న్యూఢిల్లీ: ఎన్సీపీలో అనూహ్య చీలిక మహారాష్ట్రలోనేకాదు జాతీయ స్థాయిలో ప్రకంపనలు కలిగిస్తోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను అజిత్ తనవెంట తీసుకెళ్లడంతో శరద్ పవర్‌కు సొంత పార్టీలో బలం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాల ఐక్యతకు తనవంతు బలం ఇచ్చే స్థాయిలో శరద్ ప్రస్తుతం లేరనే చెప్పాలి. దీంతో గత నెలలో పట్నాలో 15 ప్రతిపక్ష పార్థీలల ఐక్యత కోసం చేసిన యత్నానికి జోరు కాస్తంత తగ్గింది.
ఇప్పటికే ఢిల్లీ రాష్ట్రంలో పాలనపై సర్వాధికారం విషయంలో ఆర్డినెన్స్‌కు సంబంధించి ఆప్, కాంగ్రెస్ మధ్య పొసగలేదు. అటు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య బాహాటంగా మాటల తూటాలు పేలాయి. కేరళలోనూ కాంగ్రెస్, సీపీఎంలకూ కుదరట్లేదు. తాజాగా అజిత్ ఇచ్చిన షాక్‌తో 2024 ఎన్నికల్లో బీజేపీ మోదీ ప్రభుత్వాన్ని ఐక్యంగా ఢీకొట్టాలన్న ప్రయత్నాలకు కాస్తంత బ్రేక్ పడినట్లయింది. విపక్షాలను ఏకం చేయడంలో ఇప్పటి వరకు కీలకంగా ఉన్న శరద్ పవార్ మున్ముందు ఎలా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉంది.
మహారాష్ట్రలో బీజేపీకి ఊపు
మహారాష్ట్ర రాజకీయాల్లో కొద్దికాలంగా బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. షిండే ప్రభుత్వంలో చేరాలన్న అజిత్ నిర్ణయంతో ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ కీలకంగా మారే సమయం వచ్చింది. లోక్‌సభ ఎన్నికల సమయానికి తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలోని మూడు పార్టీలు మూడు శక్తివంతమైన వర్గాలకు నాయకత్వం సాధించే స్థాయిలో ఉన్నాయి. మహావికాస్ అఘాడి(ఎంవీఏ)పై బీజేపీ పైచేయి సాధించేందుకు అవకాశం చిక్కింది.
Comments
Please login to add a commentAdd a comment