
కంటెస్టెంట్ల ఒక్కో పేరెంట్ హౌస్‌లో అడుగుపెట్టేకొద్దీ మిగతావారంతా తమవారి కోసం కళ్లు పెద్దవి చేసుకుని మరీ గేటు వైపు ఆశగా చూస్తున్నారు. ఈ రోజు విష్ణుప్రియ తండ్రి హౌస్‌లోకి అడుగుపెట్టగా పృథ్వీ తల్లి, గౌతమ్ సోదరుడు ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో విడుదల చేశారు.

పృథ్వీ తల్లి సత్యభామ అలా ఇంట్లో అడుగుపెట్టగానే తన తల్లి గుర్తొచ్చి తేజ విలవిలా ఏడ్చాడు. అందరి పేరెంట్స్ వస్తున్నారు, మా అమ్మను కూడా పంపించండంటూ బిగ్‌బాస్‌ను కన్నీటితో వేడుకున్నాడు. ఇకపోతే పృథ్వీ తల్లి అందరిలోకెల్లా తనకు విష్ణు అంటే ఇష్టమంది.

ఆమెకు ప్రేమగా గోరుముద్దలు సైతం తినిపించింది. విష్ణుప్రియ ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంది. అటు గౌతమ్ సోదరుడు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలాంటివి వద్దు, అందరికీ ఇంటిసభ్యుల నుంచి ఇన్‌పుట్స్ వెళ్లాయి కాబట్టి నీ గేమ్ నువ్వు ఆడమని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment