
శనివారం నాడు హౌస్‌మేట్స్‌కు క్లాసులు పీకే నాగార్జున ఆదివారం రాగానే వారితో గేమ్స్ ఆడిస్తాడు. ఫన్నీ టాస్కులు, డ్యాన్సు స్టెప్పులతోనే ఎపిసోడ్ అంతా భలే గమ్మత్తుగా సాగుతూ ఉంటుంది. ఎలిమినేషన్ అంటారా? షూటింగ్ ఒకరోజు ముందే అయిపోవడంతో ఎలిమినేట్ అయ్యిందెవరనేది ఆల్‌రెడీ లీకైపోయి ఉంటుంది. హౌస్‌లోకి కన్నీళ్ల కడవ ఎత్తుకొచ్చిన నయని పావని ఈ వారం ఎలిమినేట్ అయింది.

హుషారైన డ్యాన్స్
ఇకపోతే ఫండే ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు రిలీజవగా అందులో గౌతమ్ హుషారుగా అందరితో కలిసి డ్యాన్స్ వేశాడు. యష్మి, హరితేజతో యమ హుషారుగా స్టెప్పేసిన గౌతమ్ తనతో మాత్రం అంత జోష్‌గా డ్యాన్స్ చేయలేదని హర్టయింది రోహిణి. దీంతో నాగ్.. అక్కతో ఫీలింగ్ వేరే ఉంటుందిలే అని సెటైర్ వేశాడు. మొత్తానికి నిన్న కంటెస్టెంట్ల ఫేసులు మాడిపోగా ఈ రోజు టాస్కుల వల్ల ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment