సాక్షి, చైన్నె: విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రికళగంపై ఇంటెలిజెన్స్ గురి పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ పార్టీ వర్గాల పనితీరు, సభ్యత్వం తదితర అంశాలపై నిఘా వేసినట్టు చర్చ జరుగుతోంది. ఇటీవల విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ పరంగా కార్యక్రమాలు జిల్లాలో విస్తృతమాయ్యయి. ఈ సమావేశాలకు పెద్ద సంఖ్యలో కేడర్, అభిమానులు తరలి వస్తున్నారు. సభ్యత్వ నమోదు కోటికి దరిదాపులలో ఉంది. సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాలు, విజయ్‌కు వస్తున్న ఆదరణ, మద్దతు వంటి అంశాలపై ఇంటెలిజెన్స్ నిఘా వేసి, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందించే పనిలో పడ్డట్టుగా చర్చ ఊపందుకుంది. విజయ్ సిద్ధాంతాలు, ప్రసంగాలు ఏ మేరకు ప్రజలకు చేరువయ్యాయో అన్న అంశాల మీద సైతం ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టుగా సమాచారం వెలువడడంతో విజయ్ పార్టీ వర్గాలు ఈమేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
కస్తూరిపై మరిన్ని కేసులు
సాక్షి, చైన్నె : తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరిపై మరికొన్ని పోలీసు స్టేషన్లలో కేసుల నమోదుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన కస్తూరి పుళల్ జైలలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు ఖైదీ నెంబర్ 644798 కేటాయించినట్టు సమాచారం వెలువడింది. ఇప్పటికే ఆమైపె చైన్నెలో నాలుగు, మదురైలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆమైపె కోయంబత్తూరు, కుంభకోణం, కోయంబేడు పోలీసు స్టేషన్లలో సైతం ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై పోలీసులు పరిశీలన జరుపుతున్నారు. ఆమైపె మరికొన్ని కేసులు నమోదు చేసి, ఆ కేసులలో అరెస్టు చేసే విధంగా పోలీసులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
ఏకనాపురంలో విషాదం
● ఉద్యమ కమిటీ సభ్యురాలు దివ్య ఆత్మహత్య
● విమానాశ్రయానికి వ్యతిరేకంగా నిర్ణయం
సాక్షి, చైన్నె: పరందూరు విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చిన ఏకనాపురం పంచాయతీ ఉపాధ్యక్షురాలు దివ్య (32) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సమాచారంతో ఆ గ్రామం విషాదంలో మునిగింది. విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా, ఫలితం లేక పోవడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా గ్రామస్తులు పేర్కొంటున్నారు. వివరాలు.. చైన్నె విమానాశ్రయానికి ప్రత్యామ్మాయంగా కాంచీపురం సమీపంలోని పరందూరులో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రాయనికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 13 గ్రామాల ప్రజలు ఏకనాపురం వేదికగా రెండేళ్లుగా పోరాటంచేస్తూ వస్తున్నారు. ఓ వైపు పోరాటం జరుగుతుంటే, మరోవైపు స్థల సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతూ వస్తోంది. ఈ పోరాటాలకు ఏకనాపురం పంచాయతీ ఉపాధ్యక్షురాలు దివ్యతోపాటు ఆమె భర్త పీఎంకే యువజన నేత గణపతి సైతం నేతృత్వం వహిస్తున్న వారిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దివ్య ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా, తమకు న్యాయం అన్నది దొరకడం లేదన్న ఆవేదనను పదే పదే ఆమె వ్యక్తం చేస్తూ వచ్చినట్టు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇదే మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆమె మరణ సమాచారంతో గ్రామం శోక సంద్రంలో మునిగింది. పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
అంత్యక్రియల సమయంలో బతికిన అవ్వ
● తిరుచ్చిలో కలకలం
సేలం : అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో అవ్వ బతికిన ఘటన తిరుచ్చిలో కలకలం రేపింది. వివవారు.. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన వ్యక్తి పంపైయ్యన్ (72). ఇతని భార్య చిన్నమ్మాల్ (62). వీరు పూలతోట నిర్వహిస్తున్నాడు. ఈనెల 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది. చుట్టుపక్కల వారు చిన్నమ్మాల్‌ను తురవంకురిచ్చిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో చేసేదిలేక చిన్నమ్మాల్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువెళ్లారు. మార్గం మధ్యలో చిన్నమ్మాల్ మృతి చెందినట్టు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. బంధువులు విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. శ్మశానవాటికలో ఆమెకు అంతిమ సంస్కరాలు నిర్వహించారు. తర్వాత చిన్నమ్మాల్ శరీరాన్ని దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆమెను కట్టెలు పేర్చిన చితిపై పడుకోబెట్టారు. ఆ సమయంలో చిన్నమ్మాల్‌పై బంధువులు పడి బోరున విలపించారు. అప్పుడు అకస్మాత్తుగా చిన్నమ్మాల్ తనపై పడి ఏడుస్తున్న బంధువులు ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. తర్వాత అంబులెన్స్‌ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్‌ను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యం చేస్తున్నారు. ఈ సంఘటన అక్కడ కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment