Death Warrant
-
నిర్భయ దోషులను ఎప్పుడో చంపేశారు
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార కేసులో ఇద్దరు దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తాల తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్ న్యాయ వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను మార్చి 20న ఉరితీయాలంటూ పటియాల హౌస్‌కోర్టు కొత్త డెత్‌వారెంట్లు జారీచేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డెత్వారెంట్ల జారీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దోషులకు నాలుగు సార్లు డెత్వారెంట్ల జారీచేసి, వారిని నాలుగు సార్లు చంపేశారు. వారేమీ ఉగ్రవాదులు కాదు. భయంకరమైన నేరస్తులుగా చిత్రీకరించి మీడియా వారిని ఎప్పూడో చంపేసింది’ అని వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులను న్యాయవ్యవస్థ చేసిన హత్యగా ఆయన వర్ణించారు. కాగా ఢిల్లీ నడిబొడ్డున ఘోరమైన ఘటనకు పాల్పడిన నలుగురు దోషులను ఉరిశిక్ష నుంచి కాపాడుతున్న దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పేరు ఇటీవల సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. (వారి చావును చూడాలనుంది) నిర్భయపై వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాకుండా, చట్టంలోని అవకాశాలను ఉపయోగించుకుని, పదే పదే ఉరిశిక్షను వాయిదా వేయిస్తున్నందుకు కూడా ఇప్పుడాయన వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. నిర్భయపై అత్యాచారం జరగడానికి ఆమె వేసుకున్న దుస్తులూ, ఆమె జీవన విధానం కారణమని ఆయన గతంలో లింగ వివక్షతో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ‘నా కూతురు ఇలా పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతుంటే సజీవంగా దహనం చేసేవాడిని. ఇలాంటి ఘటన జరగనిచ్చేవాడిని కాదు’ అని కూడా అన్నారు.కాగా దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన అంశాలు దాదాపు మూసుకుపోయాయి. నలుగురు దోషుల రివ్యూ పిటిషన్లతో పాటు క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా దాఖలు చేయడం, తిరస్కరించడం వంటిని పూర్తి అయ్యాయి. దీంతో మార్చి 20న ఖచ్చితంగా శిక్ష అమలై తీరుతుందని నిర్భయ తరఫు న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్లు) -
వారి చావును చూడాలనుంది : ఆశాదేవి
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార దోషులకు పటియాల హౌస్‌కోర్టు తాజాగా డెత్‌వారెంట్లు జారీచేయడంపై ఆమె తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. దోషుల ఉరితీతపై గురువారం విచారణ సందర్భంగా కోర్టు వద్దకు చేరుకున్న ఆమె.. తీర్పు అనంతరం ఆమె తరఫున వాదించిన న్యాయవాదిని కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. డెత్‌వారెంట్లు జారీ అనంతరం ఆశాదేవి మీడియా మాట్లాడారు. ‘నా కూతురిపై అత్యాచారం జరిపిన నలుగురు దోషులను ఉరితీసే సమయం ఆసన్నమైంది. నలుగురు కామాంధులను ఉరితీసిన రోజే నా కూతురికి న్యాయం జరిగినట్టు. అదే మాకు పెద్ద విజయం. ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడటం విచారం. ఇక వారికున్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోయాయి. దోషులు చట్టం నుంచి ఇక తప్పించుకోలేరు. అవకాశం ఉంటే.. వారి చావును నాకు చూడాలని ఉంది’ అని అన్నారు. (నిర్భయ దోషులకు డెత్ వారెంట్లు జారీ) నిజానికి ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ మార్చి 3 ఉదయం 6 గంటలకు ఉరితీయాల్సి ఉంది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉరితీత మూడోసారి వాయిదాపడింది. తాజాగా ట్రయల్‌కోర్టు కొత్త డెత్‌వారెంట్లు జారీచేస్తూ మార్చి 20న ఉరితీయాలని ఆదేశించింది. అయితే దోషులకు ఉన్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోవడంతో ఈసారి శిక్ష అమలు జరిగి తీరుతుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్లు జారీ
-
నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్లు
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార కేసులో దోషులకు ఢిల్లీ పటియాల హౌస్‌కోర్టు కొత్త డెత్‌వారెంట్లు జారీచేసింది. మార్చి 20న ఉదయం 5.30 నిమిషాలకు నలుగురు దోషులను ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. తీహార్ జైల్లో దోషులను ఉరితీయానున్నారు. కాగా ఈ విధంగా డెత్‌వారెంట్లు జారీచేయడం ఇది నాలుగోసారి. గత మూడుసార్లు దోషులను కోర్టులను ఆశ్రయించడంతో ఉరితీత వాయిదా పడిన విషయం తెలిసిందే. నిజానికి, ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ మార్చి 3 ఉదయం ఆరు గంటలకు ఉరితీయాల్సి ఉంది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించడంతో శిక్షను నిలిపివేశారు. -
ఉరి మూడోసారీ?
న్యూఢిల్లీ: నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరిశిక్ష అమలు మూడోసారి కూడా వాయిదాపడింది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. క్షమాభిక్ష ఒక ముఖ్యమైన రాజ్యాంగబద్ధ అవకాశం అని కోర్టు వ్యాఖ్యానించింది. నిజానికి, ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ నేటి(మార్చి 3) ఉదయం ఆరు గంటలకు ఉరితీయాల్సి ఉంది. తాజా, ఆదేశాలతో ఆ ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండగా మరణ శిక్ష విధించడం సరికాదని అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రానా స్పష్టం చేశారు. బాధితుల వైపునుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్ప టికీ.. ఏ దోషి అయినా తనకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలనూ వినియోగించుకోకుండా ఆపకూడదని ఆయన పేర్కొన్నారు. క్షమాభిక్ష పిటిషన్ ఒక ముఖ్యమైన చట్టబద్ధ అవకాశం అనీ, అందుకే ఉరిని వాయిదా వేయడానికి తాను సంకోచించడం లేదన్నారు. మరణ శిక్షపై స్టే విధించాలన్న పవన్ గుప్తా చేసుకున్న విజ్ఞప్తిపై ఆదేశాలను రిజర్వులో ఉంచిన కోర్టు.. క్యూరేటివ్, మెర్సీ పిటిషన్లను ఆలస్యంగా దాఖలు చేయడంపై దోషి తరపు న్యాయవాది ఏపీ సింగ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. జాగ్రత్త’ అని ఆయనపై మండిపడింది. ఎవరైనా తప్పు చేస్తే పరిణామాలెలా ఉంటాయోమీకు తెలుసనే అనుకుంటున్నామని హెచ్చరించింది. విచారణ మంగళవారం కొనసాగుతుందని తెలిపింది. (నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా?) కాగా, పవన్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్‌ని సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరణ శిక్షపై స్టే విధించాలని కోరుతూ అక్షయ్ కుమార్, పవన్ గుప్తాలు దాఖలుచేసుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ముకేశ్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్ల క్షమాభిక్ష పిటిషన్లను ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరణను సవాల్ చేస్తూ ముకేశ్, వినయ్ కుమార్‌లు విడివిడిగా దాఖలు చేసుకున్న పిటిషన్లను సైతం సుప్రీంకోర్టు గతంలో కోర్టు తోసిపుచ్చింది. అయితే అక్షయ్ కుమార్ మాత్రం తన క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకి వెళ్లలేదు. వ్యవస్థ వైఫల్యం: నిర్భయ తల్లి నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష మరోమారు వాయిదాపడడంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోందనీ, ఈ దేశంలో న్యాయం ఎలా ఆలస్యం అవుతోందో ప్రపంచమంతా గమనిస్తోందనీ ఆమె వ్యాఖ్యానించారు. రోజు రోజుకీ విశ్వాసాన్ని కోల్పోతున్నాననీ, అయినా గట్టిగా నిలబడతాననీ, ఏం చేసినా దోషులకు ఉరిశిక్ష పడాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. అయితే కోర్టులు మాత్రం చోద్యం చూస్తూ కూర్చుంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. (నిర్భయ కేసు : మరో కీలక పరిణామం) ఇది వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోంది. ఈ దేశంలో న్యాయం ఎలా ఆలస్యం అవుతోందో ప్రపంచమంతా గమనిస్తోంది. ఏం చేసినా దోషులకు ఉరిశిక్ష పడాల్సిందే. – నిర్భయ తల్లి ఆశాదేవి ఎవరీ ఏపీ సింగ్? నిర్భయ హత్యాచారం కేసులో ఇద్దరు దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తాల తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారారు. నిర్భయపై వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాకుండా, చట్టంలోని అవకాశాలను ఉపయోగించుకుని, పదే పదే ఉరిశిక్షను వాయిదా వేయిస్తున్నందుకు కూడా ఇప్పుడాయన వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. నిర్భయపై అత్యాచారం జరగడానికి ఆమె వేసుకున్న దుస్తులూ, ఆమె జీవన విధానం కారణమని ఆయన గతంలో లింగ వివక్షతో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నా కూతురు ఇలా పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతుంటే సజీవంగా దహనం చేసేవాడిని. ఇలాంటి ఘటన జరగనిచ్చేవాడిని కాదు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పదే పదే ఉరిశిక్ష అమలు వాయిదా పడుతుండటంపై ఆప్ నేత మనీశ్ సిసోడియా ‘వ్యవస్థని నవ్వుల పాలు చేస్తున్నారు’ అని విమర్శించారు. -
నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా
-
నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. డెత్‌వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై పటియాల హౌస్‌కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దోషులను ఉరి తీయవద్దంటూ తీహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు ఉరి నిలుపుదల చేయాలని పేర్కొంది. మార్చి 3న (మంగళవారం) నలుగురు దోషులను ఉరితీయాలంటూ ఇదివరకే కోర్టు డెత్‌వారెంట్లు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా శిక్ష అమలుపై స్టే ఇవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం. (క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి) గతంలో జనవరి 22, ఫిబ్రవరి 1, మార్చి3 ఉరి తీయాలంటూ ఇచ్చిన డెత్ వారెంట్లపై పటియాల కోర్టు స్టే ఇచ్చింది. మరోవైపు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పటిషన్‌ను రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మార్చి 3న దోషులను ఉరి తీయడం దాదాపు ఖరారే అనుకున్నారంతా. ఈ క్రమంలోనే ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. -
ఉరిశిక్షపై సుప్రీంకు వెళ్లడానికి దోషులకు 60 రోజుల గడువు
న్యూఢిల్లీ: ఉరిశిక్ష పడిన దోషులు శిక్ష నుంచి ఉపశమనానికి సుప్రీంకోర్టుకెక్కడానికి 60 రోజులు గడువు ఉన్నప్పటికీ ఈ లోగా వారికి డెత్ వారంట్లు ఎందుకు జారీ చేస్తున్నారని సుప్రీంకోర్టు గురువారం ట్రయల్ కోర్టులను ప్రశ్నించింది. 2018లో గుజరాత్‌లోని సూరత్‌లో మూడేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకేసులో అనిల్ సురేంద్ర సింగ్ యాదవ్‌ని ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు కూడా సమర్థించింది. ఆ తర్వాత కేవలం 33 రోజుల్లోనే కింది కోర్టు డెత్ వారంట్లు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాదవ్ సుప్రీంకోర్టుకెక్కాడు. దీంతో బెంచ్ యాదవ్ డెత్ వారంట్‌పై స్టే విధించింది. హైకోర్టు తీర్పుని సుప్రీంలో సవాల్ చేసుకోవడానికి దోషులకు 60 రోజులు గడువు ఉంటుందని, ఈలోగా డెత్ వారంట్లు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. అలాంటప్పుడు కింది కోర్టులు డెత్ వారంట్లు ఎలా జారీ చేస్తారని సుప్రీం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. -
నిర్భయ దోషులకు తాజా డెత్ వారంట్
-
మార్చి 3న ఉరితీయండి
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకేసులో దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలుకు తేదీ ఖరారయ్యింది. నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారంట్ జారీచేసింది. రోజుకో మలుపు తిరుగుతూ యావత్ దేశం దృష్టినీ ఆకర్షిస్తోన్న నిర్భయ కేసులో దోషులకు మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలుచేయాలని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. ఇంకా దోషులకు శిక్ష అమలును ఆలస్యం చేయడం బాధితుల హక్కులకు భంగకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ముకేశ్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ కుమార్ శర్మ(26), అక్షయ్‌కుమార్(31)లకు మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించాలని కోర్టు ఆదేశించడం ఇది మూడోసారి. జనవరి 7, 2020 తేదీన కోర్టు ఇచ్చిన ఆదేశాలు మార్చి 3న అమలులోకి వస్తాయని ఢిల్లీ కోర్టు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా వెల్లడించారు. దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ జనవరి 7, 2020న కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే జనవరి 17, జనవరి 31న రెండు సార్లు దోషులకు విధించిన మరణశిక్ష వాయిదాపడింది. శిక్ష అమలును ఇంకా వాయిదా వేయడం వల్ల బాధితుల హక్కులకూ, సత్వర న్యాయానికీ నష్టమని కోర్టు అభిప్రాయపడింది. ‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకు కొత్తగా డెత్ వారంట్ జారీ చేసేందుకు ట్రయల్ కోర్టును ఆశ్రయించొచ్చంటూ సుప్రీంకోర్టు అధికారులకు స్వేచ్ఛనివ్వడంతో, నిర్భయ దోషుల తల్లిదండ్రులూ, ఢిల్లీ ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తులను పటియాలా హౌజ్ కోర్టు విచారించింది. ఉరిశిక్ష అమలుపై నిర్భయ తల్లి ఆశాభావం తన కుమార్తె నిర్భయపై సామూహిక అత్యాచారంచేసి, హత్య చేసిన నలుగురు దోషులకూ ఒకేసారి శిక్షపడుతుందని నిర్భయ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు అమలు జరుగుతాయని ఆమె భావిస్తున్నానన్నారు. క్షమాభిక్ష కోరతాం: పవన్, అక్షయ్ పవన్‌గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయాలనీ, రాష్ట్రపతి ఎదుట క్షమాభిక్ష పిటిషన్ వేయాలని భావిస్తున్నట్టు న్యాయవాది రవిఖాజీ కోర్టుకి వెల్లడించారు. అలాగే, అక్షయ్ కూడా త్వరలోనే రాష్ట్రపతికి పూర్తిస్థాయిలో క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేస్తాడని న్యాయవాది ఏపీ సింగ్ కోర్టుకి విన్నవించారు. వినయ్ శర్మ దీక్ష విరమణ తీహార్ జైల్లో వినయ్ శర్మ నిరాహార దీక్ష చేస్తున్న విషయం కోర్టుకి తెలిసింది. ఆ తరువాత అతడు దీక్షను విరమించుకున్నట్టు కోర్టు వెల్లడించింది. వినయ్ మానసిక ఆరోగ్యం సరిగాలేనందున ఉరితీయడం కుదరదనీ అతడి తరఫు న్యాయవాది వాదించారు. అయితే కోర్టు ఈ వాదనని తోసిపుచ్చింది. 33 నెలలు... దోషుల అప్పీల్‌ను 2017, మే 5న సుప్రీంకోర్టు కొట్టివేసింది. 33 నెలల తరువాత కూడా నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా ఎటువంటి క్యూరేటివ్ పిటిషన్‌ను గానీ, క్షమాభిక్ష పిటిషన్‌ని కానీ దాఖలు చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయపరమైన అవకాశాలన్నింటినీ వినియోగించుకోని ఏకైక వ్యక్తి పవన్ గుప్తాయేనని కోర్టు వెల్లడించింది. నిర్భయ దోషులు వీరే.. -
నిర్భయ నలుగురు దోషులను ఒకేసారి ఉరి
-
నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీ ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్‌లను ఉరితీయాలని ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు సోమవారం కొత్త డెత్‌వారెంట్లు జారీచేసింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని జైలు అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం వారున్న తీహార్ జైలులోనే వారిని ఉరితీయనున్నారు. కాగా జనవరి 22, ఫిబ్రవరి 1 దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ.. వారు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తూ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలంటూ కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దోషుల తీరుపై న్యాయస్థానం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పటియాల కోర్టు దోషులను ఉరితీయాలంటూ తాజాగా డెత్‌వారెంట్లు జారీచేసింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో.. ఈసారైనా ఉరిశిక్ష అమలు అవుతుందా లేదా అనేది అసక్తికరంగా మారింది. -
నిర్భయ.. ఉరి ఎందుకు నిలిపేశారు?
నిర్భయ దోషులకు జనవరి 22న ఉరి అన్నారు. వాయిదా వేశారు. ఫిబ్రవరి 1న ఉరి అన్నారు. మళ్లీ వాయిదా వేశారు. చివరికి ఉరి అమలునే నిలిపేశారు. ఎందుకు నిలిపేశారు? ఉరి అమలును పూర్తిగా నిలిపి వేయడం కాదు. జనవరి 22న ఉరి అని సుప్రీంకోర్టు తొలి డెత్ వారెంట్ ఇచ్చాక.. నాటి నుంచీ దోషులు అందరూ ఒకేసారి కాకుండా ఒకరొకరుగా వేసుకుంటూ వస్తున్న పిటిషన్లను పరిశీలించి తీరాలి కనుక అవన్నీ పూర్తయ్యే వరకు చట్టరీత్యా ఉరి అమలు సాధ్యం కాదు. అదే విషయాన్ని బుధవారం ఢిల్లీ హై కోర్టు కూడా స్పష్టం చేసింది. మరి పిటిషన్ల పరిశీలన పూర్తవకుండానే ఫిబ్రవరి 1 అని మరో డెత్ వారెంట్ ఎందుకు ఇచ్చినట్లు? దోషుల తరఫు లాయర్లు ఎప్పటికప్పుడు కొత్తగా పిటిషన్లు వేస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 1) ఉరి తీస్తారనగా రెండు రోజుల ముందు.. గురువారం.. నలుగురు దోషులలో ముగ్గురైన అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్త తరఫు లాయర్ ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అప్పటికి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెడింగులో ఉంది. అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తలు కూడా తమకున్న చట్టపరమైన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోలేదు. కాబట్టి ఉరి అమలును నిలిపి వేయాలని లాయర్ కోరారు. కోర్టు సమ్మతించింది. ఉరికి కొత్త తేదీ చెప్పేవరకు ఉరి అమలును నిలిపి వేయాలని తీర్పు ఇచ్చింది. ఉరి తీసే తేదీ ఇచ్చాక కూడా మళ్లీ వారికి చట్టపరమైన అవకాశాలు ఇవ్వడం ఎందుకు? చట్టంలోనే అలా ఉంది. ఉరి తీసే ముందు ‘నీ చివరి కోరిక ఏమిటి?’ అని అడుగుతారని అంటారు. ఆ అడగడం నిజమో కాదో కానీ.. డెత్ వారెంట్ వచ్చాక (ఉరి తేదీ వచ్చాక) కూడా.. తమను ఎందుకు ఉరి తియ్యకూడదో చెప్పుకునే, క్షమాభిక్ష కోరుకునే అవకాశాన్ని చట్టం దోషులకు కల్పిస్తోంది. మరణశిక్ష పడిన ప్రతి దోషికీ మూడు అవకాశాలు ఉంటాయి. ఆ మూడు అవకాశాలూ.. ఒకటి నిష్ఫలం అయితే ఇంకొకటి అన్నట్లుగా దోషికి ఉపకరిస్తాయి. ఏమిటా మూడు అవకాశాలు? మొదటిది రివ్యూ పిటిషన్. ఉరి విధింపును తిరిగి పరిశీలించమని కోర్టును కోరడం. రెండోది క్యురేటివ్ పిటిషన్. ఉరి విధింపునకు దారి తీసిన వాదనల వల్ల తమకు న్యాయం జరగలేదని కోర్టుకు చెప్పుకోవడం. మూడోది క్షమాభిక్ష పెట్టమని రాష్ట్రపతిని వేడుకోవడం. ఇప్పటి వరకు ఎవరు ఎన్ని అవకాశాలు ఉపయోగించుకున్నారు? ముఖేశ్, వినయ్, అక్షయ్‌లు పూర్తిగా వినియోగించుకున్నారు. పవన్ గుప్తా ఇంతవరకు రివ్యూ పిటిషన్ తప్ప క్యురేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్ వెయ్యలేదు. -
‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: ‘నిర్భయ’దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శిక్షను అమలు చేయరాదంటూ ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. చట్టపరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాల్సి ఉన్నందున శిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేయాలంటూ దోషులు పెట్టుకున్న పిటిషన్‌పై అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఈ మేరకు ఆదేశాలిచ్చారు. నిర్భయ కేసులో దోషులైన పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ కుమార్ సింగ్‌లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలంటూ కోర్టు జనవరి 17వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి కోవింద్ వద్ద పెండింగ్‌లో ఉండగా, మిగతా ఇద్దరు చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలంటూ దోషులు పవన్, వినయ్, అక్షయ్‌ల తరఫున లాయర్ ఏపీ సింగ్ గురువారం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం జడ్జి ధర్మేందర్ రాణా విచారణ చేపట్టారు. నలుగురిలో ఏ ఒక్కరి పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా మిగతా వారిని ఉరి తీయడం నిబంధనలకు విరుద్ధమని దోషుల తరఫు న్యాయవాది వాదించారు. ఏకీభవించిన న్యాయమూర్తి డెత్ వారెంట్లను వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చారు. పవన్ పిటిషన్ కొట్టివేత మరోవైపు, నిర్భయ కేసులో మరో దోషి పవన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నేరానికి పాల్పడిన సమయానికి మైనర్ అయినందున తనకు విధించిన ఉరిశిక్షపై సమీక్ష జరపాలంటూ అతడు పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆఖరి అవకాశంగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇలా ఉండగా, న్యాయం దక్కే దాకా పోరాటం కొనసాగిస్తామని నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో అన్నారు. ఉరిశిక్ష వాయిదా పడేలా దోషులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరగాల్సి ఉందని హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మరోవైపు, హేయమైన నేరాలకు విధించిన ఉరిశిక్ష అమలుపై బాధితుల కోణంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
వారంలోపే ఉరి తీయాలి!
న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన దోషులను ఉరి తీసేందుకు డెత్ వారంట్ జారీ అయిన తరువాత వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ దిశగా ఆదేశాలివ్వాలని కోరుతూ కేంద్ర హోం శాఖ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉరిశిక్షను వాయిదా వేసేందుకు ‘నిర్భయ’ దోషులు రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష.. తదితర చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. ఉరిశిక్షను అమలుచేయడానికి సంబంధించి.. దోషుల హక్కులను కాకుండా బాధితుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ‘క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన వారం రోజుల్లో డెత్ వారంట్ జారీ చేయాలి. ఆ తరువాత వారం రోజుల్లో ఉరి శిక్షను అమలు చేయాలి. సహ దోషుల రివ్యూ, క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు ఏ స్థాయిలో ఉన్నా వాటిని పట్టించుకోకూడదు. అన్ని కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, జైలు అధికారులు దీన్ని అమలు జరిపేలా ఆదేశాలివ్వండి’ అని హోంశాఖ తన పిటిషన్లో కోరింది. దోషుల రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన తరువాత క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసేందుకు కచ్చితమైన కాలపరిమితి విధించాలని కూడా హోంశాఖ కోరింది. క్షమాభిక్ష కోరుకునే దోషి.. సంబంధిత కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ తనకు అందిన వారం రోజుల్లోపే క్షమాభిక్ష కోరుకునే విధంగా నిబంధనలను రూపొందించాలని పేర్కొంది. ‘అత్యాచారం కేవలం ఒక వ్యక్తిపై చేసే నేరం కాదు. మానవత్వంపై జరిగిన ఘాతుకం. అది నాగరిక సమాజం క్షమించలేని దారుణం’ అని హోంశాఖ ఆ పిటిషన్లో పేర్కొంది. ‘అందువల్ల ప్రజలు, బాధితులు, వారి కుటుంబాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని, దోషులను శిక్షించేందుకు ఉద్దేశించిన గత నిబంధనలను మార్చాలని.. చట్టంతో ఆడుకుని, శిక్ష అమలును వాయిదావేసే అవకాశం ఆ దారుణానికి ఒడిగట్టిన దోషులకు ఇవ్వవద్దని కోరుతున్నాం’ అని అభ్యర్థించింది. కేంద్ర హోం శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. -
ఉరితో రేప్‌లకు చెక్!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు భారత రాష్ట్రపతి కూడా తిరస్కరించడంతో నలుగురుకి ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా నిర్భయ తల్లి ఆశాదేవీని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరారు. నేరస్థులకు ఉరిశిక్షను అమలు చేయాలంటూ గత ఏడేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున ఆశాదేవీ క్షమాభిక్ష ప్రసాదించే ప్రసక్తే లేదు. పైపెచ్చు ఉరిశిక్ష వల్ల తనకు న్యాయం జరిగిందంటూ ఆమె సంతప్తి కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. రేప్‌లకు ఉరిశిక్షలు అమలు చేయాలంటూ ఆందోళనలు చేస్తున్న సామాజిక కార్యకర్తలంతా స్వీట్లు పంచుకొని ఆనందోత్సవాలు కూడా జరుపుకోవచ్చు. అసలు ఉరిశిక్షల వల్ల మహిళలపై అత్యాచారాలు తగ్గుతాయా ? అన్నది ప్రస్తుతం ప్రజాస్వామ్యవాదుల ప్రశ్న. నిర్భయ అత్యాచారం, హత్య సంఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగిన నేపథ్యంలో దారుణమైన అత్యాచార సంఘటనల్లో ఉరిశిక్షలు విధించేందుకు వీలుగా కేంద్రం 2013లో చట్ట సవరణ తీసుకొచ్చింది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ లెక్కల ప్రకారం 2015 నుంచి 2017 మధ్య దేశంలో 31 శాతం మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. ఎక్కువ కేసుల్లో మహిళలపై అత్యాచారం జరిపి అనంతరం హత్యలు చేశారు. ఇది అంతకుముందు చాలా అరుదుగా జరిగేది. బాధితురాలు బతికుంటే తమకు మరణ శిక్షలు పడే అవకాశం ఉందన్న భావంతోనే ఈ హత్యలు జరిగాయని న్యాయ నిపుణులు విశ్లేషించారు. వీటికన్నా అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగితేనే సానుకూల ప్రభావం ఉంటుందని, శిక్షలు కఠినం అవుతున్న కొద్దీ విచారణ ప్రక్రియ చాలా జాప్యం అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2018లో జరిగిన అత్యాచార కేసుల్లో 85 కేసుల్లో చార్జిషీట్లు నమోదు కాగా, వాటిలో శిక్షలు పడేవరకు వెళ్లిన కేసులు కేవలం 27 శాతం మాత్రమే. పైగా అత్యాచార కేసుల్లో నేరస్థులు ఎక్కువగా పరిచయస్థులు, స్నేహితులు లేదా ఇరుగుపొరుగు వారే ఉంటున్నారు. అపరిచితులు తక్కువగా ఉంటున్నారు. పరిచయస్థులు కనక కేసులవుతే మరణ శిక్షలు ఖాయమనుకొని సాక్ష్యాధారాల నిర్మూలనలో భాగంగా మహిళలను ఎక్కువగా హత్య చేస్తున్నారని సామాజిక విశ్లేషకులు తెలిపారు. నిర్భయ లాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు భావోద్వేగాలకు గురై కఠిన చట్టాల కోసం ఆందోళనలకు దిగడం సహజం. ప్రజల భావోద్వేగాలకు అనుకూలంగా న్యాయ నిర్ణేతలు చట్టాలు తీసుకరావడం ప్రమాదకరం. కఠిన చట్టాలే పరిష్కారమైతే నిర్భయ చట్టం తర్వాత హైదరాబాద్‌లో ‘దిశ’ దారుణ అత్యాచార, హత్య సంఘటన జరిగి ఉండేది కాదు. మరణ శిక్ష పడుతుందనే భయాందోళనలతోనే ఆ కేసులో నేరస్థులు దిశను కాల్చివేశారు. చదవండి : దోషులను క్షమించడమా... ఆ ప్రసక్తే లేదు! ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం -
నిర్భయ దోషులకు కొత్త డెత్‌వారెంట్లు జారీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీలను ఢిల్లీకోర్టు ఖరారు చేసింది. గతంలో ప్రకటించిన తేదీ కాకుండా మరోసారి డెత్ వారెంట్లు జారీచేసింది. నలుగురు దోషులకు ఫిబ్రవరి 1 ఉదయం 6గంటలకు (శనివారం) ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా పటియాల హౌస్‌కోర్టు శుక్రవారం తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. కాగా జనవరి 22న దోషులను ఉరి తీసేందుకు జైలు అధికారులు ఇదివరకే ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే హత్య కేసులో దోషి ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించారు. కాగా ఉరిశిక్ష అమలు ఆలస్యంపై నిర్భయ తల్లితో పాటు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఉరితీత తేదీల్లో మార్పులు చేస్తూ.. తాజాగా డెత్‌వారెంట్లను జారీచేశారు. -
నిర్భయ కేసు : దోషుల ఉరిపై స్టే
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యం నెలకొంది. ఈ కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నెల 22న వారి ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు గురువారం నిలిపివేసింది. వారికి డెత్ వారెంట్ ఇస్తూ తాను జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించడం లేదని, క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో వారి ఉరి శిక్ష అమలుపై స్టే విధిస్తున్నామని తీస్ హజారి కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసుపై పూర్తి నివేదికను రేపటిలోగా ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించారు. కాగా, రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున నిర్భయ దోషులను తాము ఈనెల 22న ఉరితీయడం లేదని అంతకుముందు తీహార్ జైలు అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు. కాగా నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో ఈనెల 22న వారి ఉరిశిక్ష నిలిచిపోయిందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులోనలుగరు దోషులు ముఖేష్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలను జనవరి 22న ఉరి తీయాలని ఈనెల 7న ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : నిర్భయ కేసులో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం -
క్షమాభిక్ష పెట్టండి!
న్యూఢిల్లీ: మరణ శిక్ష తప్పించుకునేందుకు ‘నిర్భయ’ దోషులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా దోషుల్లో ఒకరైన ముకేశ్ మంగళవారం క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశ్రయించాడు. అలాగే, తన ఉరిశిక్షపై జారీ అయిన డెత్ వారంట్‌ను పక్కన పెట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టాడు. నిర్భయ దోషులు వినయ్ శర్మ(26), ముకేశ్ కుమార్(32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా(25)లను జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని ట్రయల్ కోర్టు జనవరి 7వ తేదీన డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిలో ఇద్దరు వినయ్ శర్మ, ముకేశ్ కుమార్‌లు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత మంగళవారం సాయంత్రం ముకేశ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. వినయ్, ముకేశ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను కొట్టివేయడంతో పాటు, వారి ఉరిశిక్ష అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్యూరేటివ్ పిటిషన్లను నిశితంగా పరిశీలించి, వారి అభ్యర్థనను తోసిపుచ్చాలనే ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం వెల్లడించింది. క్యూరేటివ్ పిటిషన్ శిక్ష పడిన వ్యక్తికి లభించే చట్టబద్ధమైన చివరి అవకాశం. అయితే, ఇప్పటివరకు మిగతా ఇద్దరు దోషులు అక్షయ్, పవన్ క్యూరేటివ్ పిటిషన్లను దాఖలు చేయలేదు. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పిటిషన్ పెట్టుకున్నానని, అందువల్ల ఢిల్లీ ట్రయల్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌ను పక్కనపెట్టాలని ముకేశ్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించారు. లేని పక్షంలో క్షమాభిక్ష కోరే తన రాజ్యాంగ హక్కును కోల్పోతానన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టులోని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంగీత ధింగ్రాల ధర్మాసనం నేడు(బుధవారం) విచారించే అవకాశముంది. తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ.. ఆ తరువాత మరణశిక్షను అమలు చేసేందుకు కనీసం 14 రోజుల గడువు ఉండాలన్న నిబంధనను ముకేశ్ కోర్టుకు గుర్తు చేశారు. త్వరలో క్షమాభిక్ష పిటిషన్ వేస్తా మిగతా ఇద్దరు దోషులు అక్షయ్, పవన్ తరఫున సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్లను వేస్తానని న్యాయవాది ఆర్పీ సింగ్ వెల్లడించారు. ఈ నలుగురు దోషులపై ట్రయల్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌ను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. ‘దోషుల తరఫున క్షమాభిక్ష పిటిషన్ వేసిన తరువాత ఈ విషయాన్ని వివరిస్తూ.. ఉరిశిక్ష అమలును నిలిపేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయిస్తాన’న్నారు. కాగా, వినయ్, ముకేశ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. వారిని ఉరితీసే జనవరి 22 వ తేదీ తనకు అత్యంత ముఖ్యమైన రోజని ఆమె వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వద్ద హర్షం వ్యక్తం చేస్తున్న నిర్భయ తల్లి 2012, డిసెంబర్ 16 అర్ధరాత్రి.. 2012, డిసెంబర్ 16 అర్ధరాత్రి పారామెడిక్ విద్యార్థిని బస్సులో దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెను దారుణంగా హింసించిన ఆరుగురు వ్యక్తులు ఆ తరువాత ఆమెను బస్సులో నుంచి రోడ్డుపై విసిరేశారు. అనంతరం, ‘నిర్భయ’గా పేరు పొందిన ఆ బాధితురాలు డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ ఆరుగురు దోషుల్లో నలుగురికి ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను 2017లో సుప్రీంకోర్టు సమర్ధించింది. దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్ తిహార్ జైళ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి అయిన మైనర్ బాలుడు జువనైల్ హోంలో మూడేళ్లు శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. మిగిలిన దోషుల్లో ముగ్గురు 2018 జూలైలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. -
నిర్భయ: ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరి తీసేందుకు డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ముందుగా ఇసుక బస్తాలతో డమ్మీ ఉరి తీసేందుకు తీహార్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జైలు అధికారులు తెలిపారు. దోషులు పవన్‌గుప్తా, అక్షయ్, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌ల బరువు ఆధారంగా ఇసుక సంచులను సిద్ధం చేసినట్టు తెలిపారు. దోషుల బరువుకు సమానమైన బరువున్న ఇసుక బస్తాలను ఆ తాళ్లకు కట్టి 1.8 మీటర్ల నుంచి 2.4 మీటర్ల ఎత్తులో వేలాడదీస్తారు. చదవండి: నేనొక బండరాయిని.. నాకు భావోద్వేగాలు లేవు ఉరి కంబాల పటిష్టతను పరిశీలించడం కోసం ఇలా డమ్మీ ఉరి శిక్షను అమలు చేస్తారు. ఇందులో తాళ్లలో కానీ, ఉరికొయ్యలో కానీ ఏవైనా లోపాలుంటే బయటపడే అవకాశముంటుంది. తీహార్ ప్రాంగణంలోని మూడో నెంబరు జైల్లో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు. నలుగురు దోషులకు ఏకకాలంలో ఉరి తీసేలా జైలులోని 3వ నంబరు గదిలో ఉరి ప్రాంగణాన్ని విస్తరించారు. ప్రస్తుతం దోషులు నలుగురినీ వేర్వేరు గదుల్లో ఉంచి ఒకరితో ఒకరు కలవకుండా చర్యలు చేపట్టారు. చదవండి: లాఠీలతో చితక్కొడతాం.. జైళ్లో పడేస్తాం -
బ్రేకింగ్: నిర్భయ దోషులకు డెత్ వారెంట్..
-
నిర్భయ దోషులకు డెత్ వారెంట్..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనపై ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు శిక్ష అమలు తేదీని ఖరారు చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలలోపు ఉరిశిక్ష అమలు చేయాలని పటియాల హౌస్‌కోర్టు ఆదేశించింది. ఈ మేరకు విచారణలో భాగంగా మంగళవారం డెత్ వారెంట్‌ను జారీచేసింది. కాగా దోషులను వెంటనే శిక్షించాలని కోరుతూ నిర్భయ తల్లి ఆశాదేవీ పటియాల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం దోషులకు (ముఖేష్, పవన్‌గుప్తా, అక్షయ్‌కుమార్, వినయ్‌శర్మ) డెత్ వారెంట్‌ను జారీచేసింది. దీంతో ఏడేళ్ల నిరీక్షణకు న్యాయస్థానం ఎట్టకేలకు తెరదించింది. ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ.. నలుగురు దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇదివరకే తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో శిక్ష అమలుకు లైన్‌క్లియర్ అయ్యింది. కాగా 2012 డిసెంబర్ 16న నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అనంతరం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద ఆందోళనకు దారి తీసింది. 2013 సెప్టెంబర్ 13న నలుగురు నిందితులును దోషులకు తేల్చుతూ.. న్యాయస్థానం మరణశిక్షను విధించింది. నమ్మకం పెరిగింది.. - దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు ఇచ్చిన తీర్పును నిర్భయ తల్లి ఆశాదేవీ సంతోషం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందన్నారు. ఏడేళ్ల అనంతరం తన బిడ్డకు న్యాయం జరిగిందన్నారు. మంత్రి తానేటి వనితా హర్షం నిర్భయ కేసులో నిందితులకు న్యాయ స్దానం ఉరిశిక్ష ఖరారు చేయడంపై ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితా హర్షం వ్యక్తం చేశారు. ‘నిర్భయ తల్లిదండ్రులకు న్యాయం జరిగింది. నిర్భయ కేసులో నిందితులకు ఊరి వేయాలని దేశ వ్యాప్తంగా యువత, ప్రజలు కోరుకున్నారు. ఇటువంటి ఘటనలు ఆంద్రప్రదేశ్‌లో చోటు చేసుకోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాని తీసుకువచ్చారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.’ అని అన్నారు. -
27 ఏళ్ల తర్వాత ఖండించింది
రష్డీపై ఫత్వాను ఖండించిన నోబెల్ కమిటీ స్టాక్‌హోం: బ్రిటిష్ ఇండియన్ నవలా రచయిత, వివాదాస్పద సెటానిక్ వర్సెస్ పుస్తకాన్ని రాసిన సల్మాన్ రష్డీపై ఇరానియన్ మతపెద్ద అయతున్లా రుహుల్లా కొమైనీ జారీ చేసిన ఫత్వాను స్వీడిష్ అకాడమీ గురువారం ఖండించింది. నోబెల్ సాహిత్య విజేతను ఎంపిక చేసే ఈ కమిటీ నుంచి 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ నిర్ణయం వెలువడింది. సెటానిక్ వర్సెస్ పుస్తకంలో ఇస్లాంను కించపరచారనే ఆరోపణలతో రష్డీపై ఫత్వా జారీ అయింది. అయితే 1989లో దీన్ని ఖండించడానికి అకాడమీ నిరాకరించడంతో ఇద్దరు సభ్యులు తమ పదవులనుంచి తప్పుకున్నారు. ఈ పుస్తకంపై రాజకీయ దుమారం రేగడంతో స్వీడిష్ అకాడమీ వ్యక్తికి భావప్రకటనా స్వేచ్ఛ ఉందని చెబుతూనే రష్డీకి మద్దతు మాత్రం ప్రకటించలేదు. ఏదేమైనప్పటికీ ఇన్నాళ్లకు రష్డీపై ఫత్వాను ఖండించిన స్వీడిష్ అకాడమీ ఆయన తలకు వెలకట్టడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తన వెబ్సైట్లో పేర్కొంది. -
యూపీ లవర్స్ డెత్ వారెంట్ రద్దు
న్యూఢిల్లీ: ఏడుగురిని హత్య చేసిన కేసులో యూపీ యువతి, ఆమె ప్రియుడికి విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సెషన్స్ కోర్టు జడ్జి హడావుడిగా జారీ చేసిన డెత్ వారెంట్ ను కొట్టివేసింది. రివ్యూ, మెర్సీ పిటిషన్ల కోసం ఎదురు చూడకుండా డెత్ వారెంట్ పై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తొందరపాటుతో సంతకం చేశారని సుప్రీంకోర్టు పేర్కొంది. నిందితురాలు షబ్నం తన ప్రియుడు సలీంతో తన కుటుంబానికి చెందిన ఏడుగురిని హతమార్చింది. మృతుల్లో 10 నెలల పాప కూడా ఉంది. 2008లో ఏప్రిల్ 15న ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో షబ్నం, సలీంలకు సెషన్స్ కోర్టు 2010లో మరణశిక్ష విధించింది. ఈ తీర్పును 2013లో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈనెల 21న డెత్ వారెంట్ జారీకావడంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి విధించిన మరణశిక్షపై సుప్రీంకోర్టు ఈనెల 25న స్టే విధించింది. -
అఫ్జల్‌గురు డెత్ వారెంట్ కాపీ ఇవ్వండి
తీహార్ జైలు అధికారులకు కేంద్ర సమాచార కమిషన్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌పై దాడి కేసులో ఉరిశిక్ష పడ్డ అఫ్జల్ గురు డెత్ వారెంట్ అధికార ధ్రువీకృత ప్రతిని సమాచార హక్కు చట్టం కింద అందచేయాలని తీహార్ జైలు అధికారులను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. అఫ్జల్ గురు ఉరిశిక్ష అమలు తేదీకి సంబంధించి అతని కుటుంబ సభ్యులకు పంపిన సమాచారం వివరాలనూ వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఈ మధ్య ఉత్తర్వులు జారీ చేశారు. అఫ్జల్‌గురు ఉరిశిక్ష వివరాలను, అతని డెత్ వారెంట్‌ను సమాచార హక్కు చట్టం కింద ఇచ్చేందుకు తీహార్ జైలు అధికారులు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పరాస్నాథ్ సింగ్ కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కమిషనర్ శ్రీధర్.. సరైన కారణం చూపకుండా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1) కింద మినహాయింపు కోరుతూ దరఖాస్తును తిరస్కరించే అధికారం తీహార్ జైలు అధికారులకు లేదని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.