్లో లైంగికంగా వేధించారు) నిర్భయ దోషులు చట్టపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు వీలుగా ఉరిశిక్ష అమలును నిరవధికంగా వాయిదా(సైన్ డై) వేయాలంటూ వారి తరఫున లాయర్ ఏపీ సింగ్ ఢిల్లీ హైకోర్టును కోరారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునేందుకు అక్షయ్‌కు అవకాశముందని పేర్కొన్నారు. వినయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించినందున నిబంధనల ప్రకారం మరో దోషి ముకేశ్‌కు మాదిరిగానే ఇతడికీ 14 రోజుల గడువివ్వాలని, అందుకు ఉరిశిక్షను వాయిదా వేయాలని కోరారు. నాలుగో దోషి పవన్ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేయాల్సి ఉందన్నారు. ప్రత్యేక జడ్జి ఏకే జైన్ ఈ పిటిషన్‌పై 31వ తేదీ ఉదయం 10 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. (వంశంలో చివరి తలారి) మీరట్ నుంచి వచ్చిన తలారి ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై సందిగ్ధత కొనసాగుతుండగానే మీరట్ జైలుకు చెందిన తలారి పవన్ జల్లాద్ గురువారం తీహార్ జైలుకు చేరుకున్నారు. ఉరి సంబంధ సామగ్రిని పరిశీలించి, ఏర్పాట్లు చేసుకుంటాడని జైలు అధికారులు చెప్పారు. దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయాలంటూ దిగువ కోర్టు వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. (ఉరి తీస్తున్నాం.. కడసారి చూసివెళ్లండి) -
జంట పేలుళ్ల కేసులో అప్పీళ్లు విచారణకు స్వీకరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్లలో సంభవించిన జంట పేలుళ్ల కేసులో కింది కోర్టు విధించిన ఉరి శిక్ష తీర్పును సవాల్ చేస్తూ దోషులు అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. వీరిద్దరికీ ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన నేరానికి తారీఖ్ అంజూమ్ ఎహసాన్ అనే వ్యక్తికి కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తారీఖ్ కూడా హైకోర్టులో అప్పీల్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వీటిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించింది. ఈ కేసు నుంచి నిర్దోషులుగా బయటపడిన నిందితులు షాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫూద్దీన్ తర్ఖాష్లకు పేలుళ్లతో సంబంధం ఉందని, కింది కోర్టు వీరిని విడిచిపెట్టడం చెల్లదని ప్రత్యేక దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను కూడా కలిపి విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. అప్పీల్ తీర్పు వెలువడే వరకూ తమకు బెయిల్ మంజూరు చేయాలన్న వారి అభ్యర్థనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఉరిశిక్ష ఖరారు విషయంలో నిర్ణయం తీసుకునేందుకు వాటికి గతంలోనే హైకోర్టు నంబర్లు కేటాయించి రెఫర్ ట్రయిల్ మొదలు పెట్టింది. అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు ఉరిశిక్ష విధిస్తూ రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. -
వారికి ఉరిశిక్ష ఖరారు చేయండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషులు అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు తాము విధించిన ఉరిశిక్ష ఖరారు చేయాలంటూ కేసు ఫైళ్లను హైకోర్టుకు కింది కోర్టు నివేదించింది. ఫైళ్లను పరిశీలించిన హైకోర్టు.. ఉరిశిక్ష ఖరారులో నిర్ణయం తీసుకునేందుకు వాటికి నంబర్లు కేటాయించి రెఫర్ ట్రయల్ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఉరిశిక్ష పడిన దోషుల వాదనలు వినేందుకు వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరికీ జైలర్ ద్వారా నోటీసులు అందజేయాలని ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. జంట పేలుళ్ల కేసులో అనీక్, ఇస్మాయిల్ చౌదరిలకు ఉరిశిక్ష విధిస్తూ రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఈ నెల 10న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దోషులకు ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజూమ్ ఎహసాన్‌కు జీవిత ఖైదు విధించగా మరో ఇద్దరు నిందితులు సాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను నిర్దోషులుగా ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉన్నందున కేసు ఫైళ్లను కింది కోర్టు గతవారం హైకోర్టుకు పంపింది. -
ఆ మృగాళ్లకు ఉరే సరి
ఉధంపూర్: తన బిడ్డను పొట్టనపెట్టుకున్న మృగాళ్లకు ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు కఠువా హత్యాచార బాధితురాలి తల్లి చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించనక్కర్లేదని, క్రైం బ్రాంచ్ విచారణపై పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ‘నా బిడ్డ చాలా తెలివైనది. పెద్దయ్యాక తనను డాక్టర్‌ను చేయాలనుకున్నాం. మరే కుటుంబం ఇలాంటి వేదనకు గురికాకుండా ఉండాలంటే దోషులకు ఉరి వేయడమే సరైన నిర్ణయం’ అని బాధితురాలి తల్లి డిమాండ్ చేశారు. ఇంతకు ముందు హిందువులతో తమకు సన్నిహిత సంబంధాలుండేవని, కానీ ఇప్పుడు అవి దెబ్బతిన్నాయని, తాము భయభ్రాంతులకు గురవుతున్నామని తెలిపింది. హిందూ ముస్లింలకు తేడా తెలియని తన కూతురుని అత్యంత కిరాతకంగా చంపేసిన సంగతి ఈ లోకానికంతా తెలుసని ఆమె కన్న తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. మరోవైపు, ఈ కేసును విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని కశ్మీర్ సీఎం మెహబూబా ఆరాష్ట్ర హైకోర్టు సీజేకి లేఖ రాశారు. వైదొలగిన ఇద్దరు బీజేపీ మంత్రులు.. కఠువా రేప్, హత్య ఉదంతంలో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులను రాష్ట్రకేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ శ్రీనగర్‌లో నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సత్‌శర్మ రాజీనామా లేఖలను సీఎంకు పంపారు. వాటిని గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. రాజీనామా చేసిన వారిలో అటవీ శాఖ మంత్రి లాల్‌సింగ్, పరిశ్రమల మంత్రి చందర్ ప్రకాశ్ గంగా ఉన్నారు. -
రహస్య ఉరితీతలు వద్దు
దేశంలోని పలు జైళ్లలో కొనసాగుతోన్న దోషుల రహస్య ఉరితీతలపై సుప్రీం కోర్టు మండిపడింది. కరడుగట్టిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, పార్లమెంటుపై దాడికేసులో దోషి అఫ్జల్ గురు సహా మరణశిక్ష పడిన ఎటువంటివారినైనా సరే రహస్యంగా ఉరితీయడం సరికాదని పేర్కొంది. దోషులు కూడా గౌరవసంపత్తిని కలిగి ఉంటారని, రహస్య శిక్షల అమలు వారిని అవమానపర్చడంలాంటిదేనని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ యూయూ లలిత్ లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకరు దోషిగా నిరూపణ అయి, మరణశిక్షకు గురైనంత మాత్రాన వారు జీవించే హక్కును కోల్పోరని, భారత రాజ్యాంగంలోని 21 ఆర్టికల్ ఇదే విషయాన్ని ప్రస్ఫుటం చేస్తోందని ధర్మాసనం పేర్కొంది. కిందికోర్టుల్లో శిక్ష పడినవారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం దగ్గరినుంచి రాష్ట్రపతి, గవర్నర్ క్షమాభిక్షను కోరేవరకు గల అన్ని అవకాశాల్ని వినియోగించుకునేలా చూడాలంది. తప్పనిసరి కేసుల్లో ఉరిశిక్షకు ముందు దోషులు తమ కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశాన్ని తప్పక కల్పించాలని తెలిపింది. కుటుంబసభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురును 2013లో ఢిల్లీలోని తీహార్ జైలులో రహస్యంగా ఉరితీయడంపై అప్పట్లో పెనుదుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. -
యూపీ లవర్స్ డెత్ వారెంట్ రద్దు
న్యూఢిల్లీ: ఏడుగురిని హత్య చేసిన కేసులో యూపీ యువతి, ఆమె ప్రియుడికి విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సెషన్స్ కోర్టు జడ్జి హడావుడిగా జారీ చేసిన డెత్ వారెంట్ ను కొట్టివేసింది. రివ్యూ, మెర్సీ పిటిషన్ల కోసం ఎదురు చూడకుండా డెత్ వారెంట్ పై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తొందరపాటుతో సంతకం చేశారని సుప్రీంకోర్టు పేర్కొంది. నిందితురాలు షబ్నం తన ప్రియుడు సలీంతో తన కుటుంబానికి చెందిన ఏడుగురిని హతమార్చింది. మృతుల్లో 10 నెలల పాప కూడా ఉంది. 2008లో ఏప్రిల్ 15న ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో షబ్నం, సలీంలకు సెషన్స్ కోర్టు 2010లో మరణశిక్ష విధించింది. ఈ తీర్పును 2013లో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈనెల 21న డెత్ వారెంట్ జారీకావడంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి విధించిన మరణశిక్షపై సుప్రీంకోర్టు ఈనెల 25న స్టే విధించింది.