కిందపడ్డ సోనియా.. గెలిచి చూపించిన విష్ణుప్రియ | Bigg Boss 8 Telugu Today Promo Videos: Opportunity To Unlock The Prize Money Challenge For Contestants, Watch Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu Today Promo: ఆట మొదలుపెట్టిన నిఖిల్‌.. ఓడిన సోనియా.. గయ్యిమన్న యష్మి

Published Thu, Sep 12 2024 4:06 PM | Last Updated on Thu, Sep 12 2024 4:38 PM

Bigg Boss Telugu 8 Promo: Opportunity to Unlock the Prize Money

బిగ్‌బాస్‌ హౌస్‌లో కిరాణా సామాను పంపిణీ ముగిసింది. యష్మి, నైనిక టీమ్‌ సభ్యులు  రేషన్‌ గెలుచుకుని, దాన్ని హాయిగా వండుకుని కడుపు నింపుకున్నారు. కానీ నిఖిల్‌ టీమ్‌ మాత్రం రాగిముద్ద, ఉడకబెట్టిన కూరగాయలతో సరిపెట్టుకుంది. రేషన్‌ గొడవ అయిపోవడంతో బిగ్‌బాస్‌(#BiggBossTelugu8) ప్రైజ్‌మనీపై దృష్టి సారించాడు. ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉన్న ప్రైజ్‌మనీని హౌస్‌మేట్స్‌ వీలైనంతవరకు లాక్కుంటూ పోవచ్చన్నమాట!

కిందపడ్డ సోనియా
ఈ ప్రైజ్‌మనీ టాస్కుల్లో భాగంగా మొదట విష్ణుప్రియ, సోనియా, మణికంఠలను స్విమ్మింగ్‌ పూల్‌లో దూకాలన్నాడు. ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లే క్రమంలో సోనియా కిందపడిపోయింది. విష్ణు అందరికంటే ముందు దూకి రూ.25 వేలు గెలిచింది. తర్వాతి టాస్కులో నిఖిల్‌, నబీల్‌, పృథ్వీ కలర్‌ బాల్‌ గేమ్‌ ఆడారు. ఇందులో నబీల్‌ ఆదిలోనే అవుట్‌ అయిపోగా నిఖిల్‌, పృథ్వీ హోరాహోరీగా పోరాడారు. 

అబ్బాయిల కష్టాలు
అంతిమంగా నిఖిలే గెలిచి రూ.50 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. అనంతరం నిఖిల్‌, పృథ్వీ, నబీల్‌ను వ్యాక్స్‌ చేసుకోమన్నాడు బిగ్‌బాస్‌. ఈ వ్యాక్స్‌ చేసుకునేందుకు ముగ్గురూ నానాతంటాలు పడ్డారు. ఇకపోతే ఏదో పాల ప్యాకెట్‌ డస్ట్‌ బిన్‌లో కాకుండా కింద పడేసినందుకు విష్ణుప్రియకు యష్మి క్లాస్‌ పీకింది. మీరు మా చికెన్‌ దొంగిలించారుగా అని తనేదో చెప్పబోతుంటే యష్మి ఒంటికాలిపై లేచింది. 

సాక్ష్యం ఉందా? 
మేము తీసుకున్నట్లు మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? అని నిలదీసింది. ఎందుకు అరుస్తున్నావని అడిగితే నేనిలాగే మాట్లాడతానంటూ తన కోపాన్ని ప్రదర్శించింది. బహుశా ఇప్పటివరకు ప్రైజ్‌మనీ కోసం పెట్టిన గేమ్స్‌లో తన టీమ్‌ ఒక్కటి కూడా గెలవలేదన్న బాధను యష్మి ఇలా చూపిస్తుందేమో!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement