బనశంకరి: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి బెంగళూరులో సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్ సహా 24 ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగే భేటీలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తారు. బిహార్, తమిళనాడు, పశి్చమబెంగాల్ సీఎంలు నితీశ్‌కుమార్, స్టాలిన్, మమతాబెనర్జీ కూడా పాల్గొననున్నారు.
జూన్ 23న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పట్నాలో ప్రతిపక్షాల మొదటి సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. తాజా సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్) నితీశ్‌కుమార్ (జేడీయూ), మమతా బెనర్జీ (టీఎంసీ), ఎంకే.స్టాలిన్ (డీఎంకే), హేమంత్‌సోరెన్ (జేఎంఎం), ఉద్ధవ్‌ఠాక్రే (ఎస్‌ఎస్–యుబీటీ), శరద్‌పవార్ (ఎన్‌సీపీ), డి.రాజా(సీపీఐ), లాలూప్రసాద్ యాదవ్ (ఆర్‌జేడీ), అఖిలేశ్‌యాదవ్ (ఎస్‌పీ), సీతారాం ఏచూరి (సీపీఐఎం), ఒమర్ అబ్దుల్లా (ఎన్‌సీపీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదితరులు పాల్గొంటారు.
భేటీకి ఆప్ కూడా..
ఢిల్లీ యంత్రాంగంపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ తెలిపింది. కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని తెలిపింది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై ఆప్ స్పందించింది. బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పారీ్టల సమావేశానికి తాము కూడా హాజరవుతామని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తెలిపారు. ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment