నినాదాల్లేవ్‌.. ‘మణిపూర్‌’పై వ్యూహాత్మక నిరసన | Parliament monsoon session: Opposition With black clothes No Slogans | Sakshi
Sakshi News home page

గడ్కరీ మాట్లాడేటప్పుడు నినాదాలుండవట!.. మణిపూర్‌పై ఇండియా కూటమి వ్యూహాత్మక నిరసన

Published Thu, Jul 27 2023 10:50 AM | Last Updated on Thu, Jul 27 2023 10:56 AM

Parliament monsoon session: Opposition With black clothes No Slogans - Sakshi

ఢిల్లీ: మణిపూర్‌ అంశంతో పార్లమెంట్‌ను కుదిపేస్తున్న విపక్ష కూటమి ఇండియా.. ఇక నినాదాలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగని తమ నిరసనలను మాత్రం ఆపదట. ఇందుకోసం వ్యూహాత్మక ధోరణిని ప్రదర్శించాలని నిర్ణయించింది. 

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో.. కేం‍ద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సహా ఎన్డీయేకి సంబంధించిన కొందరు ఎంపీలు మాత్రమే ప్రసంగించే సమయంలో నినాదాలు చేయకూడదని ఎన్డీయే కూటమి సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం జరిగిన ఫ్లోర్‌ స్ట్రాటజీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మిగతా వాళ్ల విషయంలో మాత్రం తమ నిరసనలు కొనసాగిస్తారట. 

మణిపూర్‌లో శాంతి భద్రతలు చెల్లాచెదురై అక్కడ అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి.. ఆ అంశంపై మాట్లాడాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కేంద్రం అందుకు సుముఖంగా లేకపోవడంతో అవిశ్వాసం ద్వారా చర్చ వైపుగా అడుగులు వేస్తున్నాయి. 

నల్ల నిరసన 
ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. స్పీకర్‌ అనుమతి సైతం పొందింది విపక్ష కూటమి. చర్చకు ఇంకా తేదీ ఖరారు కావాల్సి ఉంది. ఈలోపు కూడా మణిపూర్‌ రగడ కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మణిపూర్‌ అంశంపై కేంద్రం మెడలు వంచే ప్రయత్నం చేస్తున్న విపక్ష కూటమి ఇండియా.. ఇవాళ సమావేశాలకు నల్ల దుస్తులతో నిరసన తెలియజేయాలని నిర్ణయించింది. ఫ్లోర్‌ ఆఫ్‌ ది హౌజ్‌ మీటింగ్‌కు పలువురు సభ్యులు నల్లటి దుస్తుల్లో హజరు అయ్యారు కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement