ట్రంప్‌కు 34 మిలియన్‌ డాలర్ల విరాళాలు | Donald Trump Campaign Saw a Spike In Donations After Indictment | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు 34 మిలియన్‌ డాలర్ల విరాళాలు

Published Sun, Apr 16 2023 5:32 AM | Last Updated on Sun, Apr 16 2023 5:32 AM

Donald Trump Campaign Saw a Spike In Donations After Indictment - Sakshi

న్యూయార్క్‌: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2024 అధ్యక్ష ఎన్నికలకు విరాళంగా ఇప్పటి వరకు 34 మిలియన్‌ డాలర్లను సేకరించినట్లు ఆయన మద్దతుదారులు తెలిపారు. విరాళాలను ఎలా సంపాదించిందీ వివరిస్తూ ఆయన ఫెడరల్‌ ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇవ్వనున్నారు.

మొత్తం 34 మిలియన్‌ డాలర్లలో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 18.8 మిలియన్‌ డాలర్లు అందాయి. హష్‌ మనీ కేసులో ట్రంప్‌పై నేరారోపణల ప్రక్రియ మొదలుకొని కోర్టు దోషిగా ప్రకటించే వరకు రెండు వారాల వ్యవధిలోనే 15.4 మిలియన్‌ డాలర్లు విరాళంగా అందినట్లు మద్దతుదారులు తెలిపారని పొలిటికో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement