న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాజకీయ విరోధులకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను ఏకపక్షంగా వాడుకుంటోందంటూ 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 5వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
డీఎంకే, ఆర్జేడీ, బీఆర్‌ఎస్, టీఎంసీ, ఎన్‌సీపీ, జేఎంఎం, జేడీయూ, సీపీఎం ఎస్‌పీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలు వేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం వాదనలు వింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో 95% ప్రతిపక్ష పార్టీల నేతలపై ఉన్నవేనని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment