
బిగ్‌బాస్ హౌస్‌లోకి మెకానిక్ రాకీ వచ్చేశాడు. ఏకంగా ఆటో వేసుకుని మరీ మెయిన్ గేట్ నుంచి లోనికి దూసుకొచ్చాడు. విశ్వక్ సేన్ ఇలా ఆటోలో హౌస్‌లోకి రావడం చూసి కంటెస్టెంట్లు సర్‌ప్రైజ్ అయ్యారు. తాను కూడా కంటెస్టెంట్‌గా వచ్చానంటూ హీరో అందర్నీ సరదాగా ఆటపట్టించాడు.

మెకానిక్ రాకీ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన ఆయన అందరితో కలిసి ఫన్నీ స్కిట్ చేశాడు. చివరగా హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు కూడా వేశాడు. మరో ప్రోమోలో.. నిఖిల్, రోహిణిలలో ఒకర్ని కంటెండర్‌గా ఎన్నుకోమని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌పై భారం వేశాడు.

ఈ సందర్భంగా గౌతమ్.. చాలామంది హౌస్‌మేట్స్ కలిసి వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్ చేశారు అంటూ వైల్డ్ కార్డ్ రోహిణికి సపోర్ట్ చేశాడు. ఈ క్రమంలో పృథ్వీ, గౌతమ్ గొడవపడ్డారు. పృథ్వీ వాడు వీడంటూ నోరు జారడంతో గౌతమ్... మంచిగా మాట్లాడమని హెచ్చరించాడు. అయినా కూడా పృథ్వీ.. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సైగ చేస్తూ అతడి పైపైకి వెళ్లాడు.
Comments
Please login to add a commentAdd a comment