
అవినాష్ కు 14 రోజుల రిమాండ్
కాకినాడ: ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నపేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్రకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం అవినాష్ ను పోలీసులు కోర్టుకు ముందు హాజరు పరిచారు.
గురువారం డీజీపీ జేవీ రాముడు ముందు అవినాష్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం అతణ్ని నార్త్ కోస్టల్ ఐజీ అతుల్ సింగ్ ప్రత్యేక ఎస్కార్ట్‌తో తూర్పు గోదావరి జిల్లాకు పంపించారు. చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడినట్లు అవినాష్ పై పలు ఆరోపణలు వెలుగుచూశాయి.