శ్రీహరి నామ శబ్దాన్నే సహించలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని నానా హింసలూ పెడతాడు.. నీ శ్రీహరి ఎక్కడున్నాడు చెప్పు. అక్కడా...? ఇక్కడా ? ఎక్కడ ? అంటూ ఇబ్బంది పెడతాడు.. అప్పుడు బాలకుడు ప్రహ్లాదుడు పద్యం అందుకుంటూ ఇందు గలఁ డందు లేఁ డని సందేహము వలదు తండ్రీ.. ఎందెందు వెతికినా.. శ్రీహరి కనిపిస్తాడు అంటాడు.. అప్పుడు తండ్రి.. ధిక్కారమున్ సైతునా అంటూ ఏదీ ఈ స్తంభంలో చూపించు అని ఆ స్తంభాన్ని బద్దలుకొట్టగా అందులోంచి ప్రళయగర్జన చేస్తూ నరసింహస్వామి వస్తాడు.. అది వేరే.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది.. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులై ఉంది... దేశంలో ఏ చిటారుకొమ్మకు ఎగిరిపోయినా ఏ రాష్ట్రానికి మరలిపోయినా జగనన్న ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు.. తమ పట్ల ఆయన తీసుకున్న బాధ్యత... శ్రద్ధాసక్తులు సైతం ఆ వలస జీవులు తమతో మోసుకెళుతున్నారు.
దానికి ఉదాహరణే.. హైదరాబాద్‌లో బతకడానికి వలసవెళ్లిన గుడివాడకు చెందిన కుమారి అనే మహిళా అక్కడ ఫుట్ పాత్ మీద చిన్న భోజన హోటల్ పెట్టుకుని నడుపుతోంది. ఇక్కడ తాము ఆర్జిస్తున్న ఆదాయం తమ కుటుంబానికి సరిపోకపోవడంతో భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లారు. అక్కడ ఆమె భర్త ఆటో నడుపుతుండగా ఆమె హోటల్ పెట్టి తక్కువ ఖర్చుతో పదిమందికీ భోజనం పెడుతోంది.
ఆమె వండి వడ్డిస్తున్న తీరు.. మాటకారితనం.. అన్నీ కలిపి ఆమెను కొద్దిరోజుల్లోనే పాపులర్ చేసేశాయి.. దానికి తోడు యూట్యూబ్ చానెళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేయగా తనకు ఆంధ్రాలో జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చిందని, ఇల్లు ఇచ్చిందని సంతోషంగా చెప్పింది.. సరిగ్గా ఈ పాయింటును పట్టుకున్న ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తెలంగాణలోని తమ అనుకూల ప్రభుత్వంలోని పెద్దలను పురమాయించి రోడ్డు పక్కనున్న ఆమె హోటల్‌ను తొలగించారని వార్తలు వెల్లువెత్తాయి.
కేవలం జగనన్న పేరు తల్చుకున్నంతనే ఆమె మీద టార్గెట్ చేసి హోటల్ తీయించేసారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. జగన్ అన్న పేరు తలచుకున్నవారిని చూసి కూడా ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని కొందరు అంటున్నారు. దేశ విదేశాలకు వెళ్ళిపోయినా వారు కూడా ఏదో విధంగా జగన్ ప్రభుత్వం ద్వారా లబ్దిపొందినవారేనని ఈ ఒక్క సంఘటన వెల్లడిస్తోంది. ఏ రాష్ట్రానికి వలసపోయినా వారికి స్వగ్రామంలో ఏదోవిధంగా ప్రయోజనం జగన్ ప్రభుత్వం కల్పించిందని... అందుకే వారంతా జీవిత పర్యంతం సీఎం జగన్‌ని తలచుకుని గుండెల్లో గుడికట్టుకుంటున్నారని చెప్పడానికి కుమారి ఉదంతమే ఒక ఉదాహరణ అంటున్నారు
-సిమ్మాదిరప్పన్న
ఇదీ చదవండి: Pulivendula Politics : పులి ముందు ఫ్లూటా.?
Comments
Please login to add a commentAdd a comment