ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో.. ఆ పార్టీలో మునుపెన్నడూ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ పక్షానికి ప్రయోజనం చేకూరని న్యాయమైన పోటీని చూడబోతున్నారంటూ అభ్యర్థి శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి.
సోనియా గాంధీ కుటుంబం స్పష్టంగా ఒక మాట చెప్పింది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో తాము ఎవరి పక్షాన నిలవబోమని. అలాగే చీఫ్ ఎన్నికల అధికారి మధుసుధన్ మిస్ట్రీ సైతం పార్టీ తరపున అధికారిక అభ్యర్థి లేరనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ప్రకటనలు చాలావా.. ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా ఉండడం లేదని చెప్పడానికి అని థరూర్ ఆదివారం వ్యాఖ్యానించారు.
అయితే థరూర్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చ మొదలైంది. సోనియా కుటుంబం ఈ అధ్యక్ష ఎన్నికల్లో తటస్థంగా ఉంటుండడంతో.. ఎవరికి తమ మద్దతు ఇవ్వాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు నేతలు. ప్రత్యేకించి సీనియర్లపై ఒత్తిడి నెలకొందని పార్టీ శ్రేణులు పైకి చెప్పేస్తున్నాయి. మరోవైపు సీనియర్లు తనకెవరూ మద్దతు ఇవ్వబోరంటూ గతంలో శశిథరూర్ బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కీలక నేతలు మాత్రం అధిష్టానం ఆదేశానుసారం లేదంటే అధిష్టానాన్ని అనుసరించాలని చూశాయి. ఇప్పుడు తటస్థ స్థితితో డైలామాలో పడిపోయారంతా.
ఇక అధ్యక్ష బరిలో దిగిన మరో అభ్యర్థి మల్లికార్జున ఖర్గే.. ఈ ఎన్నికలు పార్టీ అంతర్గత వ్యవహారమని, అయితే.. నిజమైన పోటీ మాత్రం బీజేపీతోనేనని పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఏపార్టీ నిర్మించిన ప్రజాస్వామ్యిక వ్యవస్థలను బలహీనం చేసుకుంటూ.. కుప్పకూలుస్తూ పోతున్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌లతో రాజకీయ, ప్రజాస్వామ్యిక, సామాజిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. అందుకే మా నిజమైన పోరాటం వాటితోనే అని ఖర్గే జమ్ములో తెలిపారు.
అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 19న చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. దాదాపు 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకున్నారు.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్ ఉద్దేశం అదే!
Comments
Please login to add a commentAdd a comment