sankranthi Hit Movies
-
స్టార్ హీరో రెండు సినిమాలూ సంక్రాంతికే విడుదల
సంక్రాంతి లాంటి పండగని స్టార్ హీరోలు వదులుకోవాలని అనుకోరు. ఇద్దరు ముగ్గురు హీరోలైనా సరే తమ సినిమాల్ని రెడీ చేస్తారు. తెలుగులో అయితే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్', వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలతో రాబోతున్నారు. తమిళంలో ఈసారి కొత్త మూవీస్ ఏమున్నాయా అని చూస్తే ఒకే స్టార్ హీరో రెండు సినిమాల్ని రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పి అభిమానుల్ని తికమక పెడుతున్నారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని సంక్రాంతికే రిలీజ్ చేస్తామని ఈ మధ్య నిర్మాతలు ప్రకటించారు. ఇదిలా ఉండగానే.. అజిత్ మరో మూవీ 'విడాముయార్చి' కూడా సంక్రాంతికే వస్తున్నట్లు చెప్పి షాకిచ్చారు.గురువారం రాత్రి 'విడాముయార్చి' టీజర్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్లా అనిపించింది. అనిరుధ్ మ్యూజిక్ కూడా వెరైటీగా బాగానే ఉంది. కానీ పొంగల్ రిలీజ్ అని చివర్లో చెప్పడం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అజిత్ నుంచే రెండు సినిమాలు, అది కూడా సంక్రాంతికి రిలీజ్ అని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా? లేదా పంతానికి పోయి ఇద్దరూ తమ మూవీస్ తీసుకొస్తారా అనేది చూడాలి? ఒకవేళ ఏది రిలీజైనా సరే 'గేమ్ ఛేంజర్' తమిళ వెర్షన్‌కి థియేటర్ల సమస్య మాత్రం గ్యారంటీ.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్) -
సంక్రాంతి సెంటిమెంట్.. మహేశ్‌కు కలిసొచ్చిందా?
పండగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. సెలబ్రిటీలకైతే మరీనూ.. ముఖ్యంగా సంక్రాంతి పండగకు తమ సినిమా రిలీజ్ చేయాలని తహతహలాడిపోతుంటారు. హీరోలు, దర్శకనిర్మాతలు సినిమా మొదలుపెట్టకముందే సంక్రాంతికి విడుదల చేస్తామంటూ ముందే కర్ఛీఫ్ వేసుకుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. చాలామంది పండగపూట ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకుంటారు. పైగా సెలవులు కూడా కలిసొస్తాయి. దీంతో పండగ సమయంలో రిలీజ్ చేస్తే కథలో కొన్నిలోటుపాట్లు ఉన్నా మినిమమ్ వసూళ్లు అయినా వస్తాయి. మిగతా సినిమాలతో పోటీ లేకుంటే విజయం తథ్యం. కథ అద్భుతంగా ఉంటే మాత్రం ఆ సినిమాకు తిరుగులేదంతే! సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు కూడా సంక్రాంతి అంటే సెంటిమెంట్. అలా ఇప్పటివరకు మహేశ్ బాబు నుంచి ఎన్ని సినిమాలు ఈ పండక్కి రిలీజయ్యాయో చూద్దాం.. టక్కరి దొంగ మహేశ్‌బాబు హీరోగా నటించిన ఈ మూవీ 2002లో జనవరి 12న విడుదలైంది. డైరెక్టర్ జయంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లిసా రాయ్, బిపాసా బసు హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం ఐదు నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఒక్కడు గుణశేఖర్ డైరెక్షన్లో మహేశ్ నటించిన చిత్రం ఒక్కడు. 2003లో సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో భూమిక హీరోయిన్గా నటించింది. బిజినెస్మెన్ పోకిరి తర్వాత మహేశ్‌బాబు- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం బిజినెస్మెన్. 2012లో సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. మహేశ్ పంచ్ డైలాగ్స్‌కు బాక్సాఫీస్ షేకైపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మహేశ్‌బాబు, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013 జనవరి 11న రిలీజైంది. ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేసిన ఈ మూవీ నాలుగు నంది అవార్డులు సైతం అందుకుంది. 1 నేనొక్కడినే మహేశ్‌బాబు చేసిన ప్రయోగాత్మక చిత్రం 1 నేనొక్కడినే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2014లో విడుదలైంది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని జనాలు ఆదరించలేదు. సరిలేరు నీకెవ్వరు అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేశ్‌బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. 2022లో సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో మహేశ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడినట్లైంది. గుంటూరు కారం ఈ ఏడాది కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు మహేశ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ నటించిన మాస్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల్లోనే ఈ మూవీ వంద కోట్ల మైలురాయిని దాటేసింది. కానీ గుంటూరు కారం మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. మరి లాంగ్‌రన్‌లో ఈ సినిమా హిట్‌గా నిలుస్తుందో? లేదో చూడాలి! చదవండి: ఆఫీసుల చుట్టూ తిరిగా.. అవమానించారు.. భరించలేక వెళ్లిపోదామనుకున్నా! -
ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు ?
-
రీసెంట్ గా సలార్ తో హిట్ కొట్టిన రెబల్ స్టార్
-
జనవరి 26కు ఈగిల్ పోస్ట్ పోన్..?
-
నిజాలు తెలుసుకుని రాయండి: దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలు పెద్దఎత్తున పోటీకి సిద్ధమయ్యాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు సమావేశమై సినిమాల రిలీజ్‌పై తలెత్తిన సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా లో వస్తున్న ఆర్టికల్స్‌తో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ఎవరైనా సరే నిజాలు తెలుసుకొని రాయండని దిల్ రాజు కోరారు. ముఖ్యంగా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నందుకు రవితేజకు కృతజ్ఞతలు తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ..'సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది. దయచేసి నిజాలు తెలుసుకొని రాయండి. సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలతో చర్చించాం. ఒక సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగినట్టు కాదు. గతేడాది మూడు సినిమాలకే రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు 5 సినిమాలు పోటీలో ఉన్నాయి. మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా రవితేజ, పీపుల్స్ మీడియా వారికి మా కృతజ్ఞతలు. ఇదొక మంచి పరిణామం' అని అన్నారు. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..' సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. 15 రోజుల క్రితం నిర్మాతలతో మీటింగ్ పెట్టి గ్రౌండ్ రియాలిటీ చెప్పాం. నిర్మాతలు సహకరిస్తున్నారు. రవితేజ ఈగల్ సినిమా నిర్మాతలకు థాంక్స్' అని అన్నారు. కాగా.. సంక్రాంతి రేసులో మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, ప్రశాంత వర్మ హనుమాన్, నాగార్జున మూవీ నాసామిరంగ రిలీజ్ కానున్నాయి. రవితేజ పోటీ నుంచి తప్పుకోవడంతో నాలుగు చిత్రాలు బరిలో నిలిచాయి. -
సంక్రాంతి బరిలో ప్యాన్ ఇండియా మూవీస్
-
సంక్రాంతి రేసు నుంచి రెండు టాప్ సినిమాలు ఔట్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతేడాది 'సార్' చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇప్పుడు అదే జోష్‌ను 2024 కొత్త ఏడాదిలో కొనసాగించాలని ఆయన 'కెప్టెన్ మిల్లర్'గా సంక్రాంతి బరిలో దిగేందుకు ప్లాన్ వేసుకున్నాడు. ఇదే క్రమంలో ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కూడా ఇప్పటికే ప్రకటించింది. సంక్రాంతి బరిలోనే మరో తమిళ హీరో శివకార్తికేయన్ 'అయలాన్' చిత్రం కూడా ఉంది. (ఇదీ చదవండి: భారత్ సినిమాలపై పాక్ ప్రముఖ హీరో రియాక్షన్) ధనుష్, శివకార్తికేయన్ ఇద్దరు కూడా తెలుగులో గుర్తింపు ఉన్న హీరోలే.. దీంతో వీరి సినిమాలకు టాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ ఉంది. కానీ ఈ సంక్రాంతికి టాలీవుడ్లో తెలుగు స్ట్రైట్ చిత్రాలు గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టంగానే మారింది. అలాంటిది డబ్బింగ్ చిత్రాలు అయిన కెప్టెన్ మిల్లర్, అయలాన్ చిత్రాలకు థియేటర్లు దొరకడం కష్టంగానే ఉంది. దీంతో ఆ రెండు చిత్రాల మేకర్స్ సినిమా విడదల విషయంలో యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్, అయలాన్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికే రిలీజ్ చేసి.. తెలుగు వెర్షన్‌ను మాత్రం వాయిదా వేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జనవరి నెలలోనే సంక్రాంతి తర్వాత ఈ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ మూవీల మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలకే థియేటర్లు దొరకడం కష్టంగా ఉందని ఆయన ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలకు ఎలా థియేటర్లు ఇవ్వగలుగుతామని ఆయన అన్నారు. దీనిని బట్టి చూస్తే కెప్టెన్ మిల్లర్, అయాలాన్కు సంక్రాంతికి రావాడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు. -
దేవరకు పోటీగా బరిలోకి దిగుతున్న బాలకృష్ణ.. అప్పటి రిజల్ట్ రిపీట్ కానుందా?
నందమూరి బాలకృష్ణ vs జూనియర్ ఎన్టీఆర్ అనేలా వారిద్దరి మధ్య గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే.. ఈ విషయంలో చాలా రోజుల నుంచి వారి ఫ్యాన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి కూడా.. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్ విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే.. దీంతో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు బహిర్గతం అయింది. దీంతో బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి కలెక్షన్స్‌పై పడింది. తారక్ ఫ్యాన్స్ ఆ సినిమాను చూడొద్దంటూ ఇంటర్నెట్లో వైరల్ చేశారు. ఇలా బాబాయ్, అబ్బాయి మధ్య వైరం మొదలైందని చెప్పవచ్చు. 2024 వేసవి సెలవుల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలు బరిలోకి దిగనున్నట్లు సమాచారం ఉంది. ఇప్పటికే దేవర చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదుల చేస్తున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ ప్రకటించాడు. మరోవైపు బాలకృష్ణ ఎన్బికె 109 చిత్రాన్ని డైరెక్టర్ బాబీ ప్రకటించాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఇండస్ట్రీలో వస్తున్న వార్తల ప్రకారం అయితే 2024 మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. సరిగ్గా దేవర చిత్రానికి కంటే ఒక వారం ముందుగానే విడుదల కానుంది. దీంతో వీరిద్దరి మధ్య మరోసారి వార్ నడవడం ఖాయం అని తెలుస్తోంది. ఇదే నిజం అయితే తారక్ మరోసారి పైచేయి సాధించడం గ్యారెంటీ అంటూ ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్లో తారక్ వెంట నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ఇతర హీరోలు ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఆయన అందరితో సన్నిహితంగా మెలగడమే దీనికి ప్రధాన కారణం అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా తారక్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక రకంగా నందమూరి హీరోలు అంటే ప్రథమంగా వినిపించే పేరు తారక్ అని చెప్పవచ్చు. గతంలో తారక్‌దే పైచేయి సంక్రాంతి బరిలో వారిద్దరూ పోటీపడ్డారు.. 2016లో నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్, డిక్టేటర్ సినిమాతో బాలయ్య వచ్చారు. జనవరి 13న తారక్ వస్తే.. జనవరి 14న డిక్టేటర్తో బాలయ్య పోటీలోకి దిగాడు. అలా తొలిసారిగా.. ఒకరితో ఒకరు ఢీకొట్టారు. ఆ సమయంలో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ నడిచింది. అప్పుడు ఏపీలో నాన్నకు ప్రేమతో సినిమాకు ఎక్కువ థియేటర్లు లేకుండా చూసే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ తారక్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అదే సమయంలో డిక్టేటర్ మిస్ ఫైర్ అయింది. అప్పటికే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తారక్‌కు మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఎక్కడ చూసిన నాన్నకు ప్రేమతో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ డిక్టేటర్ భారీ డిజాస్టర్‌ను మూట కట్టుకుంది. దీంతో అక్కడ బాబాయ్ మీద అబ్బాయిదే పైచేయి అయింది. మళ్లీ ఇదే సీన్ 2024లో రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. అప్పుడు టాలీవుడ్‌కే పరిమితమైన తారక్... ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. నందమూరి ఫ్యాన్స్ మద్ధతు కూడా ఎక్కువగా జూ.ఎన్టీఆర్కే ఉంది. దేవర బొమ్మ థియేటర్లోకి వచ్చేంత వరకే బాలయ్య NBK 109 హడావిడి ఉంటుంది. ఏప్రిల్ 5 నుంచి ఎన్ని సినిమాలు ఉన్నా దేవరకు ఎవరు ఎదురు వచ్చినా కొట్టుకుపోవాల్సిందే.. అది నందమూరి బాలకృష్ణ అయినా సరే డౌటే లేదని చెప్పవచ్చు. -
రంగుల రాట్నం