బిగ్‌బాస్ సీజన్ ఎండింగ్‌కు వచ్చేసింది. విన్నర్‌గా గెలిపించమని ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ పొందాలంటే తాను పెట్టే టాస్కులు గెలవాలన్నాడు బిగ్‌బాస్. అలా మొన్న ప్రేరణ, నిన్న నబీల్, నేడు విష్ణుప్రియ ఓట్ అప్పీల్ ఛాన్స్ పొందరు. ఆమె ఎలా గెలిచింది? ఏం మాట్లాడిందన్నది నేటి (డిసెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
అదరగొట్టిన గౌతమ్
బిగ్‌బాస్ ఈ రోజు మొదటగా పవర్ ఫ్లాగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. బజర్ మోగినప్పుడు ఫ్లాగ్ పట్టుకున్నవారు ఆ రౌండ్‌లో ఒకరిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్‌లో గౌతమ్ గెలిచి నబీల్‌ను రేసు నుంచి తప్పించాడు. తర్వాతి రౌండ్లలో కూడా గౌతమ్ ఒక్కడు ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా ఆట కొనసాగింది. గౌతమ్ దగ్గరి నుంచి జెండా లాక్కునేందుకు అందరూ కలిసి ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలా మిగతా రెండు రౌండ్లలో గౌతమ్.. ప్రేరణ, నిఖిల్‌ను తీసేశాడు.
గౌతమ్ దూకుడుకు బ్రేక్ వేసిన రోహిణి
తర్వాతి రౌండ్‌లో మిగిలినవాళ్లు గౌతమ్‌ను లాక్ చేశారు. అలా అతడి దగ్గరి నుంచి రోహిణి జెండా తీసుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ గౌతమ్‌ను రేసులో నుంచి తొలగించింది. అనంతరం అవినాష్.. విష్ణును రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. చివర్లో అవినాష్, రోహిణి మాత్రమే మిగిలారు. స్నేహితురాలిని గెలిపించడం కోసం అవినాష్ జెండా త్యాగం చేయడంతో రోహిణి కంటెండర్‌గా నిలిచింది. తనకోసం అవినాష్ త్యాగం చేయడంతో ఆమె చిన్నపిల్లలా ఏడ్చేసింది.
ఆగమైన సంచాలక్
బిగ్‌బాస్ నిలబెట్టు-పడగొట్టు అనే రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. అర్హత లేదనుకున్న వ్యక్తి ఫోటోను వేస్ట్ బాక్స్‌లో పడేయాలి. ఇందులో అందరూ వారు తెచ్చుకున్న ఫోటోలు పడేయగా గౌతమ్ తాను తీసుకున్న నబీల్ ఫోటో పడేయలేకపోయాడు. దీంతో సంచాలక్ రోహిణి.. నబీల్‌ను విజేతగా ప్రకటించింది. ఇక్కడే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ గేమ్ సరిగానే ఆడారా? అని ప్రశ్నించాడు.
విష్ణు గెలుపు
దీంతో ఆలోచనలో పడ్డ రోహిణి.. టాస్క్‌ను ప్రేరణ, విష్ణు మినహా ఎవరూ సరిగా ఆడనట్లు గుర్తించింది. చర్చోపచర్చల అనంతరం విష్ణు గెలిచినట్లు తెలిపింది. రోహిణి, విష్ణుప్రియలో ఎవరు ఓట్ అప్పీల్ చేయాలో హౌస్‌మేట్స్ నిర్ణయించాలన్నాడు. అవినాష్ మినహా మిగతా అందరూ విష్ణుకు సపోర్ట్ చేయడంతో ఆమె ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం పొందింది.
మహిళా విజేతగా నిలవాలనుంది
విష్ణుప్రియ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా వివిధ షోలలో నన్ను చూసి, ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను నన్నుగా ప్రేమించి పద్నాలుగువారాల వరకు తీసుకొచ్చినవారికి థ్యాంక్స్. నా ప్రవర్తన నచ్చనివారికి సారీ.. ఇంకా ఒక్కవారమే ఉంది. మీ ప్రేమాభినాలు ఇలాగే కొనసాగించి నన్ను విజేతను చేస్తారని కోరుకుంటున్నాను. వీలైనంతవరకు నిజాయితీగా ఉన్నాను. బిగ్‌బాస్ చరిత్రలో మహిళా విజేత అవ్వాలన్నది నా కోరిక.. అందుకు మీ సాయం కావాలి. మీ ఓటే నా గెలుపు అని ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించింది.
సంగీత కచేరీ
ఇక టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేకంగా సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. జామర్స్ బ్యాండ్‌ను పిలిచి లైవ్ కన్సర్ట్ ద్వారా వినోదాన్ని పంచాడు. సంగీతంతో హౌస్‌మేట్స్ తమ బాధలన్నీ మర్చిపోయి రిలాక్స్ అయ్యారు. పాదమెటు పోతున్నా.. అనే ఫ్రెండ్‌షిప్ పాటకైతే అందరూ కలిసిపోయి డ్యాన్స్ చేయడం కన్నులపండగ్గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment