
నిఖిల్ మళయక్కల్.. గోరింటాకు సీరియల్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. ఇదే ధారావాహికలో అతడికి జోడీగా నటించింది కావ్య శ్రీ. సీరియల్ ఎంత పాపులర్ అయిందో కానీ, వీరి జోడీ అంతకంటే ఎక్కువ క్లిక్ అయింది. ఇంకేముంది.. ప్రతి ఫంక్షన్‌లోనూ, షోలోనూ, ఈవెంట్‌లోనూ జంటగా మెరిసేవారు. కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు.

ఇద్దరి మధ్య దూరం
వీళ్ల యవ్వారం చూసిన జనాలు ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని భావించారు. ఇదే ప్రశ్న ఓసారి నిఖిల్‌కు ఎదురైతే.. కావ్య మంచి అమ్మాయి.. పెళ్లి అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని తమ ప్రేమ నిజమేనని హింటిచ్చాడు. తర్వాత ఏమైందే ఏమో తెలియదుగానీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. యూట్యూబ్ వీడియోలు చేయడం ఆపేశారు.

కొట్టినా, తిట్టినా పడతా..
ఇక నిన్నటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో నిఖిల్ తన లవ్‌స్టోరీ చెప్తూ ఎమోషనలయ్యాడు. ఆరేళ్ల ప్రేమ.. విడిపోయామని నేను అనుకోవడం లేదు. బిగ్‌బాస్ అయిపోగానే నీ ముందు ప్రత్యక్షమవుతాను. నువ్వు కొట్టినా, తిట్టినా పడతాను కానీ నన్ను క్షమించు. నువ్వే నా భార్యవి.. పిచ్చిలేస్తే నిన్ను లేపుకెళ్లిపోతా.. అని ఏడుస్తూ చెప్పాడు. అయితే అతడి కన్నీళ్లకు కావ్య కరిగినట్లు లేదు. ఇలాంటివి చూసి మోసపోవద్దంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది.

మోసపోవద్దు
మాస్కు వేసుకుని నటించేవాళ్లను చూసి మోసపోవద్దు. ఫేక్ మనుషులు పరిస్థితులకు తగ్గట్లుగా తమ అసలు రంగును బయటపెడుతుంటారు. ఆ మాస్కులు పూర్తిగా ఊడిపోయేవరకు ఎదురుచూడండి అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ కొటేషన్‌ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు నిఖిల్- కావ్య మళ్లీ కలుస్తారా? లేదా? అని చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment