
ఇద్దరు మగవాళ్ల ఇష్యూ గురించి మాట్లాడాలని నాగార్జున అనగానే నేను చెప్తా, సర్ అంటూ అవినాష్ లేచాడు. వాడు, వీడు అని మొదలుపెట్టింది పృథ్వీ.. తర్వాత గౌతమ్ ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. అప్పుడు పృథ్వీ.. ఛాతీపై వెంట్రుక పీకి పారేశాడు అని జరిగింది చెప్పాడు. ఇక గౌతమ్ గొడవ ఎక్కడ మొదలైందో చెప్పడం ప్రారంభించాడు.
అందులో తప్పేముంది?
వైల్డ్ కార్డ్స్‌ను నామినేట్ చేయాలని గ్రూప్ గేమ్ ఆడారని చెప్తుండగా.. అందులో తప్పేముందని నాగ్ ప్రశ్నించాడు. అందుకు గౌతమ్.. నా ఉద్దేశంలో తప్పేనని కరాఖండిగా తేల్చి చెప్పాడు. నువ్వు రోహిణికి సపోర్ట్ చేయడం గ్రూపిజమా? కాదా? అని నాగ్ ప్రశ్నించాడు. ప్రతిసారి ఒకరికే సపోర్ట్ చేయడం గ్రూపిజమా? ఎప్పుడో ఒకసారి సపోర్ట్ చేయడం గ్రూపిజమా? అని హోస్ట్‌నే తిరిగి ప్రశ్నించాడు గౌతమ్.
షటప్ గౌతమ్
గ్రూపిజం తప్పని నీ ఉద్దేశ్యమా? అంటూ నాగార్జున మాట్లాడుతూ ఉండగా గౌతమ్ మధ్యలో కలగజేసుకుంటూ ఉన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాగ్.. నేను మాట్లాడుతున్నప్పుడు షటప్.. నువ్వు మధ్యలో కలుగజేసుకోవడానికి నేనేమీ హౌస్‌మేట్ కాదు అని హెచ్చరించాడు.
Comments
Please login to add a commentAdd a comment