సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకమై విపక్షాలన్నీ ఒక పేరు ప్రకటించేందుకు జోరుగా చర్చలు జరుపుతున్నాయి. ఇవాళ(బుధవారం) తొలి దశ భేటీ తర్వాత.. త్వరలో మరోసారి భేటీ కానున్నాయి. ఈ తరుణంలో.. బీజేపీ మాత్రం తన ప్రయత్నాలు మానడం లేదు. ఎన్డీయే అభ్యర్థికి ఏకగ్రీవంగా మద్ధతు ప్రకటించాలంటూ బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్.. ప్రతిపక్షాలకు ఫోన్ చేస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నాం కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేతో ఫోన్‌లో సంప్రదించిన రాజ్‌నాథ్.. సాయంత్రం మమతా బెనర్జీ, అఖిలేష్‌యాదవ్‌తోపాటు మరికొందరితోనూ ఫోన్‌లో మాట్లాడారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించడం మాత్రం కష్టంగా కనిపిస్తోంది. పైగా ఫోన్‌లోనూ ఆయనకు వ్యతిరేక ఫలితం ఎదురైనట్లు జాతీయ మీడియాలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇక.. ఎన్నికల బరిలో ఓ అభ్యర్థిని ప్రకటించాలని ఇప్పటికే విపక్షాలు బలంగా ఉన్నాయి.
శరద్ పవార్ రేసు నుంచి తప్పుకోవడంతో.. ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను పరిశీలనలో ఉంచాయి విపక్షాలు. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తమ అభిప్రాయంపై విపక్షాల భేటీలో స్పష్టత ఇవ్వని కాంగ్రెస్ పార్టీ.. సోనియా కోలుకున్నాక మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యి.. ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ఇక బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా సమావేశమై ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటనకు ముందే రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసి ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment