అక్క అంటే నీకేమైనా సమస్యా? యష్మిని నిలదీసిన నాగ్‌ | Bigg Boss Telugu 8: Nagarjuna Highlights contestants Relationship | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: అక్కా అంటే బూతు పదమా..? యష్మిని ప్రశ్నించిన నాగ్‌

Nov 2 2024 8:15 PM | Updated on Nov 3 2024 11:48 AM

Bigg Boss Telugu 8: Nagarjuna Highlights contestants Relationship

వచ్చీరాగానే మెగా చీఫ్‌ అయి తన సత్తా నిరూపించుకున్నాడు గౌతమ్‌. కానీ ఏమైంది? వచ్చినవారం తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్‌ అయిపోయేవారు. కానీ మణికంఠ సెల్ఫ్‌ ఎలిమినేషన్‌ వల్ల అతడు హౌస్‌లో ఉండగలిగాడు. ఒకసారి దెబ్బ తగలడంతో తన ఆట, మాట అన్నింటినీ ఓసారి రీచెక్‌ చేసుకున్నాడు.

క్రష్‌ను అక్క అనేసిన గౌతమ్‌
యష్మితో క్రష్‌ అంటూ లవ్‌ ట్రాక్‌ నడపడం జనాలకు నచ్చలేదేమో అని రియలైజ్‌ అయ్యాడు. ఆమెను కూడా అందరితో సమానంగా చూశాడు. ఈ క్రమంలో నామినేషన్స్‌లో ఆమెతో గొడవపడేటప్పుడు అక్కా అనేశాడు. అయితే అక్కా అని పిలవద్దని యష్మి తోకతొక్కిన తాచుపాములా లేచి బుసలు కొట్టింది.

రెండు బూతు పదాలు తెలుసుకున్నా
కట్‌ చేస్తే నయనితో గొడవ జరిగినప్పుడు కూడా గౌతమ్‌ ఆమెను అక్కా అన్నాడు. దీంతో ఆమె కూడా అక్కా అనొద్దంటూ సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చింది. దీని గురించి నాగ్‌ తాజా ప్రోమోలో చర్చించాడు.  కొత్తగా రెండు బూతు పదాలు తెలిశాయి, ఒకటి అక్క, రెండోది బ్రదర్‌ అని నాగ్‌ సెటైర్లు వేశాడు. అక్కా అంటే ప్రాబ్లం ఏంటని యష్మిని అడిగాడు. 

మధ్యలో ఎందుకు మాట్లాడావ్‌?
నామినేషన్స్‌లో గౌతమ్‌ విష్ణుతో మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో దూరావని ప్రశ్నించాడు. మరింత క్లారిటీ కోసం వీడియో కూడా చూపించాడు. అందులో గౌతమ్‌ అక్కా అనగానే యష్మి తమ్ముడు అనేసింది. సడన్‌గా క్రష్‌ అని, సడన్‌గా అక్కా అనేసరికి తీసుకోలేకపోయానని యష్మి బదులిచ్చింది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement