నేడు కశ్మీర్‌కు కోవింద్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నా«థ్ కోవింద్ నేడు జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు కేంద్రమం త్రి వెంకయ్య నాయుడు ప్రచారంలో పాల్గొంటారు. జూలై 4న రామ్‌నా«థ్ కోవింద్ తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా 4 వ తేదీ ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు.
ఆ తర్వాత పార్క్ హోటల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కలుసుకోనున్నారు. మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్ లోని జలవిహార్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్‌తో భోజనం అనంతరం విజయవాడ వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమవుతారు.