అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న టార్గెట్‌తో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రజలకు పెద్ద పెద్ద వరాలే ఇస్తున్నారు. కాగా, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఏకంగా ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి అమెరికన్లకు విముక్తి కల్పిస్తానని ప్రకటించారు. దీంతో, ట్రంప్ హామీపై చర్చ నడుస్తోంది.
అయితే, వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ క్లబ్‌లో ట్రంప్.. అమెరికా పార్లమెంట్ సభ్యులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి అమెరికన్లకు విముక్తి కల్పిస్తానని, దాని స్థానంలో టారిఫ్‌ల పాలసీని అమలు చేస్తానని ప్రకటించారు. సమస్యాత్మక సంస్థలతో జరిపే చర్చల్లో సుంకాలను సాధనంగా ఉపయోగించుకోవాలని ఈ భేటీలో తెలిపారు.
Trump has floated the concept of eliminating income tax and replacing it with tariffs.
Wouldn't that require drastically reducing the size of the US Government?
Dammit, I'm in. How about you? pic.twitter.com/YHSw3arMV5— TaraBull (@TaraBull808) June 13, 2024
అయితే, ఈ ప్రతిపాదనపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ పన్ను స్థానంలో టారిఫ్‌లను తీసుకురావడమంటే దిగువ, మధ్యతరగతి అమెరికన్లను తీవ్రంగా దెబ్బతీసి సంపన్నులకు లబ్ధి చేకూర్చడమే అవుతుందని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment