పేదలకు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లు
సీఎం వైఎస్ జగన్ గొప్ప నిర్ణయం
కూలీలు జీవితాంతం కూలీలుగానే ఉండాలా.. యజమానులుగా ఎదగొద్దా? బోయీలు.. తరతరాలు పల్లకీపై మోస్తూనే ఉండాలా.. వాళ్లకు పల్లకీ ఎక్కే అవకాశం రాదా ? రానివ్వరా? లారీ డ్రైవర్ ఓనరు కాడా అన్నట్లుగా నిరుపేదలు. అసలు పూట గడవడమే కష్టం అని భావిస్తున్నవాళ్లకు చట్టసభల్లో పోటీ చేసే అవకాశం రావడం అంటే ? వామ్మో ఇది ఊహిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది..
అది నిజంగా జరిగితే? నిజంగా మనకళ్లముందే జరిగితే.. ఆ అద్భుతం చూడగలమా.. చూద్దాం.. ఎన్నికలు అంటేనే లక్షలు కోట్లు పంచాల్సిన పరిస్థితి. అలాంటిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రోజు కూలీలకు రావడమా? అంత గొప్ప మనసు ఉన్న మారాజెవరు.. వాళ్లకు టిక్కెట్లిచ్చి ప్రజల్లోకి పంపే మహా నాయకుడెవరు..? ఇంకెవరు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే. గతంలో ఎంతోమంది సాధారణ కార్యకర్తలకు చట్టసభల్లో స్థానం కల్పించిన సీఎం జగన్ ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగించారు.
2019 ఎన్నికల్లో అరకు ఎంపీగా గెలిచినా గొట్టేటి మాధవి.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వంటి ఎంతోమంది అత్యంత సాధారణమైన కార్యకర్తలు.. ఉండడానికి సరైన ఇల్లే లేని పరిస్థితి.. జీవనానికి ఏదో ఒక ఉద్యోగం చేసుకునే స్థితి.. కానీ వాళ్ళను గుర్తించి తన ప్రతినిధులుగా ప్రజల్లోకి పంపించి వాళ్లకు ఏకంగా ఢిల్లీ సభలో కూర్చోబెట్టారు. ఇదే ఒరవడి మొన్నటి స్థానికసంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించి ఎంతోమంది పేదలు చివరకు వాలంటీర్లను సైతం సర్పంచులు, ఎంపీపీలుగా గెలిపించారు.
ఇక ఇప్పుడు కూడా సింగనమల ఎమ్మెల్యేగా వీరాంజనేయులుకు అవకాశం ఇచ్చారు. అయన జీవనం కోసం టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు.. జగనన్న నిన్ను ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తున్నారు అని చెప్పగానే... హహ.. భలే జోక్ అనుకున్న అయన నిజం అని తెలుసుకుని షాకయ్యారు. నేను పార్టీలో సాధారణ కార్యకర్తను. అలాంటి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించడం అంటే నాలాంటి పేదలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే. శక్తివంచన లేకుండా పని చేసి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం ముందు నిలబడతాను అంటున్నారు అయన.
ఇదే తరహాలో మడకశిర నుంచి ఈర లక్కప్ప అనే ఉపాధిహామీ కూలీని ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన ఇందిరమ్మ ఇల్లు అనే చిన్న నివాసంలో ఉంటున్న లక్కప్ప కూడా తాను ఎమ్మెల్యే అభ్యర్థిని అంటే ముందు నమ్మలేదు.. ఇప్పుడు ఆయనే మెడలో కండువా వేసుకుని జగనన్న ప్రతినిధిని అంటూ ఊరూరా తిరుగుతున్నారు. జగనన్న తెచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయి అని వాళ్ళు నమ్ముతున్నారు. మాలాంటి వాళ్ళం సర్పంచులం కావడమే గగనము. అలాంటిది మమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేస్తున్నారంటే పేదలు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు అంటే జగనన్నకు ఎంత మక్కువ అని వాళ్ళే అబ్బురపడిపోతున్నారు.
డబ్బుంటేనే టిక్కెట్.. లేదంటే వెళ్లండమ్మా
చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు సాధారణ కార్యకర్తలే రాజకీయాలు చేసేవాళ్ళు. కానీ ఆయనొచ్చాక ఓటుకు ఇంత అని రేటుపెట్టి మరీ కొనుగోలు చేయడం మొదలెట్టి.. ఎన్నికలను బాగా ఖరీదు వ్యవహారంలా చేసారు.. నీకు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలా? ఎంత ఉంది? ఎన్ని కోట్లు ఖర్చు చేస్తావ్.. ఎన్నికోట్లు పార్టీకి ఇస్తావు అనే మాట తరచూ చంద్రబాబు నోట వస్తుంది. కోట్లున్నవాళ్లకే తప్ప ప్రజల్లో ఉన్నవాళ్లు ఎవరికీ టీడీపీ టికెట్లు దక్కడంలేదు.. దీంతో టీడీపీ నాయకులంతా కోటీశ్వరులే అని వేరే చెప్పక్కర్లేదు.
ఎంపీ.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. రాజ్యసభ ఇలా ఏ పదవికి అయినా వందలకోట్లు పెట్టాల్సిన పరిస్థితి చంద్రబాబు తీసుకొచ్చారు. దానికితోడు ఎన్నికల్లో ఇన్నికోట్లు ఓటర్లకు పంచాలి. గెలిస్తే అంతకంతా రికవర్ చేస్తావులే..రకరకాలుగా దోచుకునేందుకు నేనే ఆద్యమార్గాలు చూపిస్తాను అని కూడా చంద్రబాబు హింట్ ఇస్తున్నారు.. నాడు హైటెక్ సిటీ భూముల దగ్గర్నుంచి అమరావతీ రాజధాని భూముల దోపిడీ వరకూ చంద్రబాబు పాత్ర ఉంది అంటే ఇదే కారణం.
పార్టీ నాయకులను భూములమీదకు ఉసిగొల్పి వాటిని ఎలా కాజేయాలా అనేది కూడా ఆయనే సలహా ఇస్తుంటారు. ఇక ఇప్పుడు సీఎం వైయస్ జగన్ ఐతే రాజకీయాలకు కొత్త భాష్యం చెబుతూ పేదలు.. సాధారణ కార్యకర్తలు సైతం ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చని నిరూపించడమే కాకుండా తన విలువలను ...కొనసాగిస్తూ ఈసారి కూడా మామూలు కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.
///సిమ్మాదిరప్పన్న///
Comments
Please login to add a commentAdd a comment