గౌతమ్ కృష్ణ.. తిట్టిన నోళ్లతోనే శెభాష్ అనిపించుకున్నాడు. ఇది అందరికీ సాధ్యమవదు. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన గౌతమ్ తొలినాళ్లలో గేమ్‌తో హడలెత్తించాడు. కానీ రానురానూ డల్ అయ్యాడు. గెలుపును అందుకోవడంలో తడబడ్డాడు. ఇంకేముంది, సరిగ్గా టాస్కులు ఆడట్లేదు, గెలవట్లేదంటూ విమర్శలు మొదలయ్యాయి.
ఫ్లాగ్ టాస్క్‌లో విజృంభించిన గౌతమ్
అయితే ఈ రోజు గౌతమ్.. తనను విమర్శిస్తున్నవారి నోళ్లు మూయించనున్నాడు. పవర్ ఫ్లాగ్ అనే గేమ్‌లో విజృంభించి ఆడాడు. వరుసగా మూడుసార్లు తనే జెండా అందుకుని ప్రేరణ, నబీల్, నిఖిల్‌ను గేమ్ నుంచి తొలగించాడు. కానీ తర్వాత రోహిణి చేతికి జెండా రావడంతో ఆమె గౌతమ్‌ను సైడ్ చేసింది. చివర్లో అవినాష్, రోహిణి ఇద్దరు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది.
బంపర్ ఆఫర్లు
ఇకపోతే బిగ్‌బాస్ ఈ సీజన్‌లో హౌస్‌మేట్స్‌కు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడు. నిన్న చెఫ్ సంజయ్‌తో కడుపునిండా భోజనం పెట్టించగా నేడు సంగీత కచేరి ఏర్పాటు చేశాడు. టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బ్యాండ్ జామర్స్‌ను ఇంట్లోకి పంపాడు. వీరు తమ పాటలతో అందరినీ మరో లోకానికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment