వాషింగ్టన్: ఈ ఏడాదిలో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సౌత్ కరోలినా డెమోక్రాటిక్ ప్రైమరీలో అధ్యక్షుడు జో బైడెన్ ఘన విజయం సాధించారు. బెడైన్‌కు ఇద్దరు అభ్యర్థులు గట్టి పోటీని ఇచ్చినప్పటికీ ఆయనే గెలుపొందారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి శనివారం జరిగిన సౌత్ కరోలినా డెమోక్రాటిక్ ప్రైమరీలో జో బైడెన్ విజయం సాధించారు. దాదాపు 55 మంది డెలిగేట్‌లు ఈ పోటీలో ఉన్నప్పటికీ, తొలి నుంచి బైడెన్‌దే విజయమని అంతా భావించారు. అనుకున్నట్టుగానే బైడెన్ విజయాన్ని అందకున్నారు. ఈ పోటీలో మారియన్ విలియమ్సన్, డీన్ ఫిలిప్స్‌లు బైడెన్‌కు పోటీ ఇచ్చారు. ఇక, సౌత్ కరోలినా ప్రైమరీలో విజయం సాధించిన సమయంలో బైడెన్ లాస్ ఏంజెల్స్‌లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Joe Biden wins 96% of the South Carolina vote…….just like Putin, Xi and Rocketman win elections in their countries.
— Steve (@Steve66810226) February 4, 2024
Easy to win when it’s fixed.
అనంతరం, సౌత్ కరోలినాలో విజయంపై ఆయన స్పందిస్తూ..‘ఎన్నికల ప్రచారానికి సౌత్ కరోలినా ఓటర్లు కొత్త జోష్ తీసుకొచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఓటర్లు మాకు పూర్తి మద్దతు తెలిపారు. ప్రెసిడెన్సీని గెలుచుకునే మార్గంలో మమ్మల్ని నడిపించారు. ఇప్పుడు కూడా సౌత్ కరోలినా ప్రజలు మరోసారి అదే రకమైన తీర్పునిచ్చారు. ట్రంప్‌ను ఓడిపోయేలా చేయడానికి, మమ్మల్ని నడిపించారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
𝗔𝗠𝗘𝗥𝗜𝗖𝗔 𝗩𝗢𝗧𝗘𝗦 𝗖𝗔𝗠𝗣𝗔𝗜𝗚𝗡 '𝟮𝟰: 𝗧𝗛𝗘 𝗦𝗢𝗨𝗧𝗛 𝗖𝗔𝗥𝗢𝗟𝗜𝗡𝗔 𝗗𝗘𝗠𝗢𝗖𝗥𝗔𝗧𝗜𝗖 𝗣𝗥𝗜𝗠𝗔𝗥𝗬
— CAPITAL POLITICS (@capital_pols) February 4, 2024
The votes are still coming in, but Capital Politics projects that Pres. Joe Biden wins the SC Primary, defeating Rep. Dean Phillips and Marianne Williamson. pic.twitter.com/WkzTkz1Vk1
మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, బైడెన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అవకాశం ఉన్న ప్రతీసారి వీరిద్దరూ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అంతకుముందు, బెడైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిధుల సేకరణకు వెళ్లు సమయంలో బైడెన్ మాట్లాడుతూ ఇది కేవలం ప్రచారం కాదని, దేశ ప్రయోజనాల కోసం ఈ ప్రచారాన్ని మనం కోల్పోలేమన్నారు. ఏం జరుగుతుందో అమెరికన్లు అర్ధం చేసుకుంటారని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment