నిర్భయ: ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు | Nirbhaya Case Dummy Execution Of Four Convicts Performed In Tihar | Sakshi
Sakshi News home page

నిర్భయ: ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు

Published Mon, Jan 13 2020 12:17 PM | Last Updated on Mon, Jan 13 2020 12:34 PM

Nirbhaya Case Dummy Execution Of Four Convicts Performed In Tihar - Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరి తీసేందుకు డెత్‌ వారెంట్‌ జారీ అయిన నేపథ్యంలో ముందుగా ఇసుక బస్తాలతో డమ్మీ ఉరి తీసేందుకు తీహార్‌ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జైలు అధికారులు తెలిపారు. దోషులు  పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌ల బరువు ఆధారంగా ఇసుక సంచులను సిద్ధం చేసినట్టు తెలిపారు. దోషుల బరువుకు సమానమైన బరువున్న ఇసుక బస్తాలను ఆ తాళ్లకు కట్టి 1.8 మీటర్ల నుంచి 2.4 మీటర్ల ఎత్తులో వేలాడదీస్తారు.

చదవండి: నేనొక బండరాయిని.. నాకు భావోద్వేగాలు లేవు

ఉరి కంబాల పటిష్టతను పరిశీలించడం కోసం ఇలా డమ్మీ ఉరి శిక్షను అమలు చేస్తారు. ఇందులో తాళ్లలో కానీ, ఉరికొయ్యలో కానీ ఏవైనా లోపాలుంటే బయటపడే అవకాశముంటుంది. తీహార్ ప్రాంగణంలోని మూడో నెంబరు జైల్లో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు. నలుగురు దోషులకు ఏకకాలంలో ఉరి తీసేలా జైలులోని 3వ నంబరు గదిలో ఉరి ప్రాంగణాన్ని విస్తరించారు. ప్రస్తుతం దోషులు నలుగురినీ వేర్వేరు గదుల్లో ఉంచి ఒకరితో ఒకరు కలవకుండా చర్యలు చేపట్టారు.

చదవండి: లాఠీలతో చితక్కొడతాం.. జైళ్లో పడేస్తాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement