
పాట్నా: 2024లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు చేతులు కలిపి, బలమైన కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉందని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అగ్రనేత నితీశ్ కుమార్ శనివారం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక విపక్ష నేతల భేటీ జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా విపక్షాల ఐక్యత, కూటమి ఏర్పాటుపై విస్తృతంగా చర్చించనున్నట్లు వివరించారు.
కొన్ని పార్టీల నాయకులు ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారని, ప్రతిపక్షాల సమావేశ వేదికను ఇంకా ఖరారు చేయలేదని, బిహార్ రాజధాని పాట్నాలో ఈ భేటీ జరిగితే తాను సంతోషిస్తానని అన్నారు. పాట్నాలో నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు సూచించారని గుర్తుచేశారు. విపక్షాలకు ఏకం చేయడమే ధ్యేయంగా ఇప్పటికే వివిధ పార్టీల ముఖ్య నేతలతో మాట్లాడానని, త్వరలో మరికొన్ని బీజేపీయేతర పార్టీల నాయకులను కలిసి చర్చిస్తానని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment