బిగ్‌బాస్ 12వ వారం విచిత్రమైన పద్ధతిలో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలిమినేట్ అయినవాళ్లు హౌసులోకి వచ్చి ఈ వారం ఎవరెవరు నామినేట్ అవ్వాలనేది డిసైడ్ చేశారు. సోమవారం కొంతవరకు జరగ్గా.. మంగళవారం కూడా ఇదే కొనసాగింది. మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత వచ్చారు. తన పాయింట్లు చెప్పి రఫ్ఫాడించేశారు. ఇంతకీ బిగ్‌బాస్‌లో మంగళవారం(79వ రోజు) ఎపిసోడ్లో ఏమేం జరిగిందనేది చూద్దాం.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టిన శోభా శెట్టి)
తొలుత హౌసులోకి వచ్చిన నైనిక.. నిఖిల్‌ని పలకరించి హగ్గు ఇచ్చింది. ఎక్కువగా ఆలోచించి బాధపడకు అని చెప్పింది. ఇక తన మొదటి నామినేషన్ నబీల్ పేరు చెప్పింది. 'నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పావ్ నబీల్.. షేర్ (సింహం) అన్నావ్ కదా! మరి అది ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయింది. గత కొన్నివారాలుగా నువ్వు కనిపించట్లేదు' అని అడిగింది. దీనికి సమాధానంగా.. నేను వచ్చిందే ఆ కప్పు కోసం.. ఖచ్చితంగా దాని కోసమే ఆడతా.. నేను ఎవరి గురించి వెనకాల మాట్లాడలే అని నబీల్ తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు.
నైనిక తన రెండో నామినేషన్ యష్మీకి వేసింది. ఒకప్పుడు యష్మీ ఇప్పుడు కనిపించట్లేదని, ఎప్పుడైతే నిఖిల్ వెంటపడటం మొదలుపెట్టావో అప్పటినుంచి యష్మీ మిస్ అయిపోయిందని చెప్పింది. దీనికి ఆన్సర్ ఇచ్చిన యష్మీ.. నేనెందుకు ఇలా అయిపోయానో నాకు అర్థం కావడం లేదు.. నేను బాగానే ఆడుతున్నా అంటూ యష్మీ ఏడ్చింది. ముందు యష్మీని తీసుకొస్తా.. కప్పు కొట్టడానికి ట్రై చేస్తానని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: క్షమించమంటూ నిఖిల్ ఏడుపు.. అది చూసి మోసపోవద్దన్న కావ్య!)
తర్వాత వచ్చిన మణికంఠ.. నిఖిల్‌ని నామినేట్ చేశాడు. నేను వెళ్లేటప్పుడే నీ గ్రాఫ్ పడిపోతుందని నీకు చెప్పా. కానీ నీకెలా తెలుసు అని నువ్వు అడిగావ్.. ఇప్పుడు నేనే చూసి వచ్చా అందుకే చెబుతున్నా.. నీ గ్రాఫ్ పడిపోయింది, నువ్వు ఇక్కడికి కనెక్షన్స్ పెట్టుకోవడానికి వచ్చావా? కప్పు కోసం వచ్చావా అనే క్లారిటీ నీకు లేకపోతే టైటిల్ గెలవడం చాలా కష్టం నిఖిల్ అని అన్నాడు. దీనికి నిఖిల్ వైపు నుంచి పెద్దగా సమాధానం ఏం రాలేదు. సైలెంట్‌గా ఉండిపోయాడు.
రెండో నామినేషన్ నబీల్‌కి వేసిన మణికంఠ పెద్ద మోటివేషన్ ఇచ్చాడు. నాలుగు వారాలుగా నువ్వు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటున్నావ్. త్యాగాలు చేస్తున్నావ్. సైలెంట్ అయిపోయావ్. ఇవన్నీ ఎందుకు. నిన్ను ఇష్టపడే వాళ్లు నీ గేమ్ చూడాలనుంకుంటారు.. నీ త్యాగాలు కాదు అని అన్నాడు. దీంతో ఇకపై నా ఆట చూపిస్తా అని నబీల్ సవాల్ చేశాడు.
(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య)
అనంతరం హౌసులోకి వచ్చిన సీత.. విష్ణుప్రియని సూపర్ ఆడుతున్నావ్ అని మెచ్చుకుంది. ప్రేరణని నామినేట్ చేసింది. నువ్వు చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్. డిక్టేటర్లా బిహేవ్ చేశావ్. ఇదే విషయం నీ భర్త కూడా చెప్పారు. ఆయన చెప్పి వెళ్లిన కాసేపటికే కిచెన్ దగ్గర తేజతో దోస గురించి గొడవపడ్డావ్. నువ్వు చిరాకుగా మాట్లాడే మాటలు గుచ్చుకుంటున్నాయ్ అని చెప్పుకొచ్చింది. నేను వాటిని మార్చుకుంటానని ప్రేరణ చెప్పింది. సీత తన నెక్స్ట్ నామినేషన్ యష్మీకి వేసింది. నువ్వు నిఖిల్ వెంట పడటం మొదలుపెట్టిన తర్వాతి నుంచి నీ గేమ్ పోయింది. నిఖిల్ ఉంటేనే నువ్వు కనపడుతున్నావ్ అని గట్టిగానే క్లాస్ పీకింది.
తర్వాత వచ్చిన ఆదిత్య ఓం.. కర్మ ఈజ్ బ్యాక్ అనే డైలాగ్‌తో హౌసులోకి వెళ్లాడు. యష్మిని మొదటగా నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. మీరు ముందే ఫిక్సయి లోపలికి వచ్చినట్లున్నారు. ఎందుకంటే ప్రేరణ, నిఖిల్, పృథ్వీలను మీరు ఇప్పటివరకూ నామినేట్ చేయలేదు. వేరే వాళ్లని టార్గెట్ చేస్తున్నారు. వాళ్లు పెద్ద తప్పులు చేసినాసరే మీరు వదిలేస్తున్నారు. పక్షపాతంగా ఉంటున్నారు. ఫేవరిటిజం చూపిస్తున్నారు. న్యూట్రల్‌గా ఉన్నట్లు నటిస్తున్నారు. ఇది 12వ వారం అండి.. ఇంకెన్ని వారాలు చేస్తారని తన అసహనాన్ని వ్యక్తపరిచాడు.
(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)
ఆదిత్య మాటలపై స్పందించిన యష్మీ.. గ్రూప్ గేమ్ ఆడితే నా గేమ్ స్పాయిల్ అవుతుందని నాకు క్లారిటీ ఉందని చెప్పింది. గ్రూపిజం గురించి ఆదిత్యతో యష్మి కాస్త వాదన పెట్టుకుంది. కానీ చివరకు తను కొన్ని గేమ్స్‌లో ఫేవరెటిజం చూపించానని ఒప్పుకొంది. తర్వాత ప్రేరణని ఆదిత్య నామినేట్ చేశాడు. ఈమె కూడా గ్రూప్ గేమ్ ఆడుతోందనే కారణమే చెప్పాడు. దీంతో యష్మీని మీరు 12 వారాల్లో ఒక్కసారి కూడా ఎందుకు నామినేట్ చేయలేదు? అని ఆదిత్య అడిగాడు. అంతకంటే ఎక్కువ తప్పులు వేరే చోట కనిపించాయ్ అని ప్రేరణ అనేసరికి.. అవును మీకు నబీల్లో, నాలో, విష్ణుప్రియలో కనిపించాయ్, ప్రతిసారి మీకు మేమే కనిపిస్తామా? బయట జనాలు ఎలా నమ్ముతారు అని అడిగేసరికి ప్రేరణ సైలెంట్ అయిపోయింది.
అలా ఈసారి నామినేషన్స్ కాస్త వెరైటీగా జరిగింది. కాకపోతే కన్నడ బ్యాచ్ ఫుల్ టార్గెట్ అయింది. ఇన్నాళ్లు గ్రూప్ గేమ్ ఆడుతూ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు కానీ ఈసారి మాత్రం వీళ్లు నలుగురిపై కత్తి వేలాడుతోంది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యేసరికి లిస్ట్‌లో యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, నబీల్ చేరారు.
(ఇదీ చదవండి: నటి కస్తూరిపై మరిన్ని కేసులు)
Comments
Please login to add a commentAdd a comment