యూపీ లవర్స్ డెత్ వారెంట్ రద్దు | SC quashes warrant for execution of death sentence UP Lovers | Sakshi
Sakshi News home page

యూపీ లవర్స్ డెత్ వారెంట్ రద్దు

Published Wed, May 27 2015 1:11 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

యూపీ లవర్స్ డెత్ వారెంట్ రద్దు - Sakshi

యూపీ లవర్స్ డెత్ వారెంట్ రద్దు

న్యూఢిల్లీ: ఏడుగురిని హత్య చేసిన కేసులో యూపీ యువతి, ఆమె ప్రియుడికి విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సెషన్స్ కోర్టు జడ్జి హడావుడిగా జారీ చేసిన డెత్ వారెంట్ ను కొట్టివేసింది. రివ్యూ, మెర్సీ పిటిషన్ల కోసం ఎదురు చూడకుండా డెత్ వారెంట్ పై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తొందరపాటుతో సంతకం చేశారని సుప్రీంకోర్టు పేర్కొంది.

నిందితురాలు షబ్నం తన ప్రియుడు సలీంతో తన కుటుంబానికి చెందిన ఏడుగురిని హతమార్చింది. మృతుల్లో 10 నెలల పాప కూడా ఉంది. 2008లో ఏప్రిల్ 15న ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో షబ్నం, సలీంలకు సెషన్స్ కోర్టు 2010లో మరణశిక్ష విధించింది. ఈ తీర్పును 2013లో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈనెల 21న డెత్ వారెంట్ జారీకావడంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి విధించిన మరణశిక్షపై సుప్రీంకోర్టు ఈనెల 25న స్టే విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement